Mohali Building Collapse| పంజాబ్ రాష్ట్రంలోని మొహాలి నగరంలో శనివారం డిసెంబర్ 21, 2024న ఒక మూడు అంతస్తుల బిల్డింగ్ కూలిపోయింది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఇద్దరు చనిపోయారని సమాచారం. స్థానిక అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో శిథిలాల్లో దాదాపు 8 మంది చిక్కుకొని ఉన్నారని జాతీయ మీడియా తెలిపింది.
శనివారం రాత్రి మొహాలీలో భవనం కుప్పకూలిన ఘటనలో ముందుగా ఒక మహిళ తీవ్రంగా గాయపడింది. ఆమెను సమీపంలోని సుహానా ఆస్పత్రిలో చేర్పించారు. కానీ చికిత్స పొందుతూ ఆమె మరణించింది. మృతురాలి పేరు ద్రిష్టి వర్మ (29) అని, హిమాచల్ ప్రదేశ్ లోని షిమ్లాలో ఆమె కుటుంబ సభ్యులకు ఘటనకు తెలియజేశాశరు. అయితే శిథిలాల్లో చిక్కుకొని ఉన్నవారిని వెలికి తీయడానికి ప్రయత్నిస్తున్న సహాయక సిబ్బందికి ఆదివారం అభిషేక్ అనే ఒక టీనేజర్ మృతదేహం కూడా లభించింది. దీంతో మృతుల సంఖ్య 2కు చేరింది. అభిషేక్.. హర్యాణా నగరంలోని అంబాలా నగరానికి చెందినవాడిన స్థానిక మీడియా తెలిపింది.
Also Read: మిస్‌లీడింగ్ ధంబ్‌నెయిల్స్ పై యూట్యూబ్ కొరడా.. వీడియో తొలగింపు, ఫైన్ తప్పదు..
పోలీసులు కథనం ప్రకారం.. మొహాలీ నగరంలోని సొహానా ప్రాంతంలో సాయంత్రం 4.50 గంటలకు బిల్డింగ్ కుప్పకూలిపోయింది. ఈ బిల్డింగ్ లో బేస్మెంట్ తోపాడు మూడు ఫ్లోర్ల వరకు ఒక జిమ్ ఉంది. దాంతో పాటు పీజీ హాస్టాల్, కొన్నిఆఫీసులు కూడా ఉన్నాయి. చనిపోయిన యువతి ద్రిష్టి ఆ బిల్డింగ్ పీజీలోనే నివసించేంది. బిల్డింగ్ చాలా పాతబడి ఉంది, దాని పక్కనే బిల్డింగ్ ఓనర్లు మరో ప్లాట్ లో నిర్మాణ పనులు చేపట్టగా.. ఆ క్రమంలో పునాదుల కోసం తొవ్వుతుండగా.. ఒక్కసారిగా బిల్డింగ్ కూలిపోయింది. బిల్డింగ్ లో ప్రకంపనలు రావడంతో చాలా మంది జిమ్ చేస్తున్నవారు బయటికి పరుగులు తీశారు. ద్రిష్టి కూడా పిజీ నుంచి బయటికి వస్తున్న క్రమంలో బిల్డిండ్ కూలిపోయింది.
బిల్డింగ్ కుప్పకూలిన సమాచారం అందిన వెంటనే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF), సైన్యం ఘటనా స్థాలనికి చేరుకొని శిథిలాల నుంచి చిక్కుకున్న ప్రజలను కాపాడడానికి చర్యలు చేపట్టారు. జేసీబి యంత్రాలతో బిల్డింగ్ పై భాగం తొలగించేశారు. అయితే బేస్మెంట్ లోనే చాలా మంది ఉన్నారని.. వారు బతికి ఉండే అవకాశాలు తక్కువ. ప్రస్తుతం బిల్డింగ్ ఓనర్లు.. పర్వింవర్ సింగ్, గగన్ దీప్ సింగ్ పై పోలీసులు భారత న్యాయ సంహిత సెక్షన్ 105 ప్రకారం కేసు నమోదు చేశారు.
ఈ ఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ స్పందించారు. ఇలాంటి ప్రమాదాలు జరగడం చాలా బాధాకరమని ఆయన అన్నారు. బాధితులను ఆదుకుంటామని.. ప్రజలకు ప్రాణహాని కలిగించే విధంగా నిర్లక్ష్యంగా ఉన్నందుకు బిల్డింగ్ ఓనర్లకు కఠినంగా శిక్షిస్తామని చెప్పారు.