DGL Movie Glimpse: ఈరోజుల్లో ప్రేమకథలను ప్రత్యేకంగా ఇష్టపడి చూసేవారు చాలామందే ఉంటారు. లవ్ స్టోరీలు రొటీన్‌గా ఉన్నా ఫీల్ గుడ్ ఉంటే కచ్చితంగా హిట్ అవుతాయని చెప్పడానికి చాలా ఉదాహరణలే ఉన్నాయి. అలా తన కెరీర్‌లో కూడా పలు గుర్తుండిపోయే లవ్ స్టోరీలను ప్రేక్షకులకు అందించిన దర్శకుడు కే క్రాంతి మాధవ్. ఇప్పుడు మరొక ప్రేమకథతో ప్రేక్షకులను మరోసారి ప్రేమలో పడేయడానికి సిద్ధమయ్యారు. తాజాగా ఆయన అప్‌కమింగ్ మూవీ ‘డీజీఎల్’ నుండి ఒక స్పెషల్ గ్లింప్స్ విడుదలయ్యింది. ఈ గ్లింప్స్‌ను బట్టి చూస్తే ఇది కూడా ఒక అందమైన ప్రేమకథ అని అర్థమవుతోంది. 2025లో ఈ మూవీ థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.
చిన్న గ్లింప్స్
క్రాంతి మాధవ్ (Kranthi Madhav) సినిమాలు అంటే ప్రతీ ఎమోషన్ ప్రేక్షకులకు హత్తుకుపోయేలా ఉంటుంది. ఆయన చెప్పే కథలతో సినీ పరిశ్రమలో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. అలాగే ఆయన అప్‌కమింగ్ మూవీ ‘డీజీఎల్’ను కూడా రియల్ లైఫ్ ఎక్స్‌పీరియన్స్ ఆధారంగా తెరకెక్కించారు. ఈ మూవీని ఆర్థి క్రియేటివ్ టీమ్ బ్యానర్‌పై గంటా కార్తిక్ రెడ్డి నిర్మించారు. ప్రస్తుతం ‘డీజీఎల్’ షూటింగ్ దశలో ఉంది. ఇందులో పర్సనల్ లైఫ్‌లో వచ్చే మార్పుల గురించి క్రాంతి మాధవ్ చాలా బాగా చెప్పారని సమాచారం. న్యూ ఇయర్ సందర్భంగా అసలు ఈ లవ్ స్టోరీ ఎలా ఉండబోతుందా అని చిన్న గ్లింప్స్‌తో చెప్పేశారు మేకర్స్.
Also Read: సంధ్య థియేటర్ కేసులో ‘పుష్ప 2’ నిర్మాతలకు ఊరట.. వారికి అనుగుణంగా కోర్టు తీర్పు
లవ్ ఈజ్ 360 డిగ్రీస్
తాజాగా విడుదలయిన ‘డీజీఎల్’ (DGL) గ్లింప్స్‌లో కేవలం హీరో, హీరోయిన్ హగ్ చేసుకోవడం మాత్రమే చూపించారు. అప్పుడే బ్యాక్‌గ్రౌండ్‌లో డైలాగ్ వినిపిస్తుంది. ‘లవ్ 1 సైడ్ కాదు.. 2 సైడ్స్ కాదు.. అన్ని దిక్కులు దానివే. లవ్ ఈజ్ బ్లడీ 360 డిగ్రీస్’ అనే డైలాగ్ వస్తుంది. దీంతో అసలు ఈ సినిమాలో ప్రేమ, ఎమోషన్స్ అనేవి ఏ రేంజ్‌లో ఉంటాయో ఈ ఒక్క డైలాగ్‌తో ప్రేక్షకులకు చూపించాలని అనుకున్నారు క్రాంతి మాధవ్. అనుకున్నట్టుగానే ఈ గ్లింప్స్‌కు మంచి పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తోంది. ‘డీజీఎల్’తో మరోసారి తనకు ప్రేమకథల్లో ఎంత పట్టు ఉందో నిరూపించనున్నారు క్రాంతి మాధవ్. ఈ మూవీలో రిలేషన్‌షిప్‌లో ఉండే గొడవలు, ఇబ్బందుల గురించి కూడా చూపించనున్నాడు ఈ డైరెక్టర్.
రివీల్ చేయలేదు
ఫనీ కళ్యాణ్ అందించిన సంగీతం.. ‘డీజీఎల్’ గ్లింప్స్‌ను మరింత అందంగా మార్చింది. జ్ఞాన శేఖర్ సినిమాటోగ్రాఫీ ఆకట్టుకునేలా ఉంది. గ్లింప్స్‌ను విడుదల చేసినా కూడా అసలు ఇందులో నటించే హీరో, హీరోయిన్ ఎవరు అనే విషయాన్ని మాత్రం రివీల్ చేయలేదు మేకర్స్. ఈ గ్లింప్స్‌ను చూసి వారెవరో గెస్ చేయడం కూడా కాస్త కష్టమే. మొత్తానికి 2025లో ‘డీజీఎల్’ అనే మరో ప్రేమకథ ప్రేక్షకుల ముందుకు రానుంది. ముఖ్యంగా యూత్‌కు ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుందని, నచ్చుతుందని మేకర్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.