BigTV English

Mahesh Babu: మూడేళ్లు నరకం చూసిన మహేష్ బాబు.. కట్ చేస్తే..!

Mahesh Babu: మూడేళ్లు నరకం చూసిన మహేష్ బాబు.. కట్ చేస్తే..!

Mahesh Babu:తెలుగు చలనచిత్ర పరిశ్రమలో దివంగత నటుడు సూపర్ స్టార్ కృష్ణ (Krishna)వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు మహేష్ బాబు(Maheshbabu). చైల్డ్ ఆర్టిస్ట్ గానే ఇండస్ట్రీలోకి వచ్చిన ఈయన ఆ తర్వాత హీరోగా మారి తన సత్తా చాటారు. తన వరుస సినిమాలతో ప్రిన్స్ హీరోగా మారి, ఇప్పుడు సూపర్ స్టార్ గా చలామణి అవుతున్నారు మహేష్ బాబు. ప్రస్తుతం ఎస్ ఎస్ ఎం బి 29 (SSMB 29) అనే వర్కింగ్ టైటిల్ తో రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమాతో ఏకంగా పాన్ ఇండియా స్టేటస్ ను సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉండడం గమనార్హం. ఇదిలా ఉండగా మహేష్ బాబు ఒక మూడు సంవత్సరాల పాటు తన సినీ కెరియర్లో నరకం అంటే ఏంటో చూశారట. ఆ సమయంలో తన భార్య అండగా నిలిచిందని అసలు విషయాన్ని బయటపెట్టారు.


పోకిరి తర్వాత వరుస పరాజయాలు..

సినిమా అనే రంగుల ప్రపంచంలో ప్రతి ఒక్కరి కెరియర్ సవ్యంగా సాగుతుందని చెప్పడం అసాధ్యం. ప్రతి నటుడి కెరియర్ లో ఒక డల్ ఫేజ్ ఖచ్చితంగా ఉంటుంది. అలాంటి పరిస్థితి మహేష్ బాబుకి కూడా ఎదురయింది. సాధారణంగా ఎవరికైనా ప్లాపుల వల్ల ఇబ్బందికర పరిస్థితి ఉంటే.. మహేష్ బాబుకి ‘పోకిరి’ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత సమస్యలు మొదలయ్యాయట.. దాంతో వరుసగా బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ లు ఎదుర్కొన్నారు మహేష్ బాబు. అలా సైనికుడు, అతిథి చిత్రాలను మహేష్ బాబు గ్యాప్ లేకుండా చేసినా ఆ సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి. అదే సమయంలో ఫ్యామిలీలో కూడా వరుస విషాదాలు ఆయనను మానసికంగా మరింత దిగ్బ్రాంతికి గురిచేసాయి.


కుటుంబంలో వరుస విషాదాలు..

2006లో పోకిరి రిలీజ్ అయింది. అదే ఏడాది సైనికుడు వచ్చింది. ఆ తర్వాత అతిధి వచ్చింది. అదే సమయంలో నా ఫ్యామిలీలో విషాదాలు కూడా తలుపు తట్టాయి. నన్ను పెంచి పెద్ద చేసిన మా గ్రాండ్ మదర్ మరణించింది. ఆ తర్వాత నమ్రతా తల్లిదండ్రులు కూడా మరణించారు. దీంతో ఒక్కసారిగా శూన్యం ఆవహించింది. ఆ సమయంలో నాకు గౌతమ్ పుట్టాడు. ఈ విషాదాలు జరిగే సమయానికి గౌతం ఆరు నెలల బేబీ. దీంతో కొన్ని నెలలు ఎలాంటి షూటింగ్స్ లేకుండా వాడితో గడపాలని ఆరు నెలలు ఇండస్ట్రీకి బ్రేక్ తీసుకున్నాను. 6 నెలలు కాస్త మూడు సంవత్సరాలు అయిపోయింది. ఇక సినిమా విషయంలో కూడా కన్ఫ్యూజన్లో ఉన్నాను.

నమ్రతా వల్లే సాధ్యమైంది..

దీనికి తోడు పోకిరి బ్లాక్ బస్టర్ తర్వాత చేసిన సైనికుడు, అతిధి సినిమాలు ప్రేక్షకులకు నచ్చలేదు. ఇక పోకిరి రేంజ్ ని మ్యాచ్ చెయ్యాలి అంటే ఎలాంటి సినిమా చేయాలి అనే డైలమాలో పడినప్పుడు నా భార్య నమ్రత (Namrata)నాకు అండగా నిలిచింది. ఆమె ఇచ్చిన ధైర్యమే నన్ను ముందుకు నడిపించింది. తన తల్లిదండ్రులు మరణించిన విషాదంలో ఉన్నప్పటికీ కూడా ఫ్యామిలీ కోసం నా కోసం నమ్రత ఎంతో కష్టపడింది. యాడ్ షూట్స్ తో వచ్చిన డబ్బుతోనే మేము కొత్త ఇల్లు కట్టుకున్నాము.ఆ తరువాత ఖలేజా సినిమా చేస్తే అది కూడా డిజాస్టర్ గా నిలిచింది. ఇక శ్రీను వైట్ల దర్శకత్వంలో చేసిన దూకుడు సినిమాతో మళ్లీ నేను సూపర్ హిట్ అందుకున్నాను అంటూ తెలిపారు మహేష్ బాబు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×