BigTV English

97th Oscar Awards: ఆస్కార్ అవార్డు అందుకున్న ఉత్తమ చిత్రం..!

97th Oscar Awards: ఆస్కార్ అవార్డు అందుకున్న ఉత్తమ చిత్రం..!

97th Oscar Awards:ఆస్కార్ అవార్డ్స్(Oscar Awards).. ప్రపంచవ్యాప్తంగా సినీ ఇండస్ట్రీలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ఆస్కార్ అవార్డ్స్ అందజేస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ అవార్డ్స్ సొంతం చేసుకోవడానికి టాలీవుడ్ మొదలు హాలీవుడ్ వరకు ప్రతి ఒక్కరు ఎంతో కష్టపడతారు. ఈ మధ్యకాలంలో ఆస్కార్ టార్గెట్ గా సౌత్ సినిమాలు కూడా బరిలోకి దిగుతుండడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గత రెండేళ్ల క్రితం దిగ్గజ దర్శకుడు రాజమౌళి (Rajamouli) కూడా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ఉత్తమ దర్శకుడు కేటగిరీలో ఆస్కార్ అవార్డు సొంతం చేసుకోవాలని ఎంతో ప్రయత్నం చేశారు. అయితే ఆయనకు అవార్డు లభించలేదు కానీ, ఆ సినిమాకు ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్గా ఎమ్ . ఎమ్.కీరవాణి (MM.Keeravani),ఉత్తమ గీతా రచయితగా చంద్రబోస్ (Chandrabose)లకు ఈ అవార్డు లభించింది. ఇక ఈసారి ఎలాగైనా సరే ఆస్కార్ అవార్డు సొంతం చేసుకోవాలని మహేష్ బాబు(Maheshbabu) తో ఎస్ఎస్ఎంబి 29(SSMB 29) అనే వర్కింగ్ టైటిల్ తో భారీ ప్లాన్ వేశారు రాజమౌళి. విదేశాలలో తిరుగుతూ ఈ సినిమాను పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగబోయే ఈ సినిమా కోసం చాలా పగడ్బందీగా ప్లాన్ చేస్తూ సినిమాను తెరకెక్కించే పనిలో పడ్డారు రాజమౌళి.


ఆస్కార్ అవార్డు అందుకున్న ఉత్తమ చిత్రం..

ఇక ఇప్పుడు ఇదిలా ఉండగా లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్లో 97వ ఆస్కార్ అకాడమీ అవార్డుల వేడుక చాలా అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని కనులారా వీక్షించడానికి వివిధ రంగాలకు చెందిన సాంకేతిక నిపుణులు, హాలీవుడ్ స్టార్స్ చాలా ట్రెండీ లుక్ లో హాజరై, అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. ఇక ఈ అవార్డు ఫంక్షన్ కి సంబంధించిన ఫోటోలు ,వీడియోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. ఇక ఈ ఆస్కార్ అవార్డుల కార్యక్రమానికి హోస్ట్ గా అమేలియా డిమోల్డెన్ (Amelia Dimoldenberg) బర్గ్ వ్యవహరిస్తున్నారు. ఇక ఈ మేరకు బెస్ట్ యానిమేటెడ్ మూవీ గా ఫ్లో(Flow), బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిలిం గా ‘ఇన్ ది షాడో ఆఫ్ ది సైప్రెస్’ చిత్రాలు ఎంపికయ్యాయి. ఇకపోతే ఏ విభాగంలో ఏ సినిమాకి? ఏ నటుడుకి? ఈ ఆస్కార్ అవార్డు వరించిందో ఇప్పుడు చూద్దాం.


ఆస్కార్ అవార్డు గ్రహీతలు వీరే..

ఉత్తమ సహాయ నటుడు – కీరన్ కైల్ కల్కిన్ (ది రియల్ పెయిన్)

ఉత్తమ స్క్రీన్ ప్లే – అనోరా (సీన్ బేకర్)

ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే – కాన్ క్లేవ్ (పీటర్ స్ట్రాగన్)

ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ – వికెడ్ (పాల్ తేజ్ వెల్)

ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిలిం – ఇన్ ది షాడో ఆఫ్ ది సైప్రెస్

ఉత్తమ సహాయ నటి – జోయ్ సల్డానా (ఎమీలియా పెరేజ్)

ఉత్తమ మేకప్, హెయిర్ స్టైల్ – డి సబ్ స్టాన్స్

ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే – సీన్ బేకర్ (అనోరా)

వంటి వారికి ఆస్కార్ అవార్డు లభించింది. ఇక ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది.

Tags

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×