Gundeninda GudiGantalu Today episode December 1st : నిన్నటి ఎపిసోడ్ లో.. రవి, శృతిలు తమ లైఫ్ను ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంతలోనే శృతికి ఫ్రెండ్ ఫోన్ చేసి హనీమూన్ కి ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు కాకపోతే మళ్ళీ ఫ్యూచర్లో ఎంజాయ్ చేయలేం. రోజురోజుకు బరువులు, బాధ్యతలు పెరుగుతాయని సలహాయిస్తుంది. దీంతో హానీమూన్ కి వెళ్లాదనీ రవిని శృతి రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. కానీ రవి మాత్రం ఇప్పటికే మన రెండు ఫ్యామిలీలు హ్యాపీగా లేరు మనం ఎలా ఇలా అంటాడు. మనం వెళ్ళిపోయినా బాధ వారి మొహాల్లో లేదు. ఉంటే మన కోసం ఒక్కరైనా వచ్చేవారు. అప్పుడు మనం వాళ్ల కోసం ఆలోచిస్తూ అన్ని ఆశలు వదిలేసుకోవడం అవసరమా అని శృతి అంటుంది. ఇక శృతి ఫీల్ అవుతుందని రవికి ఇష్టం లేకపోయినా బలవంతంగా ఒప్పుకుంటాడు. బాలు డబ్బులు కోసం అవమానాలను ఎదుర్కొంటాడు. తనని దొంగ అని అనడంతో బాలు తన పరిస్థితి చెప్పి ఫీల్ అవుతాడు. అది చూసిన మీనా తన వల్లే ఆయనకు ఇంత కష్టం వచ్చిందని బాధపడుతూ ఏడుస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ప్రోమో విషయానికొస్తే.. నిన్నటి ఎపిసోడ్ లో మీనాక్షి ప్రభావతి కి ఫోన్ చేసి రవి గురించి ఏం ఆలోచించావని ప్రశ్నిస్తుంది. త్వరగా రవిని ఇంటికి తీసుకురాకపోతే శృతి వాళ్ళ నాన్న రవిని ఇల్లారికం తీసుకెళ్లే ప్రమాదముందనీ, ఆ తర్వాత ఎలాంటి ప్లాన్ చేసిన వర్కౌట్ కాదని చెబుతోంది మీనాక్షి. డబ్బులు మీద ఆశతో సత్యంకు తెలియకుండా రవిని కలిసి ఒప్పించాలని అనుకుంటుంది. కామాక్షితో కలిసి వెళ్లేందుకు ప్లాన్ వేస్తుంది. ఇక రవి శృతిలు ఇంట్లోకి అడుగు పెడితే డబ్బులకు డోకా ఉండదని ఆశ పడుతుంది. బాలుకు తెలియకుండా వెళ్ళాలి అని అనుకుంటంది ఇక సత్యంను కాకా పడుతుంది. ప్రభావతి సత్యం పై లేని ప్రేమలు వలక బోస్తుందని అనుమానం కలుగుతుంది.. ఇకపోతే బాలు నేను ఎక్కడ బాధ పడతానో అని అబద్దం చెప్పాడు. అని ఏడుస్తూ ఇంటికి వస్తుంది. ఇంట్లో వాళ్ళు పెట్టే బాధలు తట్టుకోలేక ఇలా ఏదోకటి అని జాయిన్ అయ్యాడని అనుకుంటుంది. భర్త కష్టం తలచుకొని, తనని దొంగా అన్నారని అనుకుంటూ బాధ పడుతుంది. ఇలా అవమానాలు పడుతూ అక్కడ పని చెయ్యాల్సిన పని లేదు అని అనుకుంటుంది.
ఎదో ఆలోచిస్తూ ఇంటికి వస్తుంది. ప్రభావతి మీనాను చూసి పొద్దున్న లేచినప్పటి నుంచి మంథనాలు జరిపి వస్తున్నావా అని అడుగుతుంది. ప్రభావతి మాట లెక్క చెయ్యకుండా మీనా లోపలికి వెళ్ళిపోతుంది. ఇక బాలు కోసం ఏదైనా చెయ్యాలని అనుకుంటుంది.ఇక ప్రభావతి తన ముద్దుల కొడుకు మనోజ్ కు లేని జాబ్ గురించి తెగ బిల్డప్ ఇస్తుంది ప్రభావతి. జాబుకు వెళ్లడం కోసం కంపెనీలో చెప్పి కారు తీసుకోమని తండ్రి సత్యం చెప్పడంతో .. ప్రభావతి కూడా మనోజ్ కు సపోర్టుగా మాట్లాడుతుంది. మామయ్య కారు కొనుకొమంటున్నాడని, దానికి వాడు మొహమాటపడుతున్నాడని రోహిణికి చెబుతుంది ప్రభావతి.. మనోజ్ తో కలిసి నువ్వే వాడి వెంట వెళ్లి కారు తీసుకుని రండి అని ప్రభావతి చెబుతుంది. ఆ మాట విన్న మనోజ్ మోహంలో టెన్షన్ మొదలవుతుంది. ఇక రోహిణి కూడా మనోజ్ గొప్పలు చెప్పడంలో రెచ్చిపోతుంది. మనోజ్ ను కారు తీసుకోమని బలవంతపు పెడుతుంది. ఈనెల మనోజ్ 15 కార్లు అమ్మాడంటూ ప్రభావతికి రోహిణి చెబుతోంది. మనోజ్ కు పడుకోవడానికి ఏసీ క్యాబిన్ కూడా ఇచ్చారంటూ ప్రభావతి చెబుతోంది. దీంతో మీకు ఎలా తెలుసు ఆంటీ అని అడుగుతుంది. . దీంతో మనోజ్ కంగారు పడతాడు.. అమ్మ ఎందుకు నన్ను అడ్డంగా ఇరికించేసింది అని ఆలోచిస్తాడు. ఏమి చెప్పలేక మౌనంగా ఉంటాడు. రోహిణి కారును ఎప్పుడు కొందామని అడుగుతుంది. వీళ్ళను చూస్తూ సత్యం ఉంటాడు. బాలు గురించి తెలిసిన నిజాన్ని అడుగుతుంది. ఇంట్లో ఖాళీగా ఉంటే ఏదోకటి అంటారని చెబుతాడు. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. సోమవారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..