Big Stories

Darsi Assembly Constituency: గొట్టిపాటికి గట్టి దెబ్బ.. దర్శిలో సైకిల్ గాలి తుస్!

Darsi Assembly Constituency: రాష్ట్రంలో ఆ నియోజకవర్గమంటే కాస్త ఆసక్తి. అక్కడ టికెట్ దక్కించుకునేందుకు అన్ని పార్టీల నేతలూ ఆసక్తి చూపుతారు. అలాంటిది టీడీపీలోనూ ఎక్కువమంది టికెట్‌ కోసం గట్టిగానే ప్రయత్నాలు చేశారు. చివరకు ఆ అవకాశం ఓ మహిళానేతకు దక్కింది. ఆమె కుటుంబ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని.. అధిష్టానం ఆమెకు టికెట్ ఇచ్చింది. ఎంట్రీ అదిరినా అనుకునంత విషయం లేకపొవటంతో అంతా తుస్ అని తేలిందని తెలుగుతమ్ముళ్లు వాపోతున్నారు. ఆ సీటుపై ఎంతో నమ్మకం పెట్టుకున్న టీడీపీ అధిష్టానం.. ఇప్పుడు తలలు పట్టుకుంటుందనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఇంతకీ.. ఏమిటా ఆ నియోజకవర్గం.

- Advertisement -

ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎన్నికల వేళ దర్శిలో ప్రధాన పార్టీల మధ్య గట్టి ఫైట్ ఉంటుందని అంతా భావించారు. అయినా సరే.. టికెట్ కావాలంటూ చాలామంది యత్నించారు. లోకల్‌గా చాలా మంది నేతలున్నా, ఆ సీటును టీడీపీ అధినేత చంద్రబాబు.. డాక్టర్ గొట్టిపాటి లక్ష్మికి కేటాయించారు. ఆమె ఎంట్రీ అదిరినా ప్రస్తుతం గెలుపు అవకాశాలు సన్నగిల్లియనే వార్తలు గుప్పుమంటున్నాయి.

- Advertisement -

TDP నాలుగో జాబితా ప్రకటించక ముందు.. దర్శిలో YCPకి వన్‌సైడ్‌ వేవ్ కనిపించింది. TDP నాలుగో జాబితాలో పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పేరు టీడీపీ అధిష్టానం ప్రకటించింది. మొదట్లో అదరహో అన్నట్లుగా పరిస్థితులు ఉన్నా.. తర్వాత కాలంలో పరిస్థితులు మారాయని అక్కడ నేతలే చర్చించుకుంటున్నారట. దర్శి స్థానానికి ఆమె నాన్‌లోకల్‌ కావటంతో పాటు పార్టీ శ్రేణులతో మమేకమయ్యే అంశంలోనూ వెనుకబడి ఉన్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. నిజం చెప్పాలంటూ దర్శిలో టీడీపీ అనుకున్నంత స్థాయిలో లేదని TDP నేతలే చెప్పుకుంటున్నారట.

Also Read: Chandrababu: ఆయన కాలు గోటికి కూడా నువ్వు సరిపోవు: చంద్రబాబు

YCP అభ్యర్ధి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి.. దర్శి నియోజకవర్గానికి లోకల్‌. శివప్రసాద్‌ తండ్రి మాజీ ఎమ్మెల్యేగా స్వతంత్ర అభ్యర్ధిగా గెలిచిన హిస్టరీ ఉంది. పైగా దర్శిలోనే బూచేపల్లి కుటుంబం నివాసం ఉంటుంది. ఓ రకంగా చెప్పాలంటే రాజకీయంగా ఆ కుటుంబం అక్కడ పాతుకుపోయిందనే చెప్పొచ్చు. అలాంటి చోట గొట్టిపాటి లక్ష్మిని తీసుకురావటంతో ఆ స్థానంలో గెలుపు మాటెలా ఉన్నా.. పరిస్థితి దిగజారే అవకాశాలున్నట్లు సొంత పార్టీ నేతలే చర్చించుకోవటం హాట్‌టాపిక్‌గా మారింది.

