Telugu Director: ఇండస్ట్రీలో టాలెంట్ ఒక్కటే చాలదు అంటారు… కానీ కొంతమందికి టాలెంట్‌తో పాటు టెంపర్ కూడా ఊహించని ఎత్తులకు చేరిపోతుందట. ఇదే ఇప్పుడు ఒక స్టార్ డైరెక్టర్ చుట్టూ తిరుగుతున్న మాట. ఈ మధ్యే ఓ క్లాస్ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం అందుకున్న యంగ్ డైరెక్టర్, తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను ఓ స్టార్ హీరోతో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు. సినిమా మీద క్రేజ్ మామూలుగా లేదు. కాని… ఆ డైరెక్టర్ గురించే ఇప్పుడు సమస్య.
ఆ దర్శకుడి టెక్నికల్ స్కిల్, విజువల్ టేకింగ్, ఎమోషనల్ హ్యాండ్లింగ్ అన్నీ వాహ్ అనిపిస్తే, ఆయన సెట్లో ప్రవర్తన మాత్రం “బాస్… ఈయన కొంచెం లైన్ మించిపోతున్నాడు” అనిపించేస్తోందట. ప్రతీరోజూ సెట్లో అసిస్టెంట్ డైరెక్టర్లపై కోపంతో అరుపులు, చేష్టలు, ఒక్కోసారి అయితే ఫిజికల్ గా చేయి కూడా చేసుకుంటున్నాడట. “అదేంటి?” అనుకుంటున్నారా? విని షాక్ అవ్వాల్సిందే – ఇది ఒకసారి జరిగిందని కాదు, ఇది సెట్లో రొటీన్ అయిపోయిందట!
ఫిల్మ్ ఇండస్ట్రీకి ఓ కల తో, సినిమాలపై ప్రేమతో అడుగు పెట్టిన యువకులు… ఓ డైరెక్టర్ దగ్గర పని చేస్తూ తాము నేర్చుకోవాలని వచ్చారు. కానీ వారిని ఇలా కొట్టడం, అందరి ముంచు అవమానించడం కరెక్ట్ కాదు. అసిస్టెంట్లను రాత్రింబవళ్లు వాడుకుని, ఒత్తిడిలో వుంచి, ఏ చిన్న పొరపాటునైనా వెంటనే అందరి ముందే అవమానపరచడం, తిట్టడం, ఒక్కోసారి మాత్రం చేయి వేసే స్థాయికి వెళ్లడం… ఇప్పుడు ఈ డైరెక్టర్ అలవాటైన పనులుగా మారిపోయాయి.
ఇటీవల జరిగిన సంఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది… ఓ అసిస్టెంట్ డైరెక్టర్ –ఈ డైరెక్టర్ చేతిలో చేతిలో దెబ్బలు తిన్నాడు. కానీ ఆ కుర్రాడు మాత్రం మౌనంగా భరిస్తూ ఉండలేకపోయాడు. దీంతో ఆ కుర్రాడు ఆ డైరెక్టర్ పై, డైరెక్టర్స్ అసోసియేషన్‌కి ఫిర్యాదు చేస్తానని వార్నింగ్ ఇచ్చేశాడట. ఆ డైరెక్టర్ కూడా ఈ విషయం పెద్ద గొడవ కాకముందే అసోసియేషన్‌కి ముందుగానే వెళ్లి తన వర్షన్ చెబుదామనుకుంటున్నాడని వినికిడి.
హీరోపైన కోపమే… కారణం?
అయితే అసలు అంత టాలెంట్ ఉండి… బయటకి చాలా నెమ్మదస్తుడిలా ఉండే ఆ దర్శకుడు సడన్ ఇలా ఎందుకు మారిపోయాడా అనేది ఎంక్వయిరీ చేస్తే… ఇదంతా హీరోపై కోపం అని తెలుస్తోంది. స్టార్ హీరో, పాన్ ఇండియా రేంజ్ మార్కెట్ ఉంది… అలాంటి హీరో పడితే ఒక్కసారిగా ఇండియా వైడ్ పేరున్న దర్శకుడిగా మారిపోవచ్చు అని ప్రతి ఒక్కరు అనుకుంటారు, అలానే ఇతను కూడా అనుకోని భారి బడ్జట్ తో, సూపర్ సెటప్ లో సినిమాని చేస్తున్నాడు. అయితే హీరో మాత్రం సరైన సమయానికి డేట్స్ ఇవ్వక ఇబ్బంది పెడుతున్నాడని సమాచారం. లైఫ్ టైమ్ ఆపర్చ్యునిటీ వెస్ట్ అయిపోతుందే అనే ఫ్రస్ట్రేషన్ ని ఆ దర్శకుడు ఎవరిపైన చూపించాలో తెలియక సెట్ లో ఉన్న డైరెక్షన్ డిపార్ట్మెంట్ పై చూపిస్తున్నాడట.