Big Stories

Mithun Sankranti 2024: మిథున సంక్రాంతి ఎప్పుడు? అసలు దీని ప్రాముఖ్యత ఏంటి

Mithun Sankranti 2024: హిందూ మతంలో, సూర్య భగవానుడు ప్రత్యక్ష దైవంగా పూజించబడతాడు. సూర్య భగవానుడి ఆరాధనకు సంక్రాంతి పండుగ చాలా ముఖ్యమైనది. సూర్యుడు ఒక రాశిని విడిచిపెట్టి మరో రాశిలోకి ప్రవేశించినప్పుడు దానిని సంక్రాంతి అంటారు. జూన్ నెలలో, సూర్యుడు మిథునరాశిలోకి ప్రవేశిస్తాడని, అందుకే ఈ రోజును మిథున సంక్రాంతిగా పిలుస్తారు. మత విశ్వాసాల ప్రకారం, ఈ రోజున సూర్య భగవానుని ఆరాధించడం, దానం చేయడం వల్ల విశేష ప్రయోజనాలు లభిస్తాయి. అయితే మిథున సంక్రాంతి ఎప్పుడు, దీని ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

- Advertisement -

మిథున సంక్రాంతి తేదీ

- Advertisement -

ఈ సంవత్సరం మిథున సంక్రాంతి శనివారం, జూన్ 15, 2024 నాడు రానుంది. ఈ రోజున, పుణ్యకాలం ఉదయం 5:20 నుండి మధ్యాహ్నం 12:24 వరకు, మహా పుణ్యకాలం ఉదయం 5:20 నుండి 07:41 వరకు ఉంటుంది. ఈ ప్రత్యేకమైన రోజున సంక్రాంతి ముహూర్తం అర్ధరాత్రి 12:38 గంటలకు ఉంటుంది.

ఈ సంవత్సరం మిథునరాశి సంక్రాంతి పండితులకు, విద్యావంతులకు ఎంతో మేలు చేస్తుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అలాగే, ఈ రోజు నుండి వస్తువుల ధర సాధారణంగా ఉంటుంది.

మిథున సంక్రాంతి ప్రాముఖ్యత

హిందూ మతంలో మిథున సంక్రాంతి చాలా ముఖ్యమైనది. మత విశ్వాసాల ప్రకారం, మిథున సంక్రాంతి రోజున సూర్య భగవానుని ఆరాధించడం, సూర్యుడికి నీరు సమర్పించడం వల్ల జీవితంలో ప్రయోజనాలు లభిస్తాయి. అనేక రకాల సమస్యలు దూరం అవుతాయి. మిథున సంక్రాంతి రోజున పుణ్యస్నానం చేయడం కూడా మేలు చేస్తుంది. దానధర్మాలకు కూడా ఈ రోజు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇలా చేయడం వల్ల సూర్యభగవానుడు ప్రసన్నుడై వ్యక్తికి అన్ని రకాల సుఖాలు, సౌకర్యాలు కల్పిస్తాడు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News