BigTV English
Advertisement

USA Vs IND Highlights: టీ20 వరల్డ్ కప్.. అమెరికాపై భారత్ ఘనవిజయం..!

USA Vs IND Highlights: టీ20 వరల్డ్ కప్.. అమెరికాపై భారత్ ఘనవిజయం..!

India Won by 7 Wickets against USA in T20 World Cup 2024: టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికా 8 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేయగా.. ఇండియా 18.2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పయి లక్ష్యాన్ని చేధించింది. సూర్య కుమార్ (50*), రిషబ్ పంత్ (18), శివమ్ దూబె(35*) రాణించడంతో టీమిండియా విజయం సాధించింది


111 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా తొలి ఓవర్లోనే కోహ్లీ డకౌట్ అయ్యీడు. ఆ తరువాతి ఓవర్లో కెప్టెన్ రోహిత్ శర్మ 3 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన పంత్, సూర్య కుమార్ యాదవ్ 3 వికెట్‌కు 29 పరుగులు జోడించారు. ఈ తరువాత పంత్ అవుట్ అవ్వగా శివమ్ దూబెతో కలిసి సూర్య భారత జట్టును విజయ తీరాలకు చేర్చాడు.

ముందుగా ఇండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో అమెరికా తొలుత బ్యాటింగ్ చేయనుంది. బ్యాటింగ్ ప్రారంభించిన అమెరికా తొలి ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది. అర్షదీప్ సింగ్ వేసిన తొల ఓవర్ తొలి బంతికి జహంగీర్ డకౌట్ కాగా చివరి బంతికి గౌస్(2) అవుట్ అయ్యాడు. బుమ్రా, పాండ్య, అర్షదీప్ సింగ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తుండటంతో అమెరికా పరుగులు చేయడానికి ఇబ్బందిపడుతోంది.  పవర్ ప్లే ముగిసేసరికి అమెరికా 2 వికెట్ల నష్టానికి 18 పరుగులు చేసింది.


Also Read: Team India: టీమ్ ఇండియాలో ఆ ప్రయోగం ఆగెదెన్నడు ?

ఆ తరువాత పాండ్య వేసిన 7వ ఓవర్లో అమెరికా కెప్టెన్ జోన్స్(11) అవుట్ అయ్యాడు. మొత్తంగా 10 ఓవర్లు ముగిసేసరికి అమెరికా 3 వికెట్ల నష్టానికి 42 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ 12వ ఓవర్లో అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఓపెనర్ టేలర్(24) బౌల్డ్ అయ్యారు. 15వ ఓవర్లో అర్షదీప్ సింగ్ బౌలింగ్‌లో నితీశ్ కుమార్ 27 పరుగులు చేసి పెవిలియన్ చేరుకున్నాడు. దీంతో అమెరికా 81 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. 17వ ఓవర్లో పాండ్యా కోరే అండర్సన్(14)ను అవుట్ చేశాడు. ఆ తరువాత ఓవర్లో అర్షదీప్ సింగ్ హర్మీత్ సింగ్(10)ను పెవిలియన్ చేర్చాడు.

భారత బౌలర్లలో అర్షదీప్ 4, పాండ్యా 2, అక్షర్ పటేల్ 1 వికెట్ తీసుకున్నారు.

Also Read: Jasprit Bumrah: ఒక రికార్డ్ కి దగ్గరలో బుమ్రా.. టీ 20 ప్రపంచకప్ లో సాధ్యమేనా?

టీమ్స్ వివరాలు

యునైటెడ్ స్టేట్స్: స్టీవెన్ టేలర్, షాయన్ జహంగీర్, ఆండ్రీస్ గౌస్(w), ఆరోన్ జోన్స్(c), నితీష్ కుమార్, కోరీ అండర్సన్, హర్మీత్ సింగ్, షాడ్లీ వాన్ షాల్క్‌విక్, జస్దీప్ సింగ్, సౌరభ్ నేత్రవల్కర్, అలీ ఖాన్

భారత్: రోహిత్ శర్మ(c), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(w), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్

Related News

IPL 2026: క్లాసెన్ కోసం కావ్య పాప స్కెచ్.. SRHలోకి హెట్‌మైర్‌, ఐపీఎల్ 2026 రిటెన్ష‌న్ ఎప్పుడంటే?

Ind vs aus 5Th T20I : స్టేడియంలో ఉరుములు, మెరుపులు మ్యాచ్ రద్దు.. సిరీస్ భారత్ కైవసం

Abhishek Sharma : కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన అభిషేక్ శర్మ.. ఏకంగా 1000 పరుగులు.. మ్యాచ్ రద్దు?

Shah Rukh Khan – Pujara : పుజారా కెరీర్‌ను కాపాడిన షారుఖ్.. ఆ ఆప‌రేష‌న్ కు సాయం !

Mohammed Shami : రూ .4 లక్ష‌లు చాల‌డం లేదు నెల‌కు రూ.10 ల‌క్ష‌లు ఇవ్వాల్సిందే..ష‌మీ భార్య సంచ‌ల‌నం

IND VS AUS 5th T20I: టాస్ ఓడిన టీమిండియా..తెలుగోడిపై వేటు, డేంజ‌ర్ ఫినిష‌ర్ వ‌స్తున్నాడు

Pratika Rawal Medal : ప్రతీకా రావల్ కు ఘోర అవ‌మానం..కానీ అంత‌లోనే ట్విస్ట్‌, ICC బాస్ జై షా నుంచి పిలుపు

Hong Kong Sixes 2025: దినేష్ కార్తీక్ చెత్త కెప్టెన్సీ.. కువైట్, UAE చేతిలో వ‌రుస‌గా ఓడిన టీమిండియా

Big Stories

×