E-Paper
Advertisement

Horoscope weekly  February 2nd – 8th: ఆ రాశి జాతకులకు ఈ వారం ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి.     

Horoscope weekly  February 2nd – 8th: ఆ రాశి జాతకులకు ఈ వారం ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి.     

Horoscope Today : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. ఫిబ్రవరి 2 నుంచి 8వరకు ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి: ఈ రాశి వారికి ఈ వారం చిన్నతరహా పరిశ్రమలకు నూతన పెట్టుబడులు అందుతాయి. వారం ప్రారంభంలో ధన పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సన్నిహితులనుండి అవసరానికి సహాయ సహకారాలు అందుతాయి. బంధు మిత్రుల నుండి కీలక సమాచారం సేకరిస్తారు. వృత్తి వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం నుండి ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త అవసరం. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

వృషభ రాశి: ఈ రాశి వారికి ఈ వారం  సంతాన విద్యా విషయాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు. వృత్తి వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించి అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. నూతన వస్త్రా ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో మీ అంచనాలు నిజమవుతాయి. అన్ని రంగాల వారికి కార్యసిద్ధి కలుగుతుంది.

మిథున రాశి: ఈ రాశి వారు ఈ వారం వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు మరింత ఇబ్బంది కలిగిస్తాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. నూతన రుణ ప్రయత్నాలు కలిసిరావు. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. గృహ నిర్మాణ ప్రయత్నాలు కొంత జాప్యం తప్పదు. నిరుద్యోగులకు కష్టం ఫలించదు. అన్ని రంగాల వారికి కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వారం చివరన ఆప్తుల నుండి శుభవార్తలు అందుకుంటారు. చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు.

కర్కాటక రాశి: ఈ రాశి వారు ఈ వారం కుటుంబ సభ్యులతో దైవదర్శనం చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. ఇంటా బయట పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. గృహ నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. అన్ని రంగాల వారు ఆశించిన ఫలితాలు పొందుతారు.

సింహ రాశి: ఈ రాశి వారికి ఈ వారం  స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు కలిగినప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. జీవిత భాగస్వామితో ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఒక సంఘటన ఆశ్చర్యం కలిగిస్తుంది.  చిన్న తరహా పరిశ్రమలకు నూతన పెట్టుబడులు అందుతాయి. వారం ప్రారంభంలో ఆర్ధిక ఇబ్బందులుంటాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది.

కన్యా రాశి: ఈ రాశి ఉద్యోగస్తులకు ఈ వారం ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. చిన్నతరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వారం మధ్యలో కుటుంబ సభ్యుల మధ్య ఆకస్మిక గొడవలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. దాయదులతో స్థిరాస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది. ఆర్థిక వ్యవహారాలు మరింత ఆశాజనకంగా సాగుతాయి.

 

ALSO READ: నాగసాధువులు, అఘోరీలు ఒక్కటి కాదా? కళ్ళు బైర్లు కమ్మే నిజాలు

 

తులా రాశి: ఈ రాశి వారికి ఈ వారం సంతాన విద్యా ఉద్యోగ విషయంలో శుభవార్తలు అందుతాయి. వారం మధ్యలో ఆదాయ మార్గాలు తగ్గుతాయి. ఇంటా బయట నూతనోత్సాహంతో కొన్ని పనులను పూర్తిచేస్తారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. అన్ని రంగాల వారికి ఆశించిన ఫలితాలుంటాయి. ఉద్యోగస్తులకు చాలా కాలంగా పడుతున్న శ్రమ ఫలితం లభిస్తుంది.   వ్యాపారస్తులకు సకాలంలో పెట్టుబడులు అందుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు అందుతాయి.

వృశ్చిక రాశి: ఈ రాశి వారికి ఈ వారం వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. వారం ప్రారంభంలో సోదరులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయడం మంచిది. ముఖ్యమైన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. కుటుంబ సభ్యుల విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి.  ఇంటా బయట పరిస్థితులు అనుకూలంగా మార్చుకుని ముందుకు సాగుతారు.

ధనస్సు రాశి: ఈ రాశి వారికి ఈ వారం భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. సంఘంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంట్లో  కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులుంటాయి. దీర్ఘకాలిక రుణాలు నుండి ఉపశమనం పొందుతారు. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. వారం ప్రారంభంలో దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో పట్టుదలతో కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు.

మకర రాశి: ఈ రాశి వారు ఈ వారం వృత్తి వ్యాపారాలలో నష్టాలను అధిగమించి లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులు మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. గృహ నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో బంధుమిత్రులతో పాల్గొంటారు. చిన్న తరహా పరిశ్రమలకు పెట్టుబడులు అందుతాయి.  ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

కుంభ రాశి: ఈ రాశి విద్యార్థులు ఈ వారం శ్రమకు తగిన ఫలితం పొందుతారు. వ్యాపారపరంగా కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులతో కీలక విషయాల గురించి చర్చిస్తారు. ఆర్థికంగా కొంత మెరుగైన ఫలితాలు ఉంటాయి. వారం మధ్యలో ఒక సంఘటన మానసికంగా బాధిస్తుంది. వారం చివరలో శ్రమతో కానీ పనులు పూర్తికావు. ధనపరమైన ఒడిదుడుకులు చికాకు పరుస్తాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రభుత్వ వ్యవహారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

మీన రాశి: ఈ రాశి వారు ఈ వారం కొన్ని వ్యవహారాలలో జీవిత భాగస్వామి సహాయ సహకారాలు అందుకుంటారు. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రులతో వివాదాలను సర్దుబాటు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. అన్ని రంగాల వారికి అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి.  వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు అందుతాయి.

 

ALSO READ:  గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్‌ 

 

Related News

రథాన్ని విరగ్గొట్టిన లక్ష్మీదేవి! పూరీ జగన్నాథ క్షేత్రంలో.. నేటికీ జరిగే అద్భుతమైన ఆచారం

చార్ ధామ్ యాత్ర.. ఎటు చూసినా భక్తులు, 8 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్

ఆ దేవుడికి చేతులు కాళ్ళు ఎందుకు ఉండవు ?..అసలు రహస్యం ఇదే

Black Thread: ఈ రాశుల వారు కాలికి నల్ల దారం కట్టుకుంటే శని చెడు ప్రభావం తగ్గుతుంది

Anger: కోపాన్ని తగ్గించే రత్నం.. సోమవారంనాడు ధరిస్తే మీ జీవితమే మారిపోతుంది

ప్రసాదంగా లడ్డూ కాదు.. సాక్షాత్తూ ‘డబ్బులే’ ఇస్తారు! ఈ వింత ఆలయం గురించి మీకు తెలుసా?

రావి చెట్టు ఇంట్లో ఉండకూడదని ఎందుకు అంటారు? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు

Vastu tips: ఇలాంటి సీలింగ్ ఫ్యాన్ ఇంట్లోకి పేదరికాన్ని తెస్తుంది.. ఈ 5 తప్పులు చేయకండి

Big Stories

×