Big Stories

Srikakulam Assembly Constituency 2024: ఎలక్షన్స్ 2024.. సిక్కోలు సింగం ఎవరు…?

- Advertisement -

కింజరాపు రామ్మోహననాయుడు శ్రీకాకుళం ఎంపీగా పార్లమెంట్‌లో విభజన సమస్యలపై సమర్ధంగా వాయిస్ వినిపించి కేంద్ర పెద్దలు ప్రశంసలు అందుకున్న యంగ్ లీడర్ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో టీడీపీకి బలమైన పునాదులున్నాయి. అయితే 2019 ఎన్నికల్లో టెక్కలి, ఇచ్చాపురం మినహా ఎక్కడ కూడా ఆ పార్టీ విజయం సాధించలేకపోయింది. ఉమ్మడి జిల్లాలో 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధించిన వైసీపీ శ్రీకాకుళం పార్లమెంట్ స్థానాన్ని మాత్రం కైవసం చేసుకోలేకపోయింది.

- Advertisement -

మాజీ కేంద్రమంత్రి, దివంగత కింజరాపు ఎర్రంనాయడు కుమారుడిగా ఆయన రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు రామ్మోహననాయుడు. యూఎస్‌లో ఎంబీఏ చేసి.. సింగపూర్‌లోని అంతర్జాతీయ సంస్థకు సీఈఓగా పనిచేస్తున్న రామ్మోహననాయుడు.. తండ్రి మరణం తర్వాత ఆయన రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు. ఎర్రంనాయుడ్ని నాలుగుసార్లు గెలిపించిన శ్రీకాకుళం లోక్‌సభ సెగ్మెంట్ ఓటర్లు రామ్మోహన్‌ని కూడా వరుసగా రెండు సార్లు లోక్‌సభకు పంపారు. గత ఎన్నికల్లో 22 పార్లమెంట్ స్థానాలు దక్కించుకున్న వైసీపీ శ్రీకాకుళంలో మాత్రం పాగా వేయలేకపోయింది.

Also Read: జగన్‌పై రుసరుస, అక్కడ రాకుండా స్కెచ్.. ఆయన వెనుక సీఎం?

మూడో సారి పోటీకి సిద్దమైన రామ్మోహన్ స్పీడ్‌కి బ్రేకులు వేయాలని సీఎం జగన్ పట్టుదలతో ఉన్నారు. ఈ సారి ఎలా అయినా శ్రీకాకుళం ఎంపీ స్థానంలో గెలవాలని ప్రణాళికలు రచించిన ఆయన. కుల సమీకరణల లెక్కలతో అక్కడ నిర్ణయాత్మకంగా ఉన్నా కాళింగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని తెరపైకి తెచ్చారు. టెక్కలిలో కింజరపు అచ్చెన్నాయుడు చేతిలో పరాజయం పాలైన పేరాడ తిలక్‌ని రామ్మోహన్‌పై పోటీకి దింపారు.

రాష్ట్రానికి ముఖ్యద్వారంగా ఉన్న శ్రీకాకుళంలో జెండాపాతి గెలుపు ద్వారాలు తెరవాలని భావిస్తుంటాయి అన్ని పార్టీలు.. అందుకే అన్ని పార్టీలు శ్రీకాకుళం పై దృష్టి సారించాయి. ముఖ్యంగా కొరకరాని కొయ్యగా తయారైన శ్రీకాకుళం ఎంపీ సీటుపై వైసీపీ ప్రత్యేక దృష్టి సారించింది. మూడు దశాబ్దాలుగా కింజరాపు కుటుంభానికి అండగా ఉన్న జిల్లా వాసులు ఈ సారి కూడా రాంమోహన్నాయుడికి హ్యాట్రిక్ విజయం అందించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో 1952 లో ఏర్పడిన శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గం నుంచి స్వాతంత్ర సమరయోధులు సర్ధార్ గౌతు లచ్చన్న, ఆచార్య ఎన్‌జి రంగా వంటి మహానుభావులుగెలిచి పార్లమెంట్ లో అడుగుపెట్టారు. అంతటి ఘన చరిత్ర కలిగిన నియోజకవర్గం లో 18 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో8 కాంగ్రెస్, 7 సార్లు తెలుగుదేశం విజయం సాధించాయి. శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గెలిచిన ఎర్రంనాయుడు, కిల్లి కృపారాణిలు కేంద్ర మంత్రులు అయ్యారు. 2009లో ఎర్రనాయుడ్ని ఓడించినందుకే కృపారాణికి మంత్రి పదవి దక్కిందంటారు.

Also Read: భారీగా మనీ సీజ్, ఈసారి దాదాపు రెండున్నర కోట్లు

తర్వాత కిల్లి కృపారాణి వైసీపీ బాట పట్టారు. వైఎస్ కొడుకు జగన్‌ని సొంత తమ్ముడిలా భావించి నమ్మితే తనకు మానసిక క్షోభ మిగిల్చారంటూ కృపారాణి ఇటీవలే వైసీపీ కి రాజీనామా చేశారు.ఆ పార్టీలో తనకు ఎదురైన అవమానాలు వివరిస్తూ కన్నీటి పర్యంతమైయ్యారు. రాజశేఖర్ రెడ్డి కుమారుడిగా జగన్‌కి తండ్రిలానే ఉన్నత భావాలు ఉన్నాయని భావించానని తనను కృపమ్మా కృపమ్మా అంటూనే తీవ్ర అవమానాలకు గురిచేసారని ఆక్రోశం వెళ్లగక్కారు.

