8 Vasanthalu Heroine : 8 వసంతాలు (8 Vasanthalu).. ప్రస్తుతం ఈ సినిమా ఎంతలా ట్రెండింగ్ లో నిలిచిందో ఈ సినిమాలో నటిస్తున్న హీరోయిన్ కూడా అంతే ట్రెండింగ్ లో నిలిచింది. అయితే ఈమె అందం విషయంలో కాదు టాలెంట్ విషయంలో కూడా అందరిని అబ్బురపరుస్తోంది. సాధారణంగా హీరోయిన్లు అంటే అందరికీ ఒక అభిప్రాయం ఉంటుంది. గ్లామర్ చూపించో లేదా యాక్టింగ్ లో తమ ప్రతిభ చూపించో ఛాన్సులు కొట్టేస్తూ ఉంటారని, అయితే వీళ్ళల్లో కూడా కొంతమంది మల్టీ టాలెంటెడ్ పర్సన్స్ ఉంటారు అనే విషయం బహుశా చాలామందికి తెలియదేమో. ఇప్పుడు ఒక హీరోయిన్ ని చూస్తే మాత్రం నిజమనే అనిపిస్తుంది. ముఖ్యంగా ఆమె టాలెంటు చూస్తే మాత్రం కళ్ళు తిరిగి పడిపోతారనడంలో సందేహం లేదు. అంతలా తన టాలెంట్ తో అందరినీ అబ్బురపరుస్తోంది. అయితే ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఆమె వయసు కేవలం 19 ఏళ్ళు మాత్రమే.
టాలెంట్ తో అందరినీ అబ్బురపరుస్తున్న అనంతిక..
ఆమె ఎవరో కాదు అనంతిక (Ananthika). ప్రస్తుతం టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ‘ 8 వసంతాలు’ సినిమా హీరోయిన్. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయగా ఇందులో తన అందంతో అందరి దృష్టిని ఆకట్టుకుంది అనంతిక. అంతేకాదు సినిమాల కంటే రాజకీయాలలోకి వెళ్లడమే ఇష్టం అని చెప్పి ఆశ్చర్యపరిచింది కూడా.
‘8 వసంతాలు’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అనంతిక ప్రదర్శన..
ఇదిలా ఉండగా 8 వసంతాలు సినిమా జూన్ 20వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతున్న నేపథ్యంలో హైదరాబాద్లో మంగళవారం సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలోనే అనంతిక తన టాలెంట్స్ అన్నీ బయటపెట్టింది. ఇక అనంతిక టాలెంట్ చూసి టాలీవుడ్ మొత్తం ఇప్పుడు ఈమె గురించే చర్చిస్తూ.. అమ్మాయిలు కాస్త ఈమెను చూసి నేర్చుకోండి అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు.
19 ఏళ్లకే ఇంత టాలెంటా..
అనంతిక టాలెంట్ విషయానికి వస్తే.. ప్రస్తుతం లా కోర్స్ చదువుకుంటున్న ఈమె.. గొప్ప క్లాసికల్ డాన్సర్. కరాటే లో బ్లాక్ బెల్ట్ కూడా.. కేరళకు చెందిన ‘ కళరిపయట్టు’ అనే మార్షల్ ఆర్ట్స్ కూడా ఈమెకు వచ్చు. అంతేకాదు ‘కత్తి ఫైటింగ్’ లో కూడా ఈమె సిద్ధమస్తురాలని తెలిసింది. ఇక కేరళ సాంప్రదాయంలో ఒకటైన ‘ చెండా ‘ (డ్రమ్స్) కూడా వాయిస్తుంది. మొత్తానికైతే 19 ఏళ్లకే ఇంత టాలెంట్ ను పోగు చేసుకుందంటే ఇక భవిష్యత్తులో తన టాలెంట్ తో మరెన్ని అద్భుతాలు సృష్టిస్తుందో అని అభిమానులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అనంతిక కెరియర్..
‘మ్యాడ్’ సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమైన అనంతిక.. రీసెంట్ గానే ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. ఈమె అసలు పేరు అనంతిక సనీల్ కుమార్ (Ananthika Sanil Kumar) . ఈ కేరళ కుట్టి వయసు కేవలం 19 ఏళ్ళు మాత్రమే. 2015 నుంచే సినిమాలు చేస్తూ కెరియర్ను కొనసాగిస్తోంది. ‘మిలి’ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె.. లాల్ సలాం, రైడ్ అనే తమిళ సినిమాలలో చేసింది. కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ తెలుగులో చేసిన మ్యాడ్ సినిమాతో భారీ పాపులారిటీ అందుకుంది. ఈ సినిమాతో అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈమెకు ‘రాజమండ్రి రోజు మిల్క్’ అనే మరో తెలుగు సినిమాలో కూడా అవకాశం వచ్చింది. అయితే ఈ సినిమా విడుదల కాలేదు.
also read:Samantha: 40కి చేరువలో కూడా.. ఇంత యవ్వనానికి కారణం అదే అంటున్న సమంత!
• A trained classical dancer 💃
• Black belt in Karate 🥋
• Skilled in Kalaripayattu 🥷
• Skilled in sword fighting 🗡️
• Plays the Chenda (percussion) 🥁
• An actor 👩🎤
• A law student 👩🎓And she’s just 19 years old! 🫡 pic.twitter.com/crowkzdA6X
— Movies4u Official (@Movies4u_Officl) June 17, 2025