Steve Smith: ఆస్ట్రేలియా ( Australia ) స్టార్ బ్యాటర్, స్టాండ్-ఇన్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ( Steve Smith ) అరుదైన రికార్డు సృష్టించాడు. శ్రీలంక టూర్ లో ఆసీస్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న స్టీవ్ స్మిత్… తన టెస్టు కెరీర్ లో కీలక మైలురాయిని అందుకున్నాడు. జనవరి 29న అంటే ఇవాళ గాలేలో ( Galle ) శ్రీలంకతో ప్రారంభం అయిన మొదటి టెస్టులో 10,000 టెస్ట్ పరుగులను పూర్తి చేసుకున్నాడు స్టాండ్-ఇన్ కెప్టెన్ స్టీవ్ స్మిత్. ఈ తరుణంలోనే.. అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.
భారత్‌తో జరిగిన బోర్డర్-గవాస్కర్ సిరీస్ చివరి ఇన్నింగ్స్‌లో ఔట్ అయినప్పుడు స్మిత్ కెరీర్‌లో 9,999 టెస్టు పరుగుల వద్ద ఉన్నాడు. ఒక్క పరుగు చేసి ఉంటే.. అప్పుడే 10 వేల పరుగులు చేసేవాడు. కానీ బోర్డర్-గవాస్కర్ సిరీస్ లో టీమిండియా బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ.. బౌలింగ్ లో 9,999 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు స్మిత్. కానీ ఈ రోజు, మాత్రం ఒక్క పరుగు చేసి.. రికార్డు సృష్టించాడు స్మిత్. ఆస్ట్రేలియా ( Australia ) స్టార్ బ్యాటర్, స్టాండ్-ఇన్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ( Steve Smith ) ఈ అరుదైన రికార్డును 205 ఇన్నింగ్స్‌లలో సాధించాడు. ఇది క్రికెట్ చరిత్రలో మూడవ వేగవంతమైనది కావడం విశేషం.
Also Read: Pandya- Jurel: పాండ్య బలుపే టీమిండియా కొంప ముంచిందా.. ఆ రన్ తీస్తే సరిపోయేది ?
10,000 టెస్ట్ పరుగులను పూర్తి చేసుకోవడంతో… ఫీట్‌ను సాధించిన రెండవ ఆస్ట్రేలియన్‌గా నిలిచాడు స్మిత్ ( Steve Smith ). సాధారణ సింగిల్ తో మైలురాయిని చేరుకున్నాడు స్మిత్. ఈ తరుణంలోనే… స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు, ఆస్ట్రేలియా, శ్రీలంక ఆటగాళ్ల నుంచి ప్రశంసలు అందుకున్నాడు స్మిత్. అంతేకాదు… 35 ఏళ్ళ వయసులో, సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్, బ్రియాన్ లారా వంటి దిగ్గజాల సరసన చేరిపోయాడు ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్, స్టాండ్-ఇన్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ( Steve Smith ). టెస్ట్ క్రికెట్‌లో 10,000 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన ఆటగాళ్ల ప్రత్యేక జాబితా ఒకసారి పరిశీలిస్తే… సచిన్ టెండూల్కర్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత రికీ పాంటింగ్, జాక్వెస్ కలిస్, రాహుల్ ద్రవిడ్, జో రూట్ ఉన్నారు.
కాగా… టెస్ట్ క్రికెట్‌లో స్మిత్ ప్రయాణం 2010లో లార్డ్స్‌లో పాకిస్థాన్‌పై ప్రారంభమైంది. అయితే స్టీవ్ స్మిత్ ( Steve Smith ) అరంగేట్రంలో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. తన కెరీర్ మొదటి టెస్ట్ రెండు ఇన్నింగ్స్‌లలో (1 మరియు 12) 13 పరుగులు మాత్రమే చేయగలిగాడు స్టీవ్ స్మిత్ ( Steve Smith ). అయినప్పటికీ, ఎక్కడా దిగాలు పడలేదు. ప్రయత్నం చేసి.. సక్సెస్ అయ్యాడు. దీంతో ఆస్ట్రేలియా మిడిల్ ఆర్డర్‌కు వెన్నెముకగా మారాడు స్టీవ్ స్మిత్ ( Steve Smith ). ఇప్పటి వరకు 34 టెస్ట్ సెంచరీలు చేసిన స్టీవ్ స్మిత్ ( Steve Smith ) 41 హాఫ్ సెంచరీలు చేశారు.
Also Read: Rohit Sharma: అమ్మ***నా బూతులు తిడుతున్నాడు.. గవాస్కర్ పై BCCI కి రోహిత్ శర్మ ఫిర్యాదు?
10,000 పరుగులు పూర్తి చేసుకున్న టెస్టు ఆటగాళ్లు
STEVEN SMITH HAS THE 2ND BEST TEST AVERAGE WHILE REACHING 10,000 TEST RUNS. 🫡
– The GOAT of red ball cricket! 🐐pic.twitter.com/Ph0TJCg4u4
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 29, 2025