Big Stories

Sharmila VS YS Bharti: ఫ్యామిలీ వార్.. షర్మిల VS వైఎస్ భారతి..సై అంటే సై..

YS Family War In Kadapa Sharmila VS YS Bharti: కడప లోక్‌సభ సెగ్మెంట్లో అన్నాతమ్ముళ్లపై యుద్దం ప్రకటించారు పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల . వివేకా హత్యకేసును అస్త్రంగా మార్చుకుని ఆయన కుమార్తె వైఎస్ సునీతతో కలిసి అటు జగన్‌ని ఇటు కడప ఎంపీ అవినాష్‌రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. అయితే ఆ అక్కాచెల్లెళ్లు చంద్రబాబు ట్రాప్‌లో పడ్డారని జగన్ సహా వైసీపీ నేతలు అంటున్నారు. అంతే తప్ప వైఎస్ ఇంటి ఆడపడుచులపై పెద్దగా విమర్శలు చేయలేని పరిస్థితి కనిపిస్తుంది. ఆ క్రమంలో జగన్ సతీమణి భారతి ప్రచారబరిలోకి దిగారు. భారతి సైతం షర్మిల తరహాలో పొలిటికల్ పంచ్‌లు విసరలేక పోతున్నారన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

- Advertisement -

జగనన్న వదిలిన బాణాన్ని అంటూ గత ఎన్నికల వరకు ప్రచారం చేసిన వైఎస్ షర్మిలను కాంగ్రెస్ ఇప్పుడు జగన్‌పైనే ఎక్కుపెట్టింది.. కడప ఎంపీగా పోటీ చేస్తున్న పీసీసీ ప్రెసిడెంట్ షర్మిల … వైఎస్ వివేకా హత్యకేసులో నిందితుడైన కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిపై పోటీకి దిగారు. ఆమె పీసీసీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి జగన్ మీద ఆయన ప్రభుత్వం మీద విమర్శలు గుప్పిస్తున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వాన్నే కాదు పులివెందులలో ఆయనను ఎమ్మెల్యే అభ్యర్ధిగా కూడా ఓడించాలని షర్మిల ఇస్తున్న పిలుపు రాజకీయంగా మంటలు పుట్టిస్తోంది. మరో వైపు సొంత బాబాయ్‌ని చంపిన హంతుకుడు అవినాష్‌రెడ్డికి జగన్ టికెట్ ఇచ్చారని. వైసీపీ ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తున్నారు షర్మిల.. ఆమెతో పాటు వివేకా కుమార్తె వైఎస్ సునీత ప్రచారంలో పాల్గొంటూ వైసీపీ బ్రదర్స్‌‌ని టార్గెట్ చేస్తూ కాక రేపుతున్నారు.

- Advertisement -

Also Read: పొన్నూరు లో పవర్ దక్కించుకున్నదెవరు?

దాంతో వైఎస్ ఫ్యామిలీలో ఎవరివైపు ఉండాలో తేల్చుకోలేక వైఎస్ అభిమానులు దిక్కులు చూడాల్సి వస్తుంది.. ఆ క్రమంలో షర్మిలకు కానీ సునీతకు కానీ జగన్ వైపు నుంచి కౌంటర్లు అయితే పెద్దగా పడడం లేదు. జగన్ పులివెందుల టూర్లో షర్మిల పసుపు చీర గురించి ప్రస్తావించి… తన చెల్లెళ్ళు చంద్రబాబు ట్రాప్ లో పడ్డారు అని వ్యాఖ్యానించారు. అంతకు మించి కామెంట్స్ చేయలేదు. అప్పుడు కూడా ఆయన చెల్లి చీర గురించి మాట్లాడటం వివాదాస్పదమైంది. ఇక అడపాదడపా ప్రభుత్వ సలహాదారు సజ్జల, వియసాయి వంటి వారు ఆ అక్కాచెల్లెళ్లపై కామెంట్స్ చేస్తున్నా అవి పబ్లిక్‌కు పెద్దగా రీచ్ అవ్వడం లేదన్న అభిప్రాయం ఉంది.

