BigTV English

Viral Video: మనిషిలా మాట్లాడే కాకి.. నెట్టింట వీడియో వైరల్..

Viral Video: మనిషిలా మాట్లాడే కాకి.. నెట్టింట వీడియో వైరల్..

కొన్ని రకాల పక్షులు మనుషుల మాదిరగానే మాట్లాడుతాయి. అచ్చం మనిషిలా కాకపోయినా, ఇంచుమించు మనుషుల వాయిస్ ను అనుకరిస్తాయి. రామ చిలుక మనిషిలా మాట్లాడుతుంది. కోకిలలు కూడా మనుషు లాగే అరుస్తుంది. కానీ, కాకి ఎప్పుడైనా మనిషిలా మాట్లాడ్డం చూశారా? ఏంటీ.. కాకి మాట్లాడుతున్నదా? అని ఆశ్చర్యపోతున్నారా? అవును నిజంగానే కాకి మాట్లాడుతుంది. ప్రస్తుతం మాట్లాడే కాకికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ కాకి కథా కమామిషూ ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..


మహారాష్ట్రలో మాట్లాడే కాకి!

మహారాష్ట్రలో ఇప్పుడు మాట్లాడే కాకి హాట్ టాపిక్ గా మారింది. ఆ రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ నలుగురు కలిసినా ఈ మాట్లాడే కాకి గురించే మాట్లాడుకుంటున్నారు. పాల్ఘర్ జిల్లా షాపూర్ తాలూకాలోని గర్గావ్ లో ఈ మాట్లాడే కాకి ఉంది. గత కొద్ది రోజులుగా ఈ కాకి ఇంట్లో వాళ్లతో మాట్లాడుతూ అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. ఈ మాట్లాడే కాకిని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తరలి వస్తున్నారు.


మూడు సంవత్సరాల క్రితం గర్గావ్ కు చెందిన ముకానే అనే ఆవిడకు తన తోటలో ఓ గాయపడిన కాకి కనిపించింది. దాన్ని ఆమె కాపాడి ఇంటికి తీసుకొచ్చింది. కొద్ది రోజుల పాటు దాన్ని జాగ్రత్తగా పెంచింది.  ఆ తర్వాత కోలుకుంది. ఆ తర్వాత ఇంటి వాళ్లతోనే కలిసిపోయి జీవిస్తోంది. వాళ్లు పెట్టింది తిన ఇంటి పరిసరాల్లోనే ఉంటుంది. ఇక ఆ కాకి నెమ్మదిగా మనుషుల మాదిరిగా మాట్లాడ్డం మొదలుపెట్టింది. ఇంట్లో వాళ్లు మాట్లాడే మాటలను ప్రతి రోజు విని, తను కూడా అనుకరించింది. కాకా, బాబా, మమ్మీ, మామా, దాదా సహా పలు పదాలను పలుకుతోంది. నెమ్మదిగా మనుషులు మాట్లాడే చాలా మాటలు నేర్చుకుంది.  ప్రస్తుతం ఈ కాకి అచ్చం మనుషుల్లాగే మాట్లాడుతోంది. దాని మాటలు విని ఇంట్లో వాళ్లతో పాటు గ్రామస్తులు కూడా ఆశ్చర్యపోతున్నారు.

Read Also: చిక్కుల్లో అలేఖ్య చిట్టీ? నోరు జారితే ఎన్నేళ్ల జైలు శిక్షో తెలుసా?

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నెటిజన్

తాజాగా ఆ కాకికి సంబంధించి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజా వీడియోలో కాకి  బల్ల మీద కూర్చొని మనుషుల్లా మాట్లాడుతూ కనిపించింది. ఆ కాకి ‘కాకా.. కాకా’ అంటూ అరిచినట్లు కనిపిస్తోంది.  కాకి మాట్లాడుతున్న సమయంలో వీడియోను షూట్ చేసి సోసల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అచ్చంగా మనిషిని పోలినట్లే మాట్లాడటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు క్రేజీగా రియాక్ట్ అవుతున్నారు.  ఈ కాకికి మరికాస్త ట్రైనింగ్ ఇస్తే పూర్తి మనుషుల మాదిరిగా మాట్లాటం ఖాయం అని కామెంట్స్ పెడుతున్నారు. బహుశ ప్రపంచంలో మనుషుల మాదిరిగా మాట్లాడే కాకి ఇదొక్కటే అయి ఉంటుందని మరికొంత మంది అభిప్రాయపడుతున్నారు.

Read Also:  వీధి కుక్కలు ఉండాలి.. లేకపోతే ఎన్ని నష్టాలో చూడండి – తాజా స్డడీలో షాకింగ్ విషయాలు!

Related News

Viral CCTV Video: ఫ్యాక్టరీకి వచ్చిన సింహం.. ఎదురుగా మనిషి.. ట్విస్ట్ తెలిస్తే నవ్వులే.. వీడియో వైరల్!

Elephant video: ఈ పిల్ల ఏనుగు పడుకున్న వ్యక్తిని లేపీ మరీ..? నిజంగా ఇది అద్భుతం.. వీడియో వైరల్

Fight Viral Video: విద్యార్థుల ముష్టి యుద్ధం.. చొక్కాలు చినిగినా, వదల్లేదు.. వైరల్ వీడియో!

Jana Gana Mana: జాతీయ గీతాన్ని చిన్నారి ఎంత ముద్దుగా పాడిందో చూడండి.. వావ్ అనాల్సిందే..!

Burning pyre reel: స్మశానంలో కాలుతోన్న శవం పక్కన.. డ్యాన్స్ చేస్తూ రీల్స్ చేసిన అమ్మాయి, వీడియో వైరల్

Viral wedding: అందుకే ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం.. వింత వివాహంపై స్పందించిన అన్నదమ్ములు

Big Stories

×