BigTV English

Maha Purusha Rajayogam 2024: జూన్‌లో అద్భుతమైన రాజయోగం.. ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారం..!

Maha Purusha Rajayogam 2024: జూన్‌లో అద్భుతమైన రాజయోగం.. ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారం..!

Bhadra Maha Purusha Rajayogam: బుధుడు జూన్ నెలలో తన రాశిని మార్చుకోబోతున్నాడు. ఫలితంగా మహాపురుష రాజయోగం ఏర్పడనుంది. దీంతో మూడు రాశుల వారి జీవితమే మారిపోవడంతో పాటు వారు కోరుకున్న కోరికలన్నీ నెరవేరతాయి. గ్రహాల రాకుమారుడు బుధుడు. మే 31వ తేదీన మిథున రాశిలోకి వెళ్తాడు. రాశిచక్రాన్ని బుధుడు త్వరగా మార్చుకోగలడు.


మేధస్సు, వ్యాపారం కమ్యూనికేషన్, సాంకేతికత మొదలైన వాటికి బుధుడు బాధ్యత వహిస్తాడు. జూన్ 14 నుంచి మిథున రాశిలోకి బుధుడు ప్రవేశించనున్నాడు. దీని వల్ల భద్ర పంచమహాపురుష రాజయోగం ఏర్పడనుంది. ఈ రాజయోగం అన్ని రాశి చక్రాలను ప్రభావితం చేస్తుంది. ఈ కాలంలో పలు జాతకులు శుభాలను పొందుతారు.

భద్ర మహాపురుష యోగం అంటే..
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం బుధుడు సొంత రాశి లేదా ఉన్నతమైన రాశి లేదా మూల త్రికోణంలో ఉన్నప్పుడు పంచ మహాపురుష యోగం ఏర్పడుతుంది. అటువంటి యోగంలో జన్మించిన వ్యక్తులు చాలా ధైర్యవంతులుగా పరిగణించబడతారు. శత్రువులను నాశనం చేయగల గొప్ప సామర్థ్యాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ రాజయోగం వల్ల అనుగ్రహం పొందే రాశులేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


Also Read: Mercury Transit 2024 : మే 31 నుండి ఈ రాశుల వారికి కష్టాలే.. శత్రువులు ఆధిపత్యం, అప్పులు పెరిగే ఛాన్స్

మిథున రాశి:
భద్ర మహాపురుష రాజయోగం మిథునరాశి వారికి ఎంతో శుభకాలం. ఈ సమయంలో వీరు కెరీర్ పరంగా సానుకూల ఫలితాలను పొందుతారు. అంచనాలకు తగ్గట్టుగా కొత్త ఉద్యోగాలకు సంబంధించి ఆఫర్లు కూడా వస్తాయి. ఇది వారికి ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. కోరికలన్నీ ఈ కాలంలో నెరవేరుతాయి. ఉత్తమ ఫలితాలను కూడా పొందుతారు. ఆర్థిక పరిస్థితులకు ఇది అదృష్ట కాలం. డబ్బు కూడా ఆదా చేస్తారు. విదేశాలకు వెళ్లి డబ్బు సంపాదించుకోవాలనే కోరిక నెరవేరుతుంది. ఈ రాజయోగం వల్ల మంచి ఆదాయం వస్తుంది.

సింహరాశి:
ఈ రాశి జాతకులకు ఈ కాలంలో విజయం పురోగతి సాధించడంపైనే దృష్టి ఉంటుంది. బుధుడు సంచారం వలన వీరికి శుభ యోగం ఆద్యాత్మికత వైపు కూడా మొగ్గు చూపేలా చేస్తుంది. పనికి సంబంధించి ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. ప్రమోషన్లు, ప్రశంసలు లభించే అవకాశం ఉంది. సకాలంలో మంచి లాభాలను కూడా గడిస్తారు. అంతేకాకుండా వీరు డబ్బు సంపాదించేందుకు ఇది సువర్ణ అవకాశం. కార్యాలయంలో అంకితభావంతో పని చేస్తారు.

Also Read: జూన్ 5న పంచగ్రహ కూటమి..ఈ రాశుల వారు తస్మాత్ జాగ్రత్త!

మకరరాశి:
మహా పురుష రాజయోగం కారణంగా మకర రాశి వారికి అదృష్టం లభిస్తుంది. కెరీర్‌లో అత్యుత్తమ ప్రయోజనాలను పొందుతారు. అంతేకాకుండా వీరి ప్రయత్నాలకు ప్రమోషన్లు కూడా లభిస్తాయి. వివిధ కారణాల వల్ల విదేశాలకు వెళ్లే అవకాశం కూడా ఉంది. వ్యాపారస్తులు ఈ కాలంలో మంచి లాభాలను పొందుతారు. ప్రత్యర్థుల నుంచి పోటీ ఇచ్చి తమ విలువలను నిరూపించుకుంటారు. ఆర్థిక పరిస్థితి గణనీయంగా పెరుగుతుంది. జీవిత భాగస్వామితో వీరి బంధం మరింత బలపడుతుంది.

Tags

Related News

TTD: తిరుమల భక్తులు అలర్ట్.. శ్రీవారి దర్శనానికి బ్రేక్

Gold ganesh idol: ఒకే అంగుళంలో అద్భుతం.. మెరిసే బంగారు వినాయకుడు.. మీరు చూశారా?

Hanuman darshan: భక్తుల మనసు దోచుకుంటున్న హనుమంతుడు.. లైఫ్ లో ఒక్కసారైనా చూసేయండి!

Ganesh Chaturthi Song: “వక్రతుండ మహాకాయా”.. ఏళ్లు గడిచినా దైవత్వాన్ని నింపుతూ!

Ganesh Chaturthi 2025: పండగ రోజు వినాయకుడిని ఈ సమయంలో పూజిస్తే.. అంతా శుభమే !

Lord Ganesha: మనిషి రూపంలో దర్శనం ఇచ్చే గణపతి – ఆలయ విశిష్టత తెలిస్తే ఆశ్చర్యపోతారు

Big Stories

×