HBD Balakrishna.. నందమూరి నటసింహం బాలకృష్ణ(Balakrishna).. ఈరోజు అనగా జూన్ 10న ఆయన పుట్టినరోజు కావడంతో ఆయనకు సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా బాలకృష్ణకు సంబంధించిన పర్సనల్ విషయాలు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. అలాంటి వాటిలో బాలకృష్ణ భార్య వసుంధర దేవికి ఇష్టమైన సినిమా ఒకటి ఉంది. అంతేకాదు బాలకృష్ణ 100కి పైగా సినిమాళ్లో నటించారు. కానీ ఆయన భార్య మాత్రం ఆ సినిమానే వెరీ వెరీ స్పెషల్ అంటుంది. మరి ఇంతకీ బాలకృష్ణ భార్య వసుంధర దేవి మనసు దోచిన ఆ సినిమా ఏంటి? బాలయ్య బాబు ఇన్ని సినిమాల్లో నటిస్తే వసుంధర దేవికి కేవలం ఆ ఒక్క సినిమా మాత్రమే ఎందుకు అంతలా నచ్చింది? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
బాలకృష్ణ భార్య వసుంధర ఫేవరేట్ మూవీ..
బాలకృష్ణ ఇప్పటికే 109 సినిమాల్లో నటించారు. ఆయన నటించే 110వ చిత్రంగా అఖండ-2 (Akhanda-2) తెరకెక్కుతోంది. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు కూడా ఓకే చేశారు.అయితే బాలకృష్ణ 100కు పైగా సినిమాలు చేస్తే బాలకృష్ణ సతీమణి వసుంధర దేవికి నచ్చిన సినిమా మాత్రం చెన్నకేశవరెడ్డి (Chennakeshava Reddy)మూవీ నట. అవును మీరు వినేది నిజమే. ఎందుకంటే ఈ విషయాన్ని స్వయంగా ఈ సినిమా తెరకెక్కించిన డైరెక్టర్ బయటపెట్టారు.
వి.వి.వినాయక్ (VV Vinayak) ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “బాలకృష్ణ నటించిన చెన్నకేశవరెడ్డి సినిమా అంటే వసుంధర దేవి గారికి చాలా ఇష్టం. ఆమెకి ఈ సినిమాలో బాలకృష్ణ తండ్రి పాత్రలో చేసిన పాత్ర అంటే మరింత ఇష్టం. ఈ విషయాన్ని స్వయంగా వసుంధర దేవి గారే నాతో చెప్పారు.” అంటూ వివి వినాయక్ చెప్పారు.ఇక బాలకృష్ణ నటించిన చెన్నకేశవరెడ్డి మూవీ లో ఈయన ద్వి పాత్రాభినయం చేశారు. ఇందులో తండ్రి పాత్రకు హీరోయిన్ గా టబు (Tabu), కొడుకు పాత్రకు హీరోయిన్ గా శ్రియా శరణ్ (Shriya Saran) నటించారు. అలా 2002లో విడుదలైన చెన్నకేశవరెడ్డి సినిమా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించి, బాలకృష్ణ కెరియర్లో ది బెస్ట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. అలా చెన్నకేశవరెడ్డి సినిమా బాలకృష్ణ సతీమణి వసుంధర దేవి (Vasundhara Devi) మనసు దోచిందట.
Also read: HBD Balakrishna: బాగా పెరిగిన బాలయ్య ఆస్తులు.. డబ్బుతోపాటు బంగారం, వెండి ఎంతంటే?
బర్త్ డే స్పెషల్.. ఆకట్టుకుంటున్న అఖండ 2 టీజర్..
ఇక బాలకృష్ణ బర్త్డే సందర్భంగా ఆయన నటించిన అఖండ 2 మూవీకి సంబంధించి టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ లో బాలకృష్ణ తన నట విశ్వరూపంతో అదరగొట్టేసారు. ఇందులో బాలకృష్ణ అఘోర పాత్రలో కనిపించారు. ఇక ఈ టీజర్ లో బాలకృష్ణ డైలాగులతో నందమూరి ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించారు. అఖండ (Akhanda) మూవీకి సీక్వెల్ గా వస్తున్న అఖండ -2 మూవీ కూడా భారీ హిట్ అవుతుందని నందమూరి ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.