Arjun S/o Vyjayanthi Stroy : నందమూరి కళ్యాణ్ రామ్ నుంచి ఎన్ని సినిమాలు వచ్చినా… ఈయనకు సరిపోయే కథ కాదు ఇది అని అనేవాళ్లే ఎక్కువ మంది ఉంటారు. మొన్న ఆ మధ్య ‘బింబిసార’ అనే మూవీ వచ్చింది. అది అప్పట్లో బ్లాక్ బస్టర్ అయింది. దీని తర్వాత కళ్యాణ్ రామ్ నుంచి అలాంటి సినిమాలు రావాలని నందమూరి అభిమానులు కోరుకున్నారు. అయితే, ‘బింబిసార’ లాంటి మూవీ ఇప్పటి వరకు రాలేదు. తాజాగా కళ్యాణ్ రామ్ నటించిన ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ అనే మూవీ టీజర్ వచ్చింది. ఈ టీజర్ చూస్తే… కళ్యాణ్ రామ్ నటించిన ఓ సినిమాను అటుది.. ఇటు.. ఇటుది అటు తిప్పి ఈ మూవీ చేశారు అనిపిస్తుంది. అది ఏంటో ఇప్పుడు చూద్దాం…
కళ్యాణ్ రామ్ నుంచి లేటెస్ట్‌గా వస్తున్న మూవీనే ఈ ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. ఈ సినిమాలో విజయశాంతి చాలా రోజుల తర్వాత సిల్వర్ స్క్రీన్ పై కనిపించబోతుంది. విజయశాంతి లాస్ట్ మూవీ అంటే… 2020లో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’. ఆ సినిమాలో హీరో ఫ్రెండ్ మదర్ రోల్ చేసింది. ఫ్రెండ్ మదర్ అయినా… సినిమాలో లీడ్ క్యారెక్టరే. మళ్లీ దాదాపు 5 ఏళ్ల తర్వాత చేస్తున్న ఈ ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ సినిమాలో హీరోకు తల్లిగా కనిపించబోతుంది.
టైటిల్ అనౌన్స్ చేసిన టైంలోనే… విజయశాంతి మదర్ రోల్ చేస్తుందని అర్థమైపోయింది. అయితే అది ఎలాంటి పాత్ర అనేది ఇప్పుడు వచ్చిన టీజర్ తో తెలిసిపోయింది.
టీజర్ చూస్తే… తల్లి కొడుకుల మధ్య విభేదాలు ఉంటాయని స్పష్టంగా అర్థమవుతుంది. అయితే తల్లి అంటే కొడుక్కి చాలా ఇష్టమని కూడా తెలిసిపోతుంది. అయితే… కొడుకు అంటే… తల్లికి అసలు నచ్చదు అనేలా ఉంది టీజర్. పేగు తెంచుకుని పుట్టిన కొడుకుపై తల్లికి ఎందుకు అంత కోపం..? సొంత తల్లీ కొడుకులు విడిపోవడానికి కారణాలు ఏంటి??? అనేవి మూవీలో చూడాల్సిన పాయింట్స్.
ఈ స్టోరీ చెబితే… ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కదు.. అది కూడా కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన మూవీ పేరే గుర్తుకువస్తుందా..?
అవును… ఈ కథ కళ్యాణ్ రామ్ చేసిన ఓ సినిమాను గుర్తుచేస్తుంది. కళ్యాణ్ రామ్ కెరీర్ లో ఉన్న అతి తక్కువ హిట్ మూవీల్లో పటాస్ ఒకటి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ పటాస్ మూవీలో కామెడీతో పాటు తండ్రీ కొడుకుల మధ్య ఎమోషనల్ సీన్స్ కూడా ఆకట్టుకుంటాయి.
అయితే… పటాస్ మూవీలో కొడుకుపై తండ్రికి ప్రేమ ఉంటుంది. ఇక్కడ అర్జున్ సన్నాఫ్ వైజయంతి టీజర్ ప్రకారం… మూవీలో కొడుకుపై తల్లికి కోపం ఉంటుంది. అలాగే… పటాస్‌లో తండ్రి పెద్ద పోలీసాఫీసర్. ఇక్కడ అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీలో తల్లి కూడా పెద్ద పోలీసాఫీసరే.
ఇలా రెండు సినిమాల మధ్య సిమిలరిటీస్ చాలా ఉన్నాయి. దీని గమనించిన తర్వాత పటాస్ కథనే అటు.. ఇటు మార్చి ఈ అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీ చేస్తున్నారా..? అనే డౌట్స్ సోషల్ మీడియాలో వస్తున్నాయి.