BigTV English
Advertisement

Allu Arjun – Atlee: స్టార్ హీరోయిన్ ని రంగంలోకి దింపుతున్న అట్లీ.. పదేళ్ల తర్వాత మళ్లీ రొమాన్స్ కి సిద్ధం..!

Allu Arjun – Atlee: స్టార్ హీరోయిన్ ని రంగంలోకి దింపుతున్న అట్లీ.. పదేళ్ల తర్వాత మళ్లీ రొమాన్స్ కి సిద్ధం..!

Allu Arjun – Atlee:ఏప్రిల్ 8న ఏ టైం లో అయితే అల్లు అర్జున్(Allu Arjun)- అట్లీ (Atlee) మూవీకి సంబంధించిన అనౌన్స్మెంట్ వీడియో విడుదల చేశారో.. ఇక అప్పటి నుంచి ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అంతేకాదు ఈ మూవీకి సంబంధించిన ఒక్కో వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ – అట్లీ కాంబోలో వస్తున్న మూవీకి సంబంధించిన బడ్జెట్ అలాగే అల్లు అర్జున్ రెమ్యూనరేషన్, మూవీకి వచ్చే లాభాలలో వాటా గురించి వార్తలు వైరల్ అవ్వగా.. ఇప్పుడు ఈ సినిమాలో ఎవరు హీరోయిన్ గా చేయబోతున్నారు అనే వార్తలు కూడా తెగ వైరల్ గా మారుతున్నాయి.


#AA 22 లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్..

ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత (Samantha) హీరోయిన్గా నటించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ‘సన్నాఫ్ సత్యమూర్తి’ తర్వాత మళ్ళీ పదేళ్లు గ్యాప్ తీసుకొని వీరిద్దరూ రొమాన్స్ చేయడానికి సిద్ధమవుతున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్త జోరుగా సాగుతోంది. అటు సమంత ఇప్పటికే అమెజాన్ సిరీస్ ల ద్వారా పాన్ ఇండియా స్టార్ గా పేరు సొంతం చేసుకుంది. పైగా అల్లు అర్జున్తో నటించిన అనుభవం ఆమెకు చాలా ఉంది . ఈ క్రమంలోనే అల్లు అర్జున్ తోనే మళ్లీ నటించడానికి ఆమె సిద్ధమైనట్లు సమాచారం. వాస్తవానికి ఈ సినిమాలో మొదట ప్రియాంక చోప్రా (Priyanka Chopra) ను తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపించినా.. ఆమె నటించడం లేదని సమాచారం. దీనికి తోడు అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ కోసమే స్టార్ హీరోయిన్ అయి ఉండి కూడా స్నేహం కోసం ఆమె స్పెషల్ సాంగ్ చేసి మరీ ఆశ్చర్యపరిచింది. ఇక ఈ పాట పాన్ ఇండియా స్థాయిలో వైరల్ అయిపోయింది. పైగా అల్లు అర్జున్ ఇమేజ్ కి తగ్గట్టు ఉన్న హీరోయిన్ సమంత కాబట్టి ఆమెను తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.


ఆ అనుబంధమే ఈ అవకాశానికి కారణమా..?

అయితే ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. సమంత ఇప్పటికే అట్లీ దర్శకత్వంలో మెర్సల్, తేరీ వంటి చిత్రాలలో నటించింది . అటు డైరెక్టర్ తో కూడా మంచి అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలోనే సమంత అయితే తాము అనుకున్న పాత్రకు సెట్ అవుతుందని అటు దర్శకుడు కూడా భావించినట్లు సమాచారం . మొత్తానికి అయితే ఇప్పుడు ఈ సినిమాలో సమంత గనుక అవకాశం అందుకుంటే ఇక మళ్ళీ ఈమె రేంజ్ పెరిగే అవకాశాలు ఉన్నాయని అభిమానులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు ఇండస్ట్రీకి కూడా దూరంగా ఉన్న సమంత ఇప్పుడు అల్లు అర్జున్ అట్లీ కాంబోతో మళ్లీ రీఎంట్రీ ఇచ్చి భారీ విజయాన్ని అందుకోవాలని కూడా అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఏ మేరకు ఈ కాంబోలో మూవీ ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి. ఇక ఈ సినిమా షూటింగు ఆగస్టులో ప్రారంభించాలని, వచ్చే ఏడాది విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.

Gangavva: లక్కీ ఛాన్స్ కొట్టేసిన గంగవ్వ.. ఏకంగా సిద్ధు మూవీలో ఛాన్స్..

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×