దీంతో కడప రాజకీయాల్లో మరీ ముఖ్యంగా కాంగ్రెస్ దూకుడుతో వైసీపీ డిఫెన్స్ లో పడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఆ లోటుని భర్తీ చేయడానికి దూకుడు పెంచి క్యాడర్ ‌ జోష్ తీసుకుని రావడానికి జగన్ సతీమణి వైఎస్ భారతి రంగంలోకి దిగినట్లు కనిపించారు. ఆమె పులివెందులతో పాటు కడప లోక్‌సభ సెగ్మెంట్ వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. భారతి వెంట అవినాష్‌రెడ్డి సతీమణి సమత పాల్గొంటున్నారు. సమత ఎన్నికల ప్రచారంలో కనిపించడం ఇదే మొదటి సారి ఫ్యాన్‌ గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యేగా జగన్‌, ఎంపీగా అవినాష్‌రెడ్డిని గెలిపించాలని వారిద్దరు అభ్యర్ధిస్తున్నారు. ఇంటింటికీ తిరుగుతూ సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని భారతి ధీమా వ్యక్తం చేస్తున్నారు.

అంతే తప్ప ఆమె ప్రచారంలో జగన్, అవినాష్‌లను తీవ్రస్థాయిలో టార్గెట్ చేస్తున్న తన మరదళ్ల గురించి పెద్దగా మాట్లాడటం లేదు. అసలు వారి పేర్లే ప్రస్తావించడం లేదు. షర్మిల ఆరోపణలపై మీడియా గుచ్చిగుచ్చి ప్రశ్నిస్తే.. నామ్ కే వాస్తేగా స్పందిస్తున్నారు. చెప్పుకోవడానికి ఏం లేక అలా విమర్శలు గుప్పిస్తున్నారని ముక్తసరిగా చెప్తున్నారు.

Also Read: అంబటి తో అల్లుడు ఫైట్.! ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

మరోవైపు షర్మిల రోజురోజుకి దూకుడు పెంచుతున్నారు. తన తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పేరును సీబీఐ ఛార్జిషీట్‌లో పెట్టించిన వారికి జగన్ ఏఏజీ పదవి ఇచ్చారని ఆరోపణలు గుప్పిస్తున్నారు. వైఎస్ మరణించినప్పుడు రిలయన్స్ హస్తం ఉందని వ్యాఖ్యానించిన జగన్.. అదే రిలయన్స్ మనిషికి రాజసభ సభ్యత్వం ఇచ్చి తన అబద్దాల నైజం బయటపెట్టుకున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

వివేకా హత్య కేసుపై మాట్లాడుతూ జగన్‌ అధికారంలో లేనప్పుడు సీబీఐ విచారణ కావాలని అడిగారని గుర్తుచేశారు. అధికారంలోకి రాగానే ఎందుకు వద్దన్నారో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. జగన్‌ను చూసుకునే తెలంగాణ నేత తనపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. తాను వెయ్యి కోట్లు తీసుకున్నట్లు రుజువు చేస్తే రాజకీయాలు వదిలిపెట్టి వెళ్లిపోతానని సవాల్ విసిరారు. ఇటీవల కడప ఎంపీ అవినాష్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల పైనా షర్మిల స్పందించారు. తన భర్త అనిల్‌ కుమార్‌ బీజేపీ నేతను ఎక్కడా కలవలేదు.. కలిచే ప్రసక్తే లేదన్నారు. అవినాష్‌ మాదిరి అర్ధరాత్రి గొడ్డలి రాజకీయాలు తమకు తెలియదని ఎద్దేవా చేశారు.

తన భర్త అనీల్ పేరు ప్రస్తావిస్తేనే భగ్గుమంటున్నారు షర్మిల. అటు చూస్తే భారతి రాజకీయ విమర్శల జోలికి పోకుండా వైసీపీ ప్రభుత్వం చేపట్టిన విజయాలను ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాల గురించే ఎక్కువగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఏకంగా వైఎస్ హత్యకు సంబంధించి జగన్‌ని టార్గెట్ చేశారు షర్మిల. మరదలు షర్మిల గుప్పిస్తున్న ఆ విమర్శలకు భారతి సమాధానం ఎలా ఉంటుందో చూడాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News