BigTV English

Budh Gochar 2024: రేపే ‘మహాగోచరం’.. ఈ 3 రాశుల జీవితాల్లో పెను మార్పులు..!

Budh Gochar 2024: రేపే ‘మహాగోచరం’.. ఈ 3 రాశుల జీవితాల్లో పెను మార్పులు..!

Budh Gochar on June 14th: జూన్ 14వ తేదీన రాత్రి గ్రహాలకు రాజైన బుధుడు మిథునరాశిలోకి ప్రవేశించనున్నాడు. మిథున రాశిలో జూన్ 27న ఉదయించనున్నాడు. మిథునరాశిలోకి బుధుడు ప్రవేశించడం వల్ల మేష, సింహ, ధనుస్సు రాశుల వారికి అదృష్టం వరించనుంది. దీంతో ఈ రాశుల వారికి అనుకున్న పనులు నెరవేరే అవకాశాలు ఉన్నట్లు జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది.


1. మేష రాశి

బుధుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తుండడం వల్ల మేష రాశి వారికి లాభాలను తెచ్చిపెట్టనుంది. బుధ గ్రహం మిథున రాశిలోకి ప్రవేశించినా కూడా మేష రాశి వారికి అదృష్టం వరిస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ పొందే అవకాశాలు కూడా పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వాహనం కొనుగోలు చేయాలనుకుంటే, పాత వాహనాన్ని తొలగించి కొత్త వాహనం కొనుగోలు చేయవచ్చు. వైవాహిక జీవితంలో సంతోషకరమైన క్షణాలు రానున్నాయి. వ్యాపారం చేసే వారికి కూడా మంచి ఆదాయం లభిస్తుంది.


2. సింహ రాశి

సింహ రాశి వారికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన పనులు నిలిచిపోయినట్లయితే, బుధుడు మిథునరాశిలో ప్రవేశించిన వెంటనే అవి పూర్తవుతాయి. గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారం చేసే వారికి ప్రయోజనాలు చేకూరనున్నాయి. చేసే పనిని అందరూ మెచ్చుకుంటారు. ఉద్యోగం చేసేవారి జీతాలు పెరగడం, వ్యాపారం చేసేవారి ఆదాయం గణనీయంగా పెరగడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

Also Read: Surya Gochar 2024: 2 రోజుల్లో ఈ రాశుల వారి జీవితంలో మహా అద్భుతం.. మీ రాశి ఇందులో ఉందా..

3. ధనుస్సు రాశి

ఉద్యోగం వదిలి వేరే ఉద్యోగం లేదా వ్యాపారం చేయాలనుకునే వారికి ఈ సమయం అనుకూలంగా ఉండబోతుంది. వ్యాపారంలో ఆర్థికంగా లాభపడే పరిస్థితి ఉంటుంది. ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశాన్ని కూడా పొందుతారు. సమయం కూడా విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఏదైనా పరీక్ష ఫలితం కోసం వేచి ఉంటే వారు అందులో విజయం సాధిస్తారు.

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×