Gangavva: సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda).. ప్రస్తుతం జాక్ (Jack )అనే సినిమాతో ఏప్రిల్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రముఖ యూట్యూబర్ బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya) ఇందులో హీరోయిన్గా అవకాశాన్ని దక్కించుకుంది. తాజాగా ఈ సినిమా నుండి విడుదల చేసిన గ్లింప్స్, పాటలు, ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి .దీంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ముఖ్యంగా యూత్ ను బేస్ చేసుకొని రొమాంటిక్, లవ్ యాంగిల్ లో సినిమాను చాలా అద్భుతంగా తెరకెక్కించారు. ప్రముఖ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ (Bommarillu Bhaskar)ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా..శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్ (BVSN Prasad) నిర్మిస్తున్నారు.
సిద్ధు నెక్స్ట్ మూవీ లో ఛాన్స్ కొట్టేసిన గంగవ్వ..
ఇకపోతే విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో.. ప్రముఖ యూట్యూబర్, బిగ్ బాస్ కంటెస్టెంట్ గంగవ్వ (Gangavva) తో సిద్దు జొన్నలగడ్డ పాడ్ కాస్ట్ నిర్వహించారు. ఇందులో ఎన్నో విషయాలు పంచుకోగా అందులో భాగంగానే గంగవ్వ అడిగిన ప్రతి ప్రశ్నకి కూడా సిద్ధూ చాలా చక్కగా సమాధానం చెప్పి అబ్బురపరిచారు. ఇక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో భాగంగా..” ఈ అవ్వకి ఎప్పుడైనా నీ సినిమాలో అవకాశం ఇచ్చావా? కనీసం ఇకనైనా అవకాశం ఇస్తావా?” అని గంగవ్వ ప్రశ్నించగా.. ‘కచ్చితంగా నా నెక్స్ట్ సినిమాలో నీకు అవకాశం కల్పిస్తున్నాను” అంటూ గంగవ్వకు ప్రామిస్ చేశారు సిద్దు జొన్నలగడ్డ. మొత్తానికి అయితే సిద్ధు.. తన నుంచి రాబోయే నెక్స్ట్ మూవీలో గంగవ్వకు అవకాశం కల్పిస్తానని చెప్పారు.మరి ఏ మేరకు సిద్ధు తన మూవీలో గంగవ్వ కోసం పాత్రను డిజైన్ చేయిస్తారేమో చూడాలి. మొత్తానికి అయితే ఈ విషయం తెలిసిన తరువాత గంగవ్వ లక్కీ ఛాన్స్ కొట్టేసింది. ఏకంగా స్టార్ స్టేటస్ సొంతం చేసుకుంటున్న హీరో మూవీలో అవకాశం అంటే మామూలు విషయం కాదు అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
#AA22: బడ్జెట్ అన్ని కోట్లా.. బన్నీ రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్..!
గంగవ్వ కెరియర్.. నటించిన చిత్రాలు..
ఇక గంగవ్వ విషయానికి వస్తే.. యూట్యూబర్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె తెలంగాణ యాసలో అద్భుతంగా మాట్లాడుతూ మంచి వాక్చాతుర్యం కలిగిన కళాకారిణిగా పేరు సొంతం చేసుకుంది. ఇక యూట్యూబ్ ద్వారా వచ్చిన ఇమేజ్ తో తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ -4 లో పోటీదారుగా అడుగుపెట్టి.. ఆ షో లో ఉన్నప్పుడు ఆరోగ్యం సహకరించక మధ్యలోనే వచ్చేసింది. 2020లో తెలంగాణ ప్రభుత్వం నుండి ఉత్తమ పాత్రికేయురాలుగా తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం కూడా లభించింది. ఇక మళ్లీ రెండోసారి కూడా హౌస్ లో అడుగుపెట్టే అవకాశం వచ్చి.. అడుగుపెట్టి మళ్ళీ ఆరోగ్యం సహకరించక వెనుదిరిగింది. ఇకపోతే బిగ్ బాస్ హోస్ట్ , ప్రముఖ స్టార్ హీరో నాగార్జున సహాయంతోనే ఇంటి కలను కూడా నెరవేర్చుకుంది. ఇక 2019లో వచ్చిన తెలుగు సినిమా మల్లేశం ద్వారా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన గంగవ్వ.. ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమాలో కూడా అవకాశాన్ని దక్కించుకుంది. వీటితోపాటు ఎస్ఆర్ కళ్యాణమండపం, లవ్ స్టోరీ, ఇంటింటి రామాయణం , కిస్మత్, భరతనాట్యం వంటి చిత్రాలలో కూడా నటించింది గంగవ్వ. ఇక ఇప్పుడు సిద్ధు మూవీలో కూడా నటించడానికి సిద్ధమవుతోంది. మరి ఈ సినిమాలో ప్రేక్షకులను ఎలా తన కామెడీతో ఆకట్టుకుంటుందో చూడాలి.