Big TV Kissik Talks: భాను శ్రీ (Bhanu Sri) .. యాంకర్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఈమె..పలు చిత్రాలలో హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించి, తనకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకుంది. 2015లో వచ్చిన “బాహుబలి: ది బిగినింగ్’ సినిమాలో కీలకపాత్ర పోషించడమే కాకుండా ఆ సినిమాలో హీరోయిన్ తమన్నా (Tamannaah) కు కొన్ని సన్నివేశాలలో డూప్ గా కూడా వ్యవహరించింది ఈ ముద్దుగుమ్మ. ఇక తర్వాత ‘మహానుభావుడు’ , ‘మిస్టర్’, ‘కాటమరాయుడు’, ‘క్లిక్’ అంటూ పలు చిత్రాలలో నటించి భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇక చివరిగా భాను శ్రీ ‘నల్లమల’ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది.. ఇందులో ప్రముఖ సింగర్ సిద్ శ్రీరామ్ (Sid Sriram) ఆలపించిన ‘ఏమున్నవే పిల్ల ఏమున్నవే’ అనే పాటలో నర్తించి ఓవర్ నైట్ లోనే స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుంది భాను శ్రీ. 2021 లో విడుదలైన ఈ సినిమా భారీ విజయం అందుకుంటుందని ఎన్నో కలలు కంది. కానీ ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఇకపోతే ఆ సమయంలో కూడా ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఇది కాకుంటే ఇంకోటి అన్నట్టుగానే కెరియర్ను కొనసాగిస్తోంది.
ఎన్ని గొడవలు వచ్చినా నేను నీ దాన్నే – భాను శ్రీ
ఇకపోతే ఈమె బిగ్ బాస్ లో పాటిస్పేట్ చేసింది. అంతే కాదు గోల్డ్ రష్, టాలీవుడ్ స్క్వేర్స్ వంటి టీవీ షోలలో కూడా పాల్గొనింది. ఇకపోతే ఈమధ్య ఫారిన్ కంట్రీస్ లో ఈవెంట్స్ కి అటెండ్ అవుతూ అక్కడి నుంచి కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ అలరిస్తున్న ఈమె తాజాగా హైదరాబాద్ కి చేరుకుంది. అందులో భాగంగానే బిగ్ టీవీ నిర్వహిస్తున్న ‘కిస్సిక్ టాక్స్’ అనే కార్యక్రమానికి గెస్ట్ గా వచ్చింది. ఈ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో జబర్దస్త్ వర్ష హోస్టుగా వ్యవహరిస్తూ ఉండగా ఎన్నో విషయాలను పంచుకుంది భాను శ్రీ. అందులో భాగంగానే తన ప్రేమ, బ్రేకప్ గురించి చెప్పుకొచ్చింది. మీ మనసులో ఎవరైనా ఉన్నారా? లేక ఎవరికోసమైనా ఎదురు చూస్తున్నారా ? అని వర్షా ప్రశ్నించగా.. లేదు ఆల్రెడీ నా జీవితంలో ఒకరు ఉన్నారు అంటూ చెప్పుకొచ్చింది. ఇక అతడితో మీరేదైనా ఎదురుగా ఉంటే చెప్పాలనుకున్న మాట ఏంటి? అని అంటే.. మన ఇద్దరి మధ్య ఎన్ని గొడవలు వచ్చినా.. ఏం జరిగినా.. 100% నేను నీదాన్ని.. నువ్వు నా వాడివే..అంటూ తెలిపింది..
also read:Kantara 2: కాంతారా 2 షూటింగ్లో అపశృతి.. పడవ బోల్తా.. హీరోతో సహా!
బ్రేకప్ పై భాను శ్రీ క్లారిటీ..
ఇకపోతే భాను శ్రీ కి బ్రేకప్ అయ్యింది అంటూ వార్తలు జోరుగా వినిపించిన విషయం తెలిసిందే. దీనిపై కూడా ఆమె స్పందించింది. రిలేషన్ లో బ్రేకప్ ఉండడం సహజం. నిజమైన ప్రేమ ఎప్పటికీ బ్రేక్ కాదు. జీవితాంతం మనం జీవించినంత కాలం ఆ ప్రేమ ఉంటుంది. అందుకే మా మధ్య ఏ గొడవలు వచ్చినా సరే ఒక పది రోజులు మౌనంగా ఉండి, అయినా సరే ఆ సమస్యను పరిష్కరించుకుంటాము. ఇక నా జీవితంలో బ్రేకప్ అనే పదానికి చోటు లేదు అంటూ చెప్పుకొచ్చింది భాను శ్రీ. ఈమె చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. నీలాగే అందరూ ఆలోచిస్తే అసలు ఈ సమాజంలో బ్రేకప్ అనే అంశానికే చోటు ఉండదు అని కామెంట్ చేస్తున్నారు. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు ఇద్దరి జీవితాలను నాశనం చేస్తాయని, సమస్య వస్తే కూర్చొని మాట్లాడుకోవాలి తప్ప బ్రేకప్ లేదా విడాకులు వంటివి తీసుకోకూడదు అంటూ కూడా భాను శ్రీ తెలిపింది. ఇక ప్రస్తుతం భాను శ్రీ చేసిన కామెంట్లలో ఇంత డెప్త్ ఉండడం చూసి అభిమానులు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.