Jayakrishna: ఘట్టమనేని కుటుంబం నుంచి మరో హీరో రాబోతున్న విషయం తెల్సిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు అన్న రమేష్ బాబు తనయుడు జయకృష్ణ టాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్దమయ్యింది. ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ ను షేక్ చేసిన డైరెక్టర్ అజయ్ భూపతి.. జయకృష్ణ డెబ్యూ గురించి ఇప్పటికే స్క్రిప్ట్ పనులు ముగిశాయి. ఇక ఈ సినిమాలో రాషా తడానీ హీరోయిన్ గా నటిస్తుంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు రానుంది.
ఇక జయకృష్ణ టాలీవుడ్ ఎంట్రీ బాధ్యతలను బాబాయ్ మహేష్ బాబు- పిన్ని నమ్రత తీసుకున్నారు. రమేష్ బాబు మరణం తరువాత ఆ ఇద్దరు పిల్లలని వారే చూసుకుంటున్నారు. మహేషే స్వయంగా అజయ్ చెప్పిన కథను విని ఓకే చేశాడట. కొత్త కుర్రాడి సినిమాలా కాకుండా అన్ని ఎలిమెంట్స్ ఉండి ఒక కమర్షియల్ సినిమాలా ప్లాన్ చేయమని అజయ్ కు సూచించాడట.
ఈ సినిమా ఒక సరికొత్త లవ్ స్టోరీ అని, క్లైమాక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని, అసలు దానికే మహేష్ ఫిదా అయ్యాడని సమాచారం. అంతేకాకుండా ఈ సినిమాను తన మొదటి సినిమా రాజకుమారుడు రేంజ్ లో తీర్చిదిద్దాలని అజయ్ కు చెప్పాడట మహేష్. అందుకే మోహన్ బాబును విలన్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఎంతమంది స్టార్ హీరోల సినిమాల్లో విలన్ క్యారెక్టర్ వచ్చినా ఒప్పుకొని మోహన్ బాబు.. కొత్త కుర్రాడి సినిమాలో విలన్ గా చేయడానికి కారణం.. కృష్ణ మీద ఉన్న అభిమానమే అని తెలుస్తోంది. మోహన్ బాబు.. కృష్ణ, రమేష్, మహేష్ లతో కలిసి నటించాడు. కృష్ణ – మహేష్ కలిసి నటించిన కొడుకు దిద్దిన కాపురం సినిమాలో విలన్ గా చేశాడు. రమేష్ హీరోగా నటించిన సినిమాల్లో కూడా విలన్ గా చేశాడు. ఇప్పుడు మూడో జనరేషన్ కొడుకు ఎంట్రీ ఇవ్వడం.. రమేష్ కొడుకు కావడంతో మోహన్ బాబు కూడా కాదనలేక ఈ పాత్రను ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.
ఘట్టమనేని కుటుంబం నుంచి వచ్చిన సుధీర్ బాబు.. ప్రస్తుతం విజయం కోసం ఎదురుచూస్తున్న విషయం తెల్సిందే. అలా జయకృష్ణ కాకుండా.. మొదటి నుంచే మంచి ప్లానింగ్ తో మహేష్ – నమ్రత.. జయకృష్ణను తీర్చిదిద్దుతున్నారు. ఇక దసరాకు ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. మరి మొదటి సినిమాతో ఘట్టమనేని హీరో.. తాతను గుర్తుచేస్తాడో.. తండ్రిని గుర్తుచేస్తాడో.. లేక బాబాయ్ ని గుర్తుచేస్తాడో చూడాలి.