BigTV English

Poli Padyami 2024: మీ ఇంట లక్ష్మీకటాక్షం.. మృత్యువు అనంతరం స్వర్గప్రాప్తి పొందాలా.. ఈ సోమవారం ఇలా చేయండి

Poli Padyami 2024: మీ ఇంట లక్ష్మీకటాక్షం.. మృత్యువు అనంతరం స్వర్గప్రాప్తి పొందాలా.. ఈ సోమవారం ఇలా చేయండి

Poli Padyami 2024: జీవితంలో ప్రతి ఒక్కరూ స్వర్గ సుఖాలు అనుభవించాలని అనుకుంటారు. మరణం తరువాత కూడ, నేరుగా స్వర్గానికి వెళ్లే అపూర్వమైన అవకాశం వస్తే ఎవరు కాదంటారు చెప్పండి. ప్రతి మనిషికి, జీవికి మరణం తథ్యం. కానీ మరణం అనంతరం స్వర్గప్రాప్తి పొందాలని మనం దానాలు, పుణ్యకార్యాలు కూడా చేస్తూ ఉంటాం. అలాంటి వరాన్ని పొందే అవకాశం భూలోకంలో ఉందని మీకు తెలుసా.. అయితే తెలుసుకోండి.


కార్తీక మాసం 30 రోజులు పూర్తైన తర్వాత మరుసటి రోజు అంటే మార్గశిర మాసం వస్తుంది. ఈ మాసం మొదటి రోజు పాడ్యమి వస్తుంది. ఆరోజు తెల్లవారుజామున 4:30 నుంచి 6 గంటల్లోపు దీపాలను నీళ్లల్లో వదలాలి. ఆ దీపాలు ఎలా అయితే స్వర్గానికి చేరుతాయో, ఈ 30 రోజులు కార్తీక మాసం వ్రతాన్ని ఆచరించిన వారు కూడా ఆ విధంగానే స్వర్గానికి చేరుతారని వేదాలు చెబుతున్నాయి. దీనిని పోలీ స్వర్గం అని అంటారు.

పోలీ స్వర్గం అంటే ఏమిటి?
పోలీ స్వర్గం అంటే ఏమిటో తెలుసా.. దీపాలను నీళ్లల్లో వదలడం. ఈ దీపాలను నదులలో వదులుతారు. నదులు అందుబాటులో లేనివారు ఇంట్లో ఒక పాత్రలో లేదా ఒక బకెట్లో నీళ్లను ఏర్పాటు చేసుకొని అందులో సమస్త నదులను ఆవాహన చేసుకుని పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు వేసి వాటిలో దీపాలను వదిలాలి. ధూపం, దీపం, నైవేద్యం మంగళహారతి ఇలా ఆ దీపానికి సమర్పిస్తే వారు స్వర్గం చేరుతారన్నది ప్రతీక. దీనికి సంబంధించి చిన్న కథ ప్రచారంలో ఉంది.


పోలీ స్వర్గం వెనుక ప్రాచుర్యంలో ఉన్న కథ..
పూర్వం ఒక రజక కుటుంబం ఉండేదట. ఒక అత్త, ఏడుగురు కోడళ్ళు వారు. చాకలి వృత్తి నేపథ్యంలో ప్రతిరోజు ప్రాతఃకాలం అందరూ నదికి వెళ్లిపోయి, ఏడో కోడల్ని మాత్రం ఇంటి పనులకు నియమించారు వారు. ఆ ఏడో కోడలి పేరు పోలి. అయితే కాలక్రమంలో కార్తీక మాసం వచ్చింది. రోజు కంటే వీళ్ళు ముందే నాలుగున్నర, అయిదు గంటలకే దుస్తులు భుజాన వేసుకొని నదికి వెళ్లి, దీపాలు నదిలో వదిలి వీరు పనులు చేసుకొని ఇంటికి వచ్చేవారు. పాపం ఏడో కోడలు నదికి వెళ్లి దీపాలు వదిలే అవకాశం లేకపోయే. ఇంటి పనంతా చేసుకుని మజ్జిగ చిలికి ఆ కవ్వానికి ఉన్న వెన్నని కొంచెం తీసుకొని ఇంట్లో పెరట్లో ఉన్న పత్తి చెట్టు దగ్గర ఉన్న పత్తిని కొంచెం తీసుకుని, వత్తి లాగా చేసుకుని తులసి కోట కింద బండ కింద చాటుగా దీపం వెలిగించేది.

తర్వాత తన నిత్య కృత్యాలు, ఇంట్లో మొత్తం మిగతా అందరికీ అన్ని సేవలు చేసి ఇంటి పని అంతా చక్కబెట్టేది. ఆమె ఇంత నియమనిష్ఠలతో, భక్తిశ్రద్ధలతో పూజలు , దీపం వెలిగించినందుకు గాను కార్తీక మాసం చివరి రోజున నేరుగా విష్ణు దూతలు వైకుంఠం నుంచి విమానం తీసుకుని వచ్చి ఆమెని శరీరంగా అంటే బ్రతికుండగానే శరీరంతో విమానంలో ఎక్కించుకొని వైకుంఠానికి తీసుకెళ్లారు.

Also Read: Lucky Zodiac Signs: 2025లో వీరు పట్టిందల్లా బంగారమే !

కార్తీకమాసం 30 రోజులు శ్రద్ధగా భక్తితో ఇంట్లో ఉన్న వాటితోటే ఆమె చేసిన ఉపచారానికి విష్ణు దూతలు మెచ్చారు. అప్పుడు అత్త మిగిలిన తోడికోడళ్ళు కూడా కార్తీక మాసంలో నది స్నానం చేసి, దీపాలు వెలిగించి పూజలు చేయడం వల్ల వారు పోలీని స్వర్గానికి తీసుకువెళ్తుండగా చూడగలిగారు. అదిగో మన పోలి వెళుతుంది.. పోలి వెళుతుంది.. పోలీ స్వర్గం వెళుతుందనడంతో పోలీ స్వర్గం అనే పేరు ప్రచారంలో ఉందని కథ.

ఈ కథలోని సారాంశం ఏమిటంటే కార్తీకమాసం 30 రోజుల్లో కూడా దీపాలు వెలిగించిన వారు, 31వ రోజు అంటే మార్గశిర మాసం మొదటి రోజున ప్రాతఃకాలం బ్రహ్మీ ముహూర్తంలో దీపాలను నీళ్లలో వదిలితే ఆ దీపాలు స్వర్గానికి చేరుతాయని, ఎవరైతే ఆ దీపాలను వదులుతారో వాళ్లు కూడా స్వర్గానికి చేరుతారని ప్రతీక. ఇలా మీరు కూడా కార్తీకమాసం 31వ రోజు అంటే ఈ సోమవారం డిసెంబర్ 2వ తేదీన, ఇలా దీపాలు వెలిగించి, నదిలో వదిలినా లేక ఇంట్లో ఈ కార్యాన్ని నియమనిష్ఠలతో చేసినా, మరణం అనంతరం స్వర్గానికి చేరుకుంటారని వేదాలు చెబుతున్నాయి. ఈ ఒక్కరోజు దీపాన్ని నీళ్లల్లో వదిలితే జీవితాంతం వారు సకల సౌఖ్యాలు, లక్ష్మీ కటాక్షం కూడా పొందుతారు.

– డాక్టర్ శృతి

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×