శివప్రసాద్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్‌ బయటకు వచ్చేశాక.. జరిగిన బై ఎలక్షన్‌లోనూ శాసనసభ్యుడిగా విన్ అయ్యారు. దర్శిలో బూచేపల్లి కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది. అలాంటి అభ్యర్థిని ఢీకొట్టాలంటే ఎంతో గట్స్‌ ఉండాలి.అంతకు మించి యాక్షన్‌ ప్లాన్ కూడా ఉండాలి. కానీ.. టీడీపీ అభ్యర్ధి గొట్టిపాటి లక్ష్మీ మాత్రం ఆ విషయంలో వీక్‌గా ఉన్నారని సొంత నియోజకవర్గంలోనే చర్చించుకుంటున్నారట. ఆమె కేవలం సోషల్‌ మీడియానే నమ్ముకుని దానికే పరిమితం అయ్యారంటూ తెలుగుతమ్ముళ్లు ఫీల్‌ అవుతున్నారట. పార్టీ స్టేండ్‌ను పక్కన బెట్టి ఆమె.. సోషల్‌ మీడియాతోనే ముందుకు వెళ్తున్నారనే వాదనలు ఉన్నాయి. సొషల్ మీడియా టీమ్ చెప్పినట్లు చేస్తున్నారు తప్ప.. జనంలోకి వెళ్లి ఓట్లు అడిగే పరిస్థితి లేదనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఈ పరిణామాలు.. అధికార వైసీపీకి అనుకూలంగా మారే అవకాశం ఉందని రాజకీయవర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.

Also Read: Chandrababu: సైకో, నియంత పాలన అంతం కోసమే.. : చంద్రబాబు

ఓ దశలో దర్శి TDP సీటు కోసం హేమాహేమీ నేతలు ప్రయత్నించారు.మాజీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగొపాల్, NRI గరికపాటి వెంకట్, పమిడి రమేష్ , బాచిన కృష్ణ చైతన్య.. ఇలా ఎంతో మంది గట్టిగా ట్రై చేసి చివరకి చతికిలపడ్డారు. అంతటి కాంపిటేషన్‌ ఉన్నా.. టీడీపీ అధిష్టానం మాత్రం గొట్టిపాటి లక్ష్మి వైపే మొగ్గుచూపింది. అక్కడవరకూ ఓకే. ఆమె ప్రచారంతో పాటు ఇతర అంశాల్లో క్యాడర్‌ను కలుపుకుని వెళ్లటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పార్టీ విజయం కోసం నియోజకవర్గంలోని కీలక నేతలతో సమావేశమై.. గెలుపుకోసం చేయాల్సిన కార్యక్రమాలను పక్కన పెట్టి కేవలం సోషల్ మీడియానే నమ్ముకున్నారని సొంత పార్టీ నేతలే చెప్పుకుంటున్నారట. దీనిని ముమ్మాటికి లక్ష్మి విఫలమనే బహిరంగంగా విమర్శలు చేస్తున్నట్లు సమాచారం. పేరుకే గొట్టిపాటి లక్ష్మి అభ్యర్ధి అయినా, మొత్తం వ్యవహారం ఆయన భర్త కడియాల లలిత్‌ సాగర్‌ నడిపిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ఇది టీడీపీ విజయానికి అడ్డంకిగా మారే అవకాశాలు ఉన్నాయని టీడీపీ సీనియర్లు చెవులు కొరుక్కుంటున్నారట.

కడియాల లలిత్ సాగర్ లోకల్‌కాదు. ఆయనకు రాజకీయాలపై సరైన అవగాహన కూడా లేదని తెలుగు తమ్ముళ్లే చెబుతున్నారు. కేవలం డబ్బుతోనే రాజకీయం చేయొచ్చనే ధోరణితో సాగర్‌ ఆలోచిస్తుడంతో టీడీపీ శ్రేణులు అయోమయంలో పడ్డాయట. దర్శి మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావుకు కూడా ఎన్నికల ప్రచారంలో పెద్ద ప్రాధాన్యత లేదని ఆయన అనుచరులు అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. దర్శి TDP ఇన్‌ఛార్జ్‌గా పమిడి రమేష్ రాజీనామా చేశాక.. కొత్త ఇన్‌ఛార్జ్‌ను నియమించడానికి మూడేళ్లు పట్టిందంటే.. అక్కడ టీడీపీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని సొంత పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. క్యాడర్‌ను సమన్వయం చేసుకోవటంతో భార్యాభర్తలు విఫలం చెందుతున్నారట. దీంతో ఆశించిన ఫలితాలు రావటం లేదనే భావనలో అధిష్టానం ఉందని టాక్‌.

Also Read: బీజేపీకి ముస్లింల సపోర్ట్.. వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ!

