Tollywood:ఒక ఘటన మరువక ముందే మరొక విషాద ఘటన ఇండస్ట్రీని ఉలిక్కిపడేలా చేసింది. గత కొన్ని రోజులుగా వరుస విషాదాలు అభిమానులను కంటతడి పెట్టిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఇప్పుడు మరొక నిర్మాత తుదిశ్వాస విడిచారు. నిన్నటికి నిన్న ప్రముఖ డైరెక్టర్ ఏ ఎస్ రవికుమార్ చౌదరి(AS Ravi Kumar Chaudhary) గుండెపోటుతో మరణించగా.. ఇప్పుడు ఏ ఏ ఆర్ట్స్(AA Arts) అధినేత కే.మహేంద్ర (K.Mahendra) (75) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన అర్ధరాత్రి 12 గంటల సమయంలో తుది శ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు మీడియాతో వెల్లడించారు. ప్రస్తుతం ఈ విషయం తెలిసి ఇండస్ట్రీ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది.
గుంటూరులో నిర్మాత కే.మహేంద్ర అంత్యక్రియలు.
అయితే అనారోగ్య సమస్యలు అని తెలిపారు. కానీ ఆ సమస్యలు రావడానికి గల కారణం ఏంటి? అసలు ఏమైంది? ఆయన ఎలా చనిపోయారు? అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే కే.మహేంద్ర పార్థివ దేహానికి ఈరోజు గుంటూరులో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కే. మహేంద్ర మరణం పట్ల పలువురు సినీ సెలబ్రిటీలు, సినీ పెద్దలు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.
కే.మహేంద్ర నిర్మించిన సినిమాలు..
కే మహేంద్ర సినీ ప్రయాణం.. నిర్మించిన సినిమాల విషయానికొస్తే.. ఏ ఏ ఆర్ట్స్ బ్యానర్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి, 1977లో ‘ప్రేమించి పెళ్లి చేసుకో’ అనే సినిమాతో నిర్మాతగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఆ తర్వాత ఏది పుణ్యం? ఏది పాపం?, ఆరని మంటలు, తోడుదొంగలు, ఎదురులేని మొనగాడు ఇలా సుమారుగా తన నిర్మాణ సంస్థ ద్వారా 50కి పైగా చిత్రాలను నిర్మించారు.
ALSO READ:Star Heroine: స్టార్ హీరో రేంజ్ లో సంపాదన.. స్పెషల్ జెట్ కలిగిన ఏకైక శాండల్ వుడ్ నటి ఎవరంటే?