Big Stories

Bhavani Revanna: భవానీ రేవణ్ణకు సుప్రీంలో ఊరట..

Bhavani Revanna: లైంగిక వేధింపుల కేసులో నిందితుడైన ప్రజ్వల్ రేవణ్ణ తల్లి భవానీ రేవణ్ణకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఆమెకు మంజూరైన ముందస్తు బెయిల్‌ను రద్దు చేసేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ నేపథ్యంలోనే కర్ణాటక హై కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌పై సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం భవానీ రేవణ్ణకు నోటీసులు ఇచ్చింది. ప్రజ్వల్ రేవణ్ణపై లైంగిక వేధింపుల ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ఈ కేసును రాజకీయం చేయవద్దని ధర్మాసనం పేర్కొంది. సిట్ విజ్ఞప్తి మేరకు భవానీ రేవణ్ణకు నోటీసులు జారీ చేసేందుకు అంగీకరించింది. సిట్ తరపు న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు.

- Advertisement -

భవానీ రేవణ్ణకు హైకోర్టు ఉపశమనం కల్పించడం దురదృష్టకరమనని తెలిపారు. దాంతో జస్టిస్ సూర్యకాంత్ స్పందిస్తూ.. రాజకీయ కారణాలు ప్రక్కన పెట్టి హైకోర్టు పేర్కొన్న కారణాలను చూడాలని సూచించారు. నిందితురాలు మహిళ అని.. అంతే కాకుండా ఆమె 55 ఏళ్ల వయస్సు ఉందని తెలిపారు. లైంగిక దాడికి పాల్పడ్డట్లు ఆమె కొడుకుపై ఆరోపణలు ఉన్నాయని అన్నారు. కొడుకు నేరాలను ప్రోత్సహించడంలో తల్లి పాత్ర ఏంటీ.. ఇందుకు సాక్ష్యాలు ఉన్నాయా? నోటీసులు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? అంటూ జస్టిస్ సూర్యకాంత్ ప్రశ్నించారు. సీఆర్పీసీ సెక్షన్ 164 క్రింద జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ బాధితiరాలి స్టేట్మెంట్ రికార్ట్ చేశారని, బాధితురాలి నిర్భందం విషయంలో భవానీ రేవణ్ణ పాత్ర ఉందని ప్రస్తావనలో ఉందని ధర్మాసనానికి దృష్టికి సిబల్ తీసుకు వెళ్లారు.

- Advertisement -

కిడ్నాప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న భవానీ రేవణ్ణకు హైకోర్టు గతంలో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కుటుంబ జీవితంలో మహిళల పాత్ర కీలకమని ఆ కారణంగా కస్టడీకి పంపకుండా మహిళా పర్యవేక్షణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని జస్టిస్ కృష్ణ దీక్షిత్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. విచారణకు భవానీ రేవణ్ణ సహకరించడం లేదనే వాదనలు కూడా సరికాదని, పోలీసులు వేసిన 85 ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారని దీక్షిత్ గుర్తు చేశారు.

భవానీ రేవణ్ణకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ.. ఇన్వెస్టిగేషన్ సమయంలో మినహాయిస్తే మైసూరు హసన్ జిల్లాలోకి ఆమె అడుగు పెట్టరాదని షరతు కూడా విధించారు. ప్రజ్వల్ రేవణ్ణపై నమోదైన లైంగిక వేధింపుల కేసులో సిట్ దర్యాప్తు చేస్తున్న సమయంలో ప్రజ్వల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే లైంగిక వేధిపుల కేసు వ్యవహారంలో భవానీ రేవణ్ణ పై కూడా ఆరోణలు వచ్చాయి. దీంతో పోలీసులు ఆమెను విచారించేందుకు ఇంటికి వెళ్లగా భవానీ రేవణ్ణ అక్కడ అందుబాటులో లేరని, పరారీలో ఉన్నారన్న వార్తలు వచ్చాయి.

Also Read: సివిల్స్ పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించినా.. ఉద్యోగం ఇయ్యలేదు.. చివరకు..

రేవణ్ణ ఇంటి పనిమనిషి కిడ్నాప్ కు సంబంధించిన ఘటనలో భర్త రేవణ్ణతో పాటు భవానీకి కూడా సంబంధం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే ఆమెను విచారించేందుకు సిట్ అధికారులు నోటీసులు కూడా పంపారు. ఇంటికి వచ్చి ప్రశ్నిస్తామని అందులో పేర్కొన్నారు. ఆమెను అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపించడంతో ఈక్రమంలోనే సిట్ అధికారులు ఆమె నివాసానికి వెళ్లగా అక్కడ లేనట్టి గుర్తించాడు. ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చినట్లు వెల్లడించారు కాగా ఈ కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా న్యాయస్థానం దాన్ని తిరస్కరించడం జరిగింది.

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News