Indian Raiways: ప్రయాణికులకు శుభవార్త చెప్పింది రైల్వేశాఖ. కొత్తగా 200 రైళ్లను అందుబాటులోకి రానున్నాయి. అవి అందుబాటులోకి వస్తే ప్రయాణికుల కష్టాలు కొంతలో కొంత తీరినట్టే. వీలైనంత తొందరగా కొత్త రైళ్లను పట్టాలకెక్కించేందుకు ఆ శాఖ రంగం సిద్ధం చేస్తోంది.
వందే భారత్ రైళ్లకు ప్రయాణికుల నుంచి ఆదరణ లభించడంతో ఆ స్థాయిలో రైళ్లను తీసుకొచ్చేందుకు రెడీ అయ్యింది రైల్వేశాఖ. ఈ క్రమంలో రైల్వేమంత్రి అశ్వినీ వైభవ్ ఎక్స్ వేదికగా కీలక విషయాలు వెల్లడించారు. ప్రయాణికుల కోసం కొత్తంగా 50 నమో, 50 అమృత్ , 100 మెమొ రైళ్లను అంటూ రాసుకొచ్చారు.
ఆ వీడియోలో మెమొ తప్పితే మిగతా రైళ్లు అత్యాధునిక వసతులతో కూడినవి కనిపించాయి. ఆ లెక్కన అవన్నీ లగ్జరీ రైళ్లు చెప్పకనే చెప్పారు. ఆయా రైళ్లు ఎప్పుడు పట్టాలెక్కబోతున్నాయి అనేది మాత్ర చెప్పకుండా సస్పెన్స్ క్రియేట్ చేశారు. ప్రస్తుతం స్లీపర్ వందేభారత్ రైళ్లు రెడీ అవుతున్నాయి. వాటిని వినాయక చవితి లేకుంటే దసరాకు రావచ్చని అంటున్నారు.
ఆయా రైళ్లకు ‘నమో భారత్’ పేరు పెట్టవచ్చని అంటున్నాయి ఆ శాఖ వర్గాలు. హర్యానాలోని మనేసర్ ప్రాంతంలో అతిపెద్ద ఆటోమొబైల్ గతి శక్తి మల్టీ మోడల్ కార్గో టెర్మినల్‌ను ప్రారంభించారు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు తమ కీలక నిర్ణయాలు తీసుకుంటోందని వెల్లడించారు.
ALSO READ: వర్షాకాలంలో ఎంజాయ్ చేయాల్సిన బెస్ట్ ప్లేస్‌లు ఇవే
ప్రస్తుతం మెమూ రైళ్లలో ఉన్న కోచ్‌ల సంఖ్యను 8 నుంచి 20కి పెంచుతున్నట్లు ప్రకటించారు. వీటివల్ల తక్కువ దూరాలకు ప్రయాణించేవారికి ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ప్రయాణికులపాటు సరుకు రవాణాలో రైల్వే శాఖ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.
2023 ఏడాదికి గాను రైళ్లు.. 720 కోట్ల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చాయని తెలిపారు. 1617 మిలియన్ టన్నుల సరుకును రవాణా చేసిందని చెప్పుకొచ్చారు. కొత్త రైళ్ల రాకతో ప్రయాణికుల సేవలు మెరుగుపడతాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
కొత్త రైళ్లు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయనేది ప్రకటించలేదు సదరు మంత్రి. అవి ఏయే మార్గాలు అనేది కూడా చెప్పలేదు. కేవలం కొత్త రైళ్లు రాబోతున్నాయని మాత్రమే ప్రకటన చేశారు. అన్ని రాష్ట్రాల రాజధానుల నుంచి ఢిల్లీకి నేరుగా వేయాలనే ఆలోచన చేస్తోంది రైల్వేశాఖ. దీనికితోడు లాంగ్ జర్నీలకు కొత్త రైళ్లను ఉపయోగించాలని భావిస్తున్నారు.
అలాగే డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో కొన్ని రైళ్లను ఏర్పాటు చేయాలని భావిస్తోందని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. ఈ లెక్కన సౌత్‌కి ఎక్కువ రైళ్లు వచ్చే అవకాశముందని అంటున్నారు. వందే భారత్ రైళ్లు ఎక్కువగా సౌత్‌కి ఇచ్చారని గుర్తు చేస్తున్నాయి.
यात्रियों की सुविधा के लिए:
🚉 50 नई नमो भारत ट्रेन
🚉 100 नई MEMU ट्रेन
🚉 50 नई अमृत भारत ट्रेन pic.twitter.com/2hM92vq3Ep— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) June 17, 2025