trinayani serial today Episode: సుష్టుగా భోంచేసిన ముక్కోటి ఇన్నాళ్టికీ తృప్తిగా భోజనం చేశానని వైకుంఠానికి చెప్తాడు. అలాగే ఈ ఆస్తిని చూశావా ఎంత ఉందో.. ఏదో ఒకటి చేసి ఈ ఆస్తిలో కొంతైనా కొట్టేయాలని చెప్తాడు ముక్కోటి. ఇంతలో రత్నాంభ వచ్చి ముక్కోటిని తిడుతుంది. ఈ ఇల్లు చూసి బాగుందని ఇక్కడే ఉండాలనిపిస్తుంది అంటున్నాడు అమ్మా నీ అల్లుడు అని వైకుంఠం చెప్పగానే.. రత్నాంభ తిడుతూ నా మనవరాలు వస్తే మనం ఇక్కడి నుంచి వెళ్లిపోదాం అంటుంది. ఇంతలో తిలొత్తమ్మ వచ్చి ఇక్కడ ఉన్నదే నీ మనవరాలు త్రినేత్రి మళ్లీ కొత్తగా నీ మనవరాలును ఎలా తీసుకొస్తుంది అంటుంది.
వదిన చెప్పిందంటే కచ్చితంగా తీసుకొస్తుంది అని విక్రాంత్ అంటాడు. మా మనవరాలను మా ముందు నిలబెడితే చాలు బాబు అంటుంది రత్నాంభ. ఇంతలో త్రినేత్రి రాగానే.. అదిగో మాటల్లోనే వచ్చింది మీ త్రినేత్రి అని హాసిని చెప్తుంది. పై నుంచి వచ్చిన నేత్రి రత్నాంభను చూసి సంతోషంగా బామ్మ ఎలా ఉన్నావు అని అడుగుతుంది. ముక్కోటి, వైకుంఠం ఇద్దరినీ ఎలా ఉన్నారని పలకరిస్తుంది. ఇంతలో విశాల్ నయని అంటాడు. దీంతో బామ్మ బాబుగారు అచ్చం నాలాగే ఉన్న తన భార్యను నయని అంటాడు అలాగే నన్ను పిలుస్తున్నాడు అని చెప్తుంది. దీంతో హాసిని చెల్లి మా చెల్లి ఎక్కడ ఉంది అని అడుగుతుంది. మీ బామ్మ వాళ్లు వచ్చారు వెళ్లి చూసిరాపో అని చెప్పింది అందుకే నేను కిందకు వచ్చాను అంటుంది.
అయితే ఇప్పుడు మీ వాళ్లతో వెళ్లిపోతావా నువ్వు అంటూ సుమన అడుగుతుంది. ఏయ్ అలా వెళ్లిపోతే ఎలా మా తమ్మికి పెళ్లాం ఉండదు కదా అంటాడు వల్లభ. ఇదీ మరీ బాగుందయ్యా వాళ్ల ఆవిడతో విశాల్ బాబు కాపురం చేసుకుంటాడు అని రత్నాంభ చెప్పగానే.. అది కాదు బామ్మ మా పెద్దమరదలు ఇక్కడే ఉందని మేము అనుకోవాలి కదా అంటాడు వల్లభ. తను ఇక్కడే ఉంది కదా..? అని అనుమానంగా అడుగుతుంది రత్నాంభ. ఇదంతా వద్దు కానీ అసలు నయని ఎక్కడ ఉందో చూస్తే సరిపోతుంది కదా..? అంటుంది హాసిని. దీంతో నేత్రి.. నయనిని మీరందరూ చూస్తారా..? మా బామ్మకు చూపిస్తే సరిపోతుందా..? అని అడుగుతుంది నేత్రి. బామ్మకు చూపిస్తే సరిపోతుంది అని హాసిని చెప్తుంది.
సరేనని విక్రాంత్, నేత్రి భామ్మను గదిలోకి తీసుకెళ్తారు. త్రినయని బాడీని చూపిస్తారు. జరిగిన విషయం మొత్తం చెప్తారు. దీంతో బామ్మ అయ్యో ఆ రోజు కారు ప్రమాదానికి గురైది నయనినా..? నా మనవరాలేమోనని నేను బాధపడ్డాను అంటూ నయనిని చూసి జాలి పడుతుంది రత్నాంభ. తన పరిస్థితి అలా ఉందని నేను నయనిలా నటిస్తున్నాను బామ్మ.. అని చెప్తుంది. పెళ్లి కానీ నా మనవరాలు పెళ్లి అయి పిల్లలున్న దానిలా నటించడం ఏంటి బాబు అని అడుగుతుంది రత్నాంభ. దీంతో విక్రాంత్ దండం పెట్టి వేడుకుంటూ మా వదిన కోమాలోంచి కోలుకునే దాకా.. మీ మనవరాలిని మీ ఊరికి తీసుకెళ్లొద్దని అడుగుతాడు. మరి మేం వచ్చాం కదా..? బాబు.. మీ అమ్మా.. మీ అన్నయ్యా అడిగితే ఎలా అంటుంది. దీనికి నువ్వే ఏదైనా పరిష్కారం చెప్పు బామ్మ అంటుంది నేత్రి. దీంతో నేత్రిని నువ్వు ఇక్కడే ఉండు అంటూ తాము ఎలా నాటకం ఆడాలో డిసైడ్ అవుతారు. వాళ్ల నాటకం ప్రకారమే బామ్మ కూడా అందిరికీ చెప్తాను అంటుంది.
త్రినేత్రి రెండు విధాలుగా నటిస్తుందని తిలొత్తమ్మ అనుమానిస్తుంది. అయితే బామ్మ ముందు వీళ్ల ఆటలు సాగవు అంటాడు వల్లభ. అదంతా కాదు ఎవరు ఉన్నా లేకపోయిన ఉన్న వాళ్లను లేకుండా చేయాలని అంటుంది తిలొత్తమ్మ. తర్వాత ముక్కోటికి, వైకుంఠం టీ తీసుకువస్తే నువ్వు తీసుకొచ్చావేంటి ఇంట్లో పనోళ్లు లేరా అని అడగ్గానే నీకు పనోళ్లతో మర్యాదలు చేయించడానికి నువ్వేమైనా మా చుట్టమా అంటూ తిడుతుంది సుమన. దీంతో హాసిని అలా మాట్లాడొద్దని చెప్తుంది. ఇంతటితో త్రినయని సీరియల్ ఈరోజు ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?