Thandel : అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) సాలిడ్ హిట్ కొట్టాలని పట్టుదలతో ‘తండేల్’ (Thandel) అనే సినిమాతో పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నారు. అయితే తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ కంప్లీట్ అయ్యిందని తెలుస్తోంది. మరి ఫిబ్రవరిలో రిలీజ్ కాబోతున్న ‘తండేల్’ బ్లాక్ బస్టర్ హిట్ కావాలంటే ఎన్ని కొట్టు రాబట్టాలో తెలుసుకుందాం పదండి.
భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్
నాగ చైతన్య (Naga Chaitanya) కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతోంది ‘తండేల్’ (Thandel). చందూ మొండేటి (Chandu Mondeti) దర్శకత్వంలో, సాయి పల్లవి (Sai Pallavi) హీరోయిన్ గా, గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ మూవీకి దాదాపు 100 కోట్ల బడ్జెట్ ను ఖర్చు పెట్టారని ప్రచారం జరుగుతుంది. సినిమాపై నమ్మకంతో మేకర్స్ నాగ చైతన్య మార్కెట్ కంటే చాలా ఎక్కువ బడ్జెట్ ను ‘తండేల్’ పై పెట్టారు. అలాగే థియేట్రికల్ రైట్స్ కూడా భారీ ధరకు అమ్మేసినట్టు సమాచారం.
ఇప్పటికే ఈ మూవీపై అంచనాలు భారీగా ఉండగా, తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రకారం ‘తండేల్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ కావాలంటే ప్రపంచవ్యాప్తంగా కనీసం రూ. 85 కోట్లకు పైగా వసూలు చేయాలని తెలుస్తోంది. నిజానికి సినిమా బడ్జెట్లో సగం ఓటిటి రైట్స్ ద్వారా నిర్మాతలు ఇప్పటికే రికవరీ చేశారు. తండేల్’ మూవీ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ రూ. 45 కోట్లకు కొనుగోలు చేసిందని తెలుస్తోంది. దీనికి తోడు ఆడియో, సాటిలైట్, ఇతర రైట్స్ తో కలిపి మేకర్స్ బాగానే రాబట్టారు. కానీ ఇప్పుడు ‘తండేల్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డిస్ట్రిబ్యూటర్లను టెన్షన్ లో పడేసింది.
హిట్ కాంబోపై నమ్మకం
నిజానికి ఈ మూవీకి ఇంతటి భారీ హైప్ నెలకొనడానికి మెయిన్ రీజన్ సాయి పల్లవి, దేవిశ్రీ అందించిన మ్యూజిక్. ఇందులోని సాంగ్స్ ఇప్పటికే రిలీజ్, కాగా మిలియన్ల వ్యూస్ తో దూసుకెళ్తున్నాయి. సినిమాలో నాగ చైతన్య హీరోగా నటిస్తున్నప్పటికీ, ఆయన కంటే ఎక్కువగా సాయి పల్లవికే క్రేజ్ ఉంది. పైగా వీరిద్దరికి కెమిస్ట్రీకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలోనే ‘తండేల్’ మూవీ నాగచైతన్య కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుంది అని భావిస్తున్నారు. అయితే ‘తండేల్’ మూవీ టార్గెట్ ను రీచ్ కావాలంటే థియేటర్లలో మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ తో ఆడాలి. లాంగ్ రన్ ఉంటేనే ఈ మూవీ టార్గెట్ ను రీచ్ అవుతుంది. ఇక ప్రస్తుతం ‘తండేల్’ మూవీకి ఉన్న బజ్ ను బట్టి చూస్తే, ఈ టార్గెట్ ను నాగ చైతన్య ఈజీగానే రీచ్ అవుతాడు అన్పిస్తోంది. ఫిబ్రవరి 14న రిలీజ్ కాబోతున్న ‘తండేల్’ మూవీ ప్రమోషన్లలో చిత్రబృందం మొత్తం బిజీగా ఉంది. మరి ‘తండేల్’ మూవీ అనుకున్నట్టుగా అంచనాలను అందుకుంటుందా? అనేది తెలియాలంటే వెయిట్ అండ్ సీ.