Ram Navami 2025 Wishes: చైత్ర మాసం శుక్ల పక్షం తొమ్మిదవ రోజున రామ నవమి పండుగ జరుపుకుంటారు. ఈ సంవత్సరం రామ నవమిని ఏప్రిల్ 6, 2025న జరుపుకోనున్నాము. ఈ రోజు శ్రీరాముని ఆరాధనకు అంకితం చేయబడింది. ఈ రోజున శ్రీరాముడు దశరథ రాజుకు జన్మించాడని చెబుతారు. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం రామ నవమిని జరుపుకుంటారు.
రామ నవమి హిందువుల ప్రధాన పండుగ. కాబట్టి ఈ పవిత్రమైన రోజున మీ ప్రియమైన వారికి శ్రీరాముని పట్ల భక్తి , ప్రేమతో శుభాకాంక్షలు తెలియజేయండి.
1. రాముడి చల్లని దీవెనలు మీపై ఎల్లప్పుడూ..
ఉండాలని కోరుకుంటూ శ్రీరామ నవమి శుభాకాంక్షలు!
2. ధర్మాన్ని కాపాడేందుకు జీవితాన్నే త్యాగం చేసిన
మహోన్నత ప్రజా పాలకుడు శ్రీరాముడు
లోక కళ్యాణం కోసం ఎన్నో త్యాగాలకోర్చిన సీతారాముల
పవిత్ర బంధం అజరామరమైనది,
భవిష్యత్ తరాలకు ఆదర్శనీయమైనది
శ్రీరామ నవమి శుభాకాంక్షలు!
3. శ్రీ రాముడు మీ ఇంట్లో అందరికీ సుఖ సంతోషాలు
ఆయురారోగ్యాలను ఇవ్వాలని కోరుకుంటూ..
శ్రీరామ నవమి శుభాకాంక్షలు!
4. శ్రీ రామ రామ రామేతి
రమేరామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం
రామనామ వరాననే
శ్రీరామ నవమి శుభాకాంక్షలు!
5. ఈ జగదభి రాముడు
కౌసల్య రాముడు, జానకీ రాముడు
దశరథ రాముడి శుభాశిస్సులు..
మీపై ఉండాలని కోరుకుంటూ
శ్రీరామ నవమి శుభాకాంక్షలు!
6. మీకు మీ కుటుంబ సభ్యులకు
శ్రీరామ నవమి శుభాకాంక్షలు!
7. సీతారాముల శుభాశీస్సులతో
అందరి మనస్సులు, మంచి ఆలోచనలతో ..
నిండి ఉండాలని కోరుకుంటూ
శ్రీ రామ నవమి శుభాకాంక్షలు
8. అందరికీ శ్రీ రామనవమి
పర్వదిన శుభాకాంక్షలు ! జై శ్రీరామ్
9. హక్కుల కంటే బాధ్యత గొప్పదన్నది
రామతత్వం
కష్టంలో కలిసి నడవాలన్నది
సీతాతత్వం
అందరికీ శ్రీ రామ నవమి శుభాకాంక్షలు !
Also Read: కుజుడి సంచారం.. ఈ రాశులపైనే ఎక్కువ ప్రభావం
10. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామా
కాళాత్మక పరమేశ్వర రామా
శేష తల్ప సుఖనిద్రిత రామా
బ్రహ్మాద్యమక ప్రార్థిత రామా
శ్రీ రామనవమి శుభాకాంక్షలు !
11. శ్రీరాముడి సద్గుణాలు సదా ఆదర్శం
రాముడు ఆచరించిన ధర్మం
ప్రపంచానికే శాంతి మార్గం
మీకు మీ కుటుంబ సభ్యులకు
శ్రీ రామ నవమి శుభాకాంక్షలు!