Megastar Chiranjeevi: ఆస్కార్ అవార్డ్స్ కి ఉన్న ప్రత్యేకత అందరికీ తెలిసిన విషయమే. తెలుగు సినిమా పరిశ్రమకి అసలు ఆస్కార్ అవార్డు వస్తుంది అని ఎవరు ఊహించలేదు. రాజమౌళి తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్ సినిమాలో నాటు నాటు పాటకి ఆ అవకాశం దక్కింది. తెలుగు సినిమా పరిశ్రమ అంతా కూడా ఆస్కార్ రాగానే ఉప్పొంగిపోయింది. ఆస్కార్ గేయ రచయిత చంద్రబోస్ అవార్డును ప్రతి ఒక్కరి వద్దకు తీసుకొని వెళ్లి వాళ్ళ చేతుల్లో పెట్టడం ఆయన సంస్కారానికి ప్రతీక అని చెప్పొచ్చు. మెగాస్టార్ చిరంజీవి వద్దకు కూడా చంద్రబోస్ ఈ అవార్డును తీసుకొని వెళ్లారు. ఇకపోతే తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఆస్కార్ అవార్డు రావడానికి అంటే ముందే ఆస్కార్ నుంచి మెగాస్టార్ చిరంజీవికి పిలుపు వచ్చింది.
ఆస్కార్ అవార్డ్స్ కు
ఆస్కార్ అవార్డు ఫంక్షన్ కు మెగాస్టార్ చిరంజీవి అంటూ ఒక పేపర్ కటింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాంట్లో మెగాస్టార్ చిరంజీవి కి ఆస్కార్ ప్రధాన ఉత్సవానికి పిలుపు వచ్చినట్లు ఒక ఆర్టికల్ ఉంది. దీనిని ప్రముఖ సీనియర్ దివంగత జర్నలిస్ట్ బి ఏ రాజు రాశారు. ఇంతకీ దానిలో ఉన్న అంశం ఏంటంటే..
ప్రతి సంవత్సరం అంతర్జాతీయ స్థాయిలో జరిగే ఆస్కార్ అవార్డు ప్రధానోత్సవం…
ఈ సంవత్సరం మార్చి 29న లాస్ ఏంజిల్స్లోలో జరుగు చుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా రాణించు ఈ అవార్డ్స్ ప్రదానోత్సవానికి భారతదేశం నుండి మన మెగాస్టార్ చిరంజీవిని పాల్గొనవలసిందిగా ఆహ్వానం వచ్చింది. ఇండియానుండి ఈ ఆస్కార్ ఆవార్డ్స్ లో పాల్గొనడానికి ఇద్దరికి మాత్రమే మాత్రమే ఆహ్వానం రాగా? అందులో ఒకడు సినిమా హీరో చిరంజీవి కావడం ఓ విశేషం, దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమ నుండి ఈ సంవత్సరం ఆస్కార్ అవార్డ్స్ ఫంక్షన్కు ఆహ్వానితునిగా వెళ్తున్న వ్యక్తి మన చిరంజీవి. ఇది నిజంగా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు గర్వకారణం.
మర్చిపోలేని మధురానుభూతి
ఎప్పుడూ షూటింగ్స్ లో బిజీగా ఉండే చిరంజీవికి ఈ ఆహ్వానం వచ్చిందన్న వార్త తెలిసిన చిరంజీవి నిర్మాతలు షూటింగ్ క్యాన్సల్ చేసి అయినా సరే లాస్ ఏంజిల్స్ లో లో జరిగే ఆస్కార్ అవార్డు ఫంక్షన్ కు పాల్గొనడానికి వెళ్ళమని కోరారు. మద్రాస్ నుండి లాస్ ఏంజిల్స్ వెళ్తున్న సుప్రీం ఈ ఫంక్షన్ లో పాల్గొని ఏప్రిల్ రెండవ తారీకు తిరిగి వస్తారు. ఈ ఉత్సవంలో పాల్గొనడానికి ఆహ్వానం రావడం విశేషం. ఇది అపూర్వ గౌరవంగా ఆయన పేర్కొన్నారు. ఈ ఉత్సవంలో పాల్గొని రావడం నిజంగా చిరంజీవి నిజ జీవితంలో మర్చిపోలేని మధురానుభూతిగా నిలిచిపోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.
Also Read : Akkineni Nagarjuna: నాన్నగారి బయోపిక్ సినిమా తీద్దామంటే, నాగార్జున ఏమన్నారో తెలుసా.?