Big Stories

Manchu Vishnu: యూట్యూబర్స్ కు మంచు విష్ణు మాస్ వార్నింగ్.. రెండు రోజుల్లో ఆ పని చేయకపోతే జైలుకే

Manchu Vishnu: మీమర్స్ కు, యూట్యూబర్స్ కు మా ప్రెసిడెంట్ మంచు విష్ణు హుకుం జారీచేశాడు. అసభ్యకరమైన మీమ్స్ ను కనుక సోషల్ మీడియా నుంచి తొలగించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని, రెండు రోజుల్లో డార్క్ కామెడీ అంటూ సినిమాలోని పోస్టర్స్, హీరోయిన్స్ పోస్టర్స్ వాడిన ప్రతి మీమ్ ను తొలిగించాలని వార్నింగ్ ఇచ్చాడు. యూట్యూబర్ ప్రణీత్ హన్మంతు వివాదం తరువాత ఇలాంటివి ముందు ముందు జరగకుండా ఉండడానికి ఈ పని చేస్తున్నట్లు విష్ణు తెలిపాడు. ఈ మేరకు ఒక వీడియోను రిలీజ్ చేశాడు.

- Advertisement -

” అందరికీ నమస్కారం.. తెలుగువారు అంటే చాలా మర్యాదస్తులు.. చాలా పద్ధతులు ఫాలో అవుతాం అని ప్రపంచమంతా అనుకుంటూ ఉంటారు. కానీ, ఈ మధ్యకాలం కొంతమంది తెలుగువాళ్లు.. ఈ యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో, ట్విట్టర్ లో.. అసభ్యకరంగా ప్రవర్తించడం వలన అసలెందుకు తెలుగువారు ఇలా ప్రవర్తిస్తున్నారని అన్న ప్రశ్న ఏర్పడుతుంది. ఒక రెండు మూడు రోజుల క్రితం.. నా తమ్ముడు సాయి ధరమ్ తేజ్.. ప్రణీత్ హన్మంతు అనే వ్యక్తి వీడియో ఎందుకు ఇలా చేశాడు అనేసరికి.. ఆ వీడియో ఎంత జుగుప్సాకరంగా ఉందంటే చెప్పలేను.

- Advertisement -

ఇక ఈ వీడియోపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి గారికి, మిగిలిన అధికారులకు థాంక్స్. ప్రణీత్ హన్మంతు అనే వ్యక్తి ఒక మంచి కుటుంబం నుంచి వచ్చి ఉండాలి. ఆయన ఎందుకు ఇలాగా బిహేవ్ చేశాడో అర్ధం కావడం లేదు. ఆయన, ఆయన ఫ్రెండ్స్ ఆ వీడియోలో ఆనందం ఏముంది. ఒక చంటి బిడ్డ.. ఆ బిడ్డకు రెండు మూడు ఏళ్లు కూడా ఉండదు. ఆ బిడ్డ గురించి అంత సెక్సువల్ గా మాట్లాడాల్సిన అవసరం ఏముంది. అసలు ఆ మాటలు వింటుంటేనే ఒళ్లు జలదరిస్తుంది. అది తప్పు. మన తెలుగు వాళ్లు అలాంటి వాళ్లు కాదు.

ఒక రెండు మూడు రోజులుగా ‘మా’ కు నటీనటులు చాలా మెయిల్స్ పంపారు. ఇలాంటివారు యూట్యూబ్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లో చాలామంది ఉన్నారు. వీళ్లందరి మీద మీరు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలా మాట్లాడేవారందరిని నేనొక ప్రశ్న అడుగుతున్నా.. అంటే ఒక ఆడదంటే ఓన్లీ సెక్సువల్ గానే చూడాలా.. ? తల్లి, చెల్లి లేరా మీకు. భార్యాపిల్లలు లేరా.. ? సృష్టికి మూలకారణం ఆడది.. శక్తి. వాళ్లకు గౌరవము ఇవ్వలేనప్పుడు మనుషులుగా బతకడం వేస్ట్. మేము యాక్టర్స్.. మేమందరం శిరస్సు వచ్చి కళమ్మతల్లికి నమస్కరిస్తాము. ఎందుకంటే ప్రేక్షకులు కానీ మమ్మల్ని ఆదరించకపోతే మేమందరం లేము. కానీ, ఒక హీరోయిన్ ను ఇష్టమొచ్చినట్టు మాట్లాడేది.

ఒక యాక్టర్ వాళ్ళ వైఫ్ గురించి మీరు ఇష్టమొచ్చినట్లు కామెంట్స్ చేసేది.. డార్క్ హ్యూమర్ అని, ట్రోలింగ్ వీడియోస్ అని దానికింద మీరు దాక్కొనేది.. అది కరెక్ట్ కాదు. నిన్న బ్రహ్మానందం గారు కాల్ చేసి.. రేయ్ విష్ణు.. మీమ్స్ లో నా ఫోటో వాడుకుంటున్నారు. అలాంటివి నేను కూడా చూస్తున్నాను.. ఎంజాయ్ చేస్తాను. కానీ, ఇలాంటి జుగుప్సాకర వీడియోస్ లో కూడా నా ఫోటో వాడుతున్నారు. నాకు చాలా బాధగా ఉంది. మన తెలుగువారం ఇలా కాదు. మన పద్ధతులు ఇలా కాదు. దీనికి ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పెట్టాలి. మీ జనరేషన్ మీరు చూసుకోవాలి అని చెప్పి బాధపడ్డారు.

అందుకే యూట్యూబ్ లో ఇలా మీమ్స్ వేసేవారికి, ట్రోల్ చేసేవారికి నేను సిన్సీయర్ గా చెప్తున్నా.. ఈ వీడియో వచ్చిన 48 గంటల్లో దయచేసి ఆ అసభ్యకరమైన వీడియోస్, కామెంట్స్ తీసేయండి. మీరు కానీ తీయకపోతే 48 గంటల తరువాత ఆ వీడియోస్ అన్ని యూట్యూబ్ తో మాట్లాడి రిక్వెస్ట్ చేసి రివ్యూ చేస్తాం. ఆ వీడియోస్ కనుక ఉన్నాయంటే మేము సైబర్ సెక్యూరిటీకి ఫిర్యాదు చేస్తాం. మీ యూట్యూబ్ ఛానెల్ కూడా బ్యాన్ అయ్యేలా లీగల్ యాక్షన్ తీసుకుంటాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారికి.. అలాగే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి.. మా అసోసియేషన్ తరుపున మాకు సపోర్ట్ గా ఉండాలని రిక్వెస్ట్ చేస్తున్నాం” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News