BigTV English

Natti Kumar Hot Comments on CM Jagan: నట్టికుమార్ కామెంట్స్, ఇండస్ట్రీకి జగన్ ఫోబియా… అందుకే బయటకు..

Natti Kumar Hot Comments on CM Jagan: నట్టికుమార్ కామెంట్స్, ఇండస్ట్రీకి జగన్ ఫోబియా… అందుకే బయటకు..

Natti Kumar hot comments on CM Jagan: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరింది. పోలింగ్‌కు సమయం దగ్గరపడుతుండడంతో ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. తాజాగా సీఎం జగన్‌పై సంచనల వ్యాఖ్యలు చేశారు సినీ నిర్మాత నట్టికుమార్. ఈసారి జగన్ పాలన అంతం కావాల్సిందేనని మనసులోని మాట బయటపెట్టారు. టాలీవుడ్‌లో 99 శాతం మంది కూటమి వైపే ఉన్నారని కుండబద్దలు కొట్టేశారు. జగన్ ప్రభుత్వాన్ని చూసి ఇండస్ట్రీలో చాలా మంది భయపడుతున్నారని, ఓపెన్‌గా మాట్లాడలేక పోతున్నారని వాపోయారు.


ఎక్కడెక్కడ నుంచో ఎన్నారైలు వచ్చి ఏపీలో ప్రచారం చేస్తున్నారని, పక్కనేవున్న మనం నోరు ఎత్తలేక పోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు నిర్మాత నట్టికుమార్. ఈ లెక్కన సినీ ఇండస్ట్రీని జగన్ భయపెడు తున్నారని ఆరోపించారు. సినిమా వాళ్లు ధైర్యంగా ముందుకొచ్చి మీకు ఇష్టమైనవారికి సపోర్ట్ చేయాలని కోరారు. ప్రస్తుతం ఏపీ అంధకారంలోకి వెళ్లిపోయిందన్నారు. పుట్టిన గడ్డను కాపాడు కోవాలన్నారు. చంద్రబాబు అరెస్టయినప్పుడు ఎవరూ బయటకు వచ్చి మాట్లాడలేదని, కనీసం ఇప్పుడైనా  రావాలని కోరారు.

ఈ క్రమంలో వైసీపీ నేత పోసాని కృష్ణమురళిపై అదే రేంజ్‌లో రియాక్ట్ అయ్యారు నట్టికుమార్. పోసానికి ధైర్యం ఉంటే.. వివేకానంద కేసు గురించి అసలు విషయాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు ఈ నిర్మాత. టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ తిట్టడం కోసమే పోసానిని పెట్టుకున్నారని దుయ్యబట్టారు. విశాఖలో వైసీపీ భూములు కాజేసింది వాస్తవం కాదా అని సూటిగా ప్రశ్నించారు. సొంత చెల్లెళ్లకు సీఎం జగన్‌ న్యాయం చేయలేదని మండిపడ్డారు. 65 లక్షల మంది బటన్ నొక్కుతున్నానని అంటున్నారని, మిగతా ప్రజల మాటేంటని ప్రశ్నల మీద ప్రశ్నలు రైజ్ చేశారు.


Also Read: Chandrababu: ఆయన కాలు గోటికి కూడా నువ్వు సరిపోవు: చంద్రబాబు

ఏపీలో బిల్లుల పేరిట జనం జేబులకు చిల్లులు పడ్డాయని దుయ్యబట్టారు నిర్మాత నట్టికుమార్. విశాఖను అందకారం చేసి బొత్సకు అప్పగించి.. విజయసాయిరెడ్డి నెల్లూరు వెళ్లిపోయారన్నారు. రాజధానిని పోగొట్టుకుని అన్యాయమై పోయామని ఆవేదన వ్యక్తంచేశారు. పనిలోపనిగా ముద్రగడపైనా విమర్శలు గుప్పించారు. ముద్రగడ పద్మనాభం‌రెడ్డిగా పేరు మార్చుకునేందుకు ముమూర్తం పెట్టుకోవాలని సూచన చేశారు. కొత్తలో జగన్ ప్రభుత్వానికి సపోర్టు చేశారు నిర్మాత నట్టికుమార్. ఆ తర్వాత థియేటర్ల ఇష్యూ, టికెట్ల పెంపు, కొన్ని సినిమాల విడుదలను ఆపడం వంటి పరిణామాలు నట్టికుమార్‌కు ఆగ్రహం కలిగినట్టు ఇండస్ట్రీలో పలువురు చెప్పుకుంటున్నారు.

Related News

Tollywood Producers: ఏపీకి చేరిన సినిమా పంచాయితీ.. మంత్రి దుర్గేష్ తో ఫిలిం చాంబర్ నేతల సమావేశం

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Big Stories

×