BigTV English
Advertisement

96 Movie Sequel: ‘96’ సీక్వెల్ స్టోరీ లీక్.. రామ్, జాను మళ్లీ కలుస్తారా.?

96 Movie Sequel: ‘96’ సీక్వెల్ స్టోరీ లీక్.. రామ్, జాను మళ్లీ కలుస్తారా.?

96 Movie Sequel: కొన్ని ప్రేమకథలు హిట్ అయినా ఫ్లాప్ అయినా ప్రేక్షకులు మాత్రం వాటిని మర్చిపోలేరు. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అయ్యిండి, కమర్షియల్‌గా సూపర్ సక్సెస్ అయిన సినిమాల సంఖ్య తక్కువే. థియేటర్లలో ఉన్నప్పుడ లవ్ స్టోరీలను ఆదరించకుండా ఓటీటీలోకి వచ్చిన తర్వాత దానికి అండర్ రేటెడ్ ట్యాగ్ ఇచ్చే ప్రేక్షకులు చాలామందే ఉన్నారు. కానీ ‘96’ విషయంలో మాత్రం అలా జరగలేదు. ఆ సినిమాలో ఉన్న బ్యూటీ ఏంటో థియేటర్లలో ఉన్నప్పుడే గుర్తించారు ప్రేక్షకులు. అందుకే అది కమర్షియల్‌గా కూడా బ్లాక్‌బస్టర్ సాధించింది. ప్రస్తుతం ‘96’ సీక్వెల్‌కు సన్నాహాలు జరుగుతుండగా.. తాజాగా దీనికి సంబంధించిన స్టోరీ ఇదేనంటూ సోషల్ మీడియాలో స్టోరీ చక్కర్లు కొడుతోంది.


Also Read: అవార్డ్ విన్నింగ్ సినిమాతో సుకుమార్ కూతురి డెబ్యూ.. రిలీజ్ ఎప్పుడంటే.?

ఫ్యాన్స్‌లో టెన్షన్


మామూలుగా ఒక సినిమా హిట్ అయ్యి, క్లాసిక్ అనిపించుకుందంటే దానికి సీక్వెల్‌ను రెడీ చేయకపోవడమే చాలా మంచిది. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ సూపర్ సక్సెస్ సాధించి.. సీక్వెల్స్ ఘోరంగా డిశాస్టర్ అవ్వడం చాలా సినిమాల విషయంలో జరిగింది. అందుకే ప్రేక్షకుల్లో ఎక్కువగా ఆదరణ దక్కించుకున్న సినిమాలకు సీక్వెల్ వస్తుందంటే దాని ఫ్యాన్స్ టెన్షన్ పడుతుంటారు. అలాగే ‘96’ ఫ్యాన్స్‌లో కూడా టెన్షన్ మొదలయ్యింది. ‘96’లాగా దాని సీక్వెల్‌కు అంతగా ప్రేక్షకులను ఆదరిస్తుందా లేదా అని చర్చలు మొదలయ్యాయి. కానీ ఈ మూవీ డైరెక్టర్ ప్రేమ్ కుమార్ మాత్రం కచ్చితంగా సీక్వెల్‌లో మరిన్ని ఎమోషన్స్ ఉంటాయని, ప్రేక్షకులకు నచ్చుతాయని నమ్మకం వ్యక్తం చేస్తున్నాడు.

మరిన్ని ఎమోషన్స్

ఏడేళ్ల తర్వాత ‘96’ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించాలని డిసైడ్ అయ్యాడు ప్రేమ్ కుమార్. మధ్యలో ‘సత్యం సుందరం’ అనే మరో ఫీల్ గుడ్ సినిమాను చేశాడు. అది కూడా ప్రేక్షకులను మెప్పించి క్లీన్ హిట్‌గా నిలిచింది. ఇక ‘96’ విషయానికొస్తే.. జాను పాత్రలో నటించిన త్రిష సింగపూర్ వెళ్లిపోవడంతో సినిమా ముగుస్తుంది. ఇక రామ్ పాత్రలో కనిపించిన విజయ్ సేతుపతి.. జాను జ్ఞాపకాలతో అలాగే మిగిలిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది సీక్వెల్‌లో చూపిస్తాడట దర్శకుడు. చెన్నై, సింగపూర్, మలేషియా ప్రాంతాల్లో ఈ మూవీ షూటింగ్ జరగనుందట. ప్రేమ, చెప్పలేని మాటలతో ‘96’ నిండిపోగా.. ఇప్పుడు సీక్వెల్‌లో మరిన్ని ఎమోషన్స్ యాడ్ అవ్వనున్నాయని ప్రేమ్ కుమార్ చెప్తున్నాడు.

పూర్తి పుస్తకం

‘96’ సీక్వెల్‌లో లవ్ స్టోరీతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉంటాయట. ఇటీవల పాల్గొన్న ఇంటర్వ్యూలో ప్రేమ్ కుమార్ ఈ విషయాన్ని స్వయంగా బయటపెట్టాడు. సీక్వెల్‌లో కథకు స్కోప్ పెంచుతూ ప్రేక్షకులు ఆ ఎమోషన్స్ ఫీల్ అయ్యేలా చేస్తానని మాటిచ్చాడు. రామ్, జాను మళ్లీ కలిస్తే బాగుంటుందని ‘96’ చూసిన ప్రతీ ఒక్కరూ అనుకున్నారు. ఫైనల్‌గా వారు కలిసే టైమ్ వచ్చేసింది. ప్రేమ్ కుమార్.. ప్రస్తుతం ఈ స్క్రిప్ట్‌పై వర్క్ చేస్తుండగా త్రిష, విజయ్ సేతుపతి మాత్రం వరుస కమిట్మెంట్స్‌తో బిజీగా ఉన్నారు. ‘96’ అనేది ఒక లవ్ లెటర్ అయితే దాని సీక్వెల్ ఒక పుస్తకం అని స్టేట్‌మెంట్ ఇచ్చాడు ప్రేమ్ కుమార్ (Prem Kumar).

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×