షర్మిల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన క‌ృపారాణి ప్రస్తుతం కాంగ్రెస్ టెక్కలి అభ్యర్ధిగా పోటీలో ఉన్నారు. ఆమె కూడా వైసీపీ ఆశలు పెట్టుకున్న కాళింగ సామాజికవర్గానికి చెందిన నాయకురాలే ఆ క్రమంలో కాళింగుల్లో ఓట్ల చీలిక వైసీపీకి పెద్ద దెబ్బే అంటున్నారు. వాస్తవానికి కింజరాపు కుటుంబానికి ఈ నియోజకవర్గంపై మంచి పట్టుఉంది. 6 సార్లు ఎంపీగా గెలిచిన ఆ కుటుంబం నుంచి వచ్చిన రామ్మోహన్‌నాయుడు లోకసభలో ఉత్తరాంధ్ర సమస్యలపై గళం వినిపించి అందరి మన్ననలు పొందుతున్నారు.

గత ఎన్నికల్లో శ్రీకాకుళం పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని 5 నియోజవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధులు ఓడిపోయారు. ఒక్క టెక్కలి నుంచి మాత్రం రామ్మోహన్ బాబాయ్ అచ్చెన్నాయుడు విజయం సాధించారు. బాబాయ్‌తో పాటు అబ్బాయ్ కూడా విజయం సొంతం చేసుకుని సిక్కోలులో కింజరాపు కుటుంబానికి ఉన్న పట్టు నిరూపించారు. పేరుకి వెనకబడిన జిల్లాగా శ్రీకాకుళం జిల్లాకి పేరున్నా ఇక్కడ ప్రజలకు రాజకీయ చైతన్యం ఎక్కువే. ఇచ్చాపురం, పలాస,టెక్కలి, నరసన్నపేట, శ్రీకాకుళం,ఆమదాలవలస, పాతపట్నం అసెంబ్లీ నియోజకవర్గాలు శ్రీకాకుళం ఎంపీ స్థానం పరిధిలోకి వస్తాయి.

Also Read: PM Modi AP Tour: మోదీ సుడిగాలి టూర్.. ఏపీలో పొలిటికల్ సునామీ

కళింగ, పోలినాటి వెలమ కులానికి చెందిన సామాజిక వర్గాలు ఎక్కువగా ఉండటంతో వారే గెలుపు, ఓటములు అక్కడ నిర్ణయిస్తారు. ఎర్రంనాయుడు హయాంలో నాయుడు శ్రీకాకుళం పార్లమెంట్ ముఖ చిత్రం మారిపోయిదంటారు. కేంద్రమంత్రిగా ఆయనవెనుకబడిన జిల్లాలో అభివృద్ధి అంటే ఎంటో చూపించారు. జిల్లాకు కేంద్రం నుంచి నిధులు తెచ్చి అనేక అభివృద్ది కార్యక్రమాలు చేశారు. రామ్మోహన్‌నాయుడు జిల్లా సమస్యల పై పార్లమెంట్లో ప్రశ్నలవర్షం కురిపించి దేశం దృష్టిని ఆకర్షించారు. మూడు భాషలపై ఆయనకు పట్టుఉండటం.. సందర్భోచితంగా మాట్లాడటం.. అందరిని కలుపుకిపోవడం. విషయ పరిజ్ఞానం..అన్నిటికంటే ముక్యంగా యువతలో ఆయనకున్న క్రేజ్ రామ్మోహన్ నాయడుకి కలిసివచ్చే అంశాలుగా భావిస్తున్నారు.

శ్రీకాకుళం జిల్లాలో కళింగ, వెలమ సమాజికవర్గాలు ఎక్కువగా ఉండటంతో కళింగ సామాజిక వర్గానికి చెందిన పేరాడ తిలక్ ను వైసీపీ రామ్మెహన్‌పై పోటీకి దింపింది. పేరాడ తిలక్‌కి రాజకీయ అనుభవం పెద్దగా లేకపోవడం మైనస్ అంటున్నారు.. కేవలం కులం కార్డే ఆయనకు ప్రధాన బలంగా కనిపిస్తోందన్నఅభిప్రాయం వ్యక్తమవుతుంది. మరోవైపు వైసీపీ ఎమ్మెల్యేల అవినీతి. భూకబ్జాలు, ఇసుక, మట్టి దోపిడీపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు ముందుకు సాగకపోవడం, అభివృద్ధి కుంటుపడటంపై జిల్లావాసులు ఆగ్రహంతో కనిపిస్తున్నారు. మరిలాంటి పరిస్థితుల్లో రామ్మోహన్‌నాయుడు స్పీడ్‌కి వైసీపీ ఈ సారైనా బ్రేకులు వేస్తుందో? లేదో ? చూడాలి

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News