BigTV English

A R Rahman: ఒక్క పాటకు ఏ ఆర్ రెహమాన్ రెమ్యునరేషన్ అన్ని కోట్లా..!

A R Rahman: ఒక్క పాటకు ఏ ఆర్ రెహమాన్ రెమ్యునరేషన్ అన్ని కోట్లా..!

A R Rahman: సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ అనేవారు సినిమా రిజల్ట్ విషయంలో కీలక పాత్ర పోషిస్తారు. ఒక సీన్‌లోని ఎమోషన్ ప్రేక్షకుడికి స్పష్టంగా తెలియాలన్నా, పాటల ద్వారా సినిమా గురించి ప్రేక్షకులకు తెలియాలన్నా వారి పాత్ర చాలా కీలకం. అయినా కూడా సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్‌కు ఎంత రెమ్యునరేషన్ ఉంటుంది అనే విషయం చాలామందికి తెలియదు. తాజాగా ఏ ఆర్ రెహమాన్ ఒక్క పాట పాడడానికి ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారు అనే టాపిక్‌పై ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.


అర్జిత్ సింగ్, శ్రేయా ఘోషల్, సచేత్ టండన్.. ఇలాంటి పలు సింగర్స్ కూడా దేశవ్యాప్తంగా మ్యూజిక్ లవర్స్ అందరికీ తెలుసు. ప్రస్తుతం కేవలం బాలీవుడ్‌లోనే పాటలు పాడుతూ ఇండియాలోనే మోస్ట్ ఫేమస్ సింగర్ అయిపోయాడు అర్జిత్ సింగ్. అందుకే ఇండియాలోనే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న సింగర్ అర్జిత్ అనే అనుకున్నారు అంతా. కానీ ఆశ్చర్యకరంగా ఏ ఆర్ రెహమాన్ పేరు టాప్ 1 స్థానంలో నిలిచింది. అంతే కాకుండా రెమ్యునరేషన్ విషయంలో కూడా ఈయనే టాప్ స్థానాన్ని దక్కించుకున్నట్టు తెలుస్తోంది.

తాజా రిపోర్ట్స్ ప్రకారం ఏ ఆర్ రెహమాన్ ఇండియాలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న సింగర్ అని బయటపడింది. ఒక్క పాట కోసం రూ.3 కోట్లు అందుకుంటాడట ఈ ఆస్కార్ అవార్డ విన్నర్. ఇది ఒక మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ కలిపి అందుకునే రెమ్యునరేషన్ అంత ఉందని.. ఈ వార్త విన్న ప్రేక్షకులు అనుకుంటున్నారు. ఏ ఆర్ రెహమాన్‌ను మ్యూజిక్ డైరెక్టర్‌గా చాలా తక్కువమంది ఎంపిక చేసుకుంటారు. ఒకవేళ దానికి కారణం ఈ రెమ్యునరేషన్ ఏమో అని కూడా సందేహాలు మొదలయ్యాయి.


ఏ ఆర్ రెహమాన్‌ను మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంపిక చేసుకుంటే.. తను కచ్చితంగా ఆ సినిమాలో ఒక్క పాట అయినా పాడుతాడు. గత 30 ఏళ్లుగా తన మ్యూజిక్‌తో, పాటలతో ఇండియన్ సినిమాకే గుర్తింపు తీసుకొచ్చాడు రెహమాన్. ముందుగా 1992లో మణిరత్నం తెరకెక్కించిన ‘రోజా’తో మ్యూజిక్ డైరెక్టర్‌గా డెబ్యూ చేసిన రెహమాన్.. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఇక తన సంగీతంతో ఇండియాకు ఆస్కార్ తీసుకొచ్చిన తర్వాత రెహమాన్ క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఇప్పుడు తన రెమ్యునరేషన్ సంగతి ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×