సొంత సామాజికవర్గానికి చెందిన వారికి.. దర్శి నియోజకవర్గం పెత్తనం అప్పగించటంతో లోకల్ TDP నేతలు కస్సుబుస్సుమంటున్నారు. మొత్తం మా వాళ్లే చూసుకుంటారు. మీరు ఏమీ చెయొద్దు అన్నట్లుగా గొట్టిపాటి లక్ష్మి వ్యవహారం ఉందని చాలామంది నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజా పరిణామాలతో టీడీపీ గెలుపు అవకాశాలు.. నానాటికీ దిగజారిపోతున్నాయని స్థానిక నేతలు ఆవేదన చెందుతున్నారు. కొందరు టీడీపీ నేతలు.. ఇప్పటికే వైసీపీ అభ్యర్థి బూచేపల్లి జై కొట్టారట.దీంతో నెల కిందట దర్శి TDPలో కనిపించిన ఊపు.. ఇప్పుడు లేదనేది సొంత పార్టీ నేతల వాదన.ఒక్కపక్క టీడీపీ అధికారంలోకి రావాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు సర్వయత్నాలూ ఒడ్డుతుంటే.. దర్శిలో పరిస్థితులు వేరుగా ఉండటం.. పార్టీకి ఇబ్బందిగా మారే అవకాశాలున్నాయని రాజకీయవర్గాలు సైతం చెబుతున్నాయి.

అనుభవం లేని వ్యక్తులను బరిలోకి దించటం వల్లే ఇలాంటి పరిణామాలు వచ్చాయని సొంత పార్టీ నేతలే చర్చించుకుంటున్నారట. YCPతో పోల్చితే.. దర్శి నియోజకవర్గంలో టీడీపీ పోల్‌ మేనేజ్‌మెంట్‌లో విఫలం అయ్యిందనే వార్తలు ఇప్పటికే ప్రచారంలో ఉన్నాయి. నియోజకవర్గంలో ఐదు మండలాలకు నరసరావుపేటకు చెందిన వ్యక్తులను ఇన్‌ఛార్జ్‌లుగా నియమించారు. అన్నింటినీ వారే చూసుకోవటంతో లోకల్ క్యాడర్‌ అసంతృప్తిలో ఉంది. గ్రామస్థాయిలోనూ తమకు కనీసం విలువ లేకుండా పోయిందని కొందరు తెలుగు తమ్ముళ్లు ఆవేదన చెందుతున్నారు. గొట్టిపాటి లక్ష్మి మాత్రం ఓన్లీ సోషల్‌ మీడియానే నమ్ముకుని విజయంపై ధీమాగా ఉన్నారని.. కానీ.. అక్కడ పరిస్థితులు వేరుగా ఉన్నాయని తెలుగుతమ్ముళ్లు చెప్పుకుంటున్నారు. ఇటీవల ప్రచారంలో భాగంగా గొట్టిపాటి లక్ష్మి దర్శి టౌన్‌లో ప్రచారం నిర్వహిస్తున్న సమయంలోనే.. ప్రైవేట్ ఆసుపత్రిలో సిజేరియన్‌ చేసి అందరితో ఔరా అనిపించకున్నా.. అది సోషల్‌ మీడియాలో హైప్‌కోసమేనంటూ వైసీపీ ఆరోపణలు చేస్తోంది.

Also Read: కూటమి అభ్యర్థులకు రెబల్స్ టెన్షన్..

నియోజకవర్గంలో ముండ్లమూరు, దొనకొండ, కూరిచేడు మండలాల్లో టీడీపీకి మెజార్టీ ఉంది. లక్ష్మి వ్యవహరశైలితో అక్కడ కూడా ఫ్యాన్ సునామీ ఉంటుందని సొంత పార్టీ నేతలే చర్చించుకుంటున్నారట. గొట్టిపాటి లక్ష్మి భర్త లలిత్ సాగర్.. అవగాహన లేకుండా రాజకీయాలు చేయటం వల్లే ఇలాంటి పరిస్థితి నెలకొందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రతి విషయాన్ని మా టీమ్‌ వాళ్లతో మాట్లాడండి అంటూ భార్యాభర్తలు చేస్తున్న వ్యాఖ్యలు.. పెను ప్రమాదాన్ని తీసుకొచ్చే అవకాశం లేకపోలేదని స్థానిక నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారట. వాపును చూసి బలం అనుకున్నట్లుగా.. వారి తీసుకుంటున్న నిర్ణయాల పట్ల తెలుగుతమ్ముళ్లు మండిపడుతున్నారు. ఇలా అయితే.. దర్శి గడ్డపై పసుపుజెండా ఎగురువేయటం సాధ్యం కాదనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో దర్శి నియోజకవర్గ ఓటర్లు.. లోకల్‌ వైపు చూస్తారా.. నాన్‌ లోకల్ అభ్యర్థిని గెలిపిస్తారా అనేది ఉత్కంఠగా మారింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News