BigTV English

Aa Okkati Adakku: సెన్సార్ పూర్తి చేసుకున్న ఆ ఒక్కటి అడక్కు.. రిలీజ్ కు రెడీ!

Aa Okkati Adakku: సెన్సార్ పూర్తి చేసుకున్న ఆ ఒక్కటి అడక్కు.. రిలీజ్ కు రెడీ!

Allari Naresh Movie ‘Aa Okkati Adakku’ Ready to Release: అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా మల్లి అంకం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆ ఒక్కటీ అడక్కు. రాజీవ్ చిలక నిర్మించిన ఈ చిత్రం మే 3 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై హైప్ పెంచేశారు. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ వరుస ఇంటర్వ్యూలు సినిమా గురించి మరిన్ని విషయాలను పంచుకుంటున్నారు.


ఇకపోతే ఈ సినిమా తాజాగా సెన్సార్ ను పూర్తిచేసుకుంది. ఈ సినిమా యూ/ఏ సర్టిఫికెట్ నుఅందుకున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 2 గంటల 14 నిమిషాల నిడివితో ఆ ఒక్కటి అడక్కు సినిమా రిలీజ్ కానుందని తెలిపారు. చాలా గ్యాప్ తరువాత అల్లరి నరేష్ తన కామెడీ ట్రాక్ లోకి వచ్చాడు. ఈ మధ్యకాలంలో సీరియస్ పాత్రలు చేస్తూ కనిపించిన నరేష్.. మళ్లీ ఈ సినిమాతో కామెడీ పంథాను ట్రై చేస్తున్నాడు.

30 ఏళ్ళు దాటినా కూడా పెళ్లి కానీ యువకుడు పడే బాధలను ఈ చిత్రంలో చూపించారు. ఈ సినిమా ప్రతి ఒక్క కుర్రాడికి నచ్చుతుందని మేకర్స్ తెలిపారు. ఇక సెన్సార్ తో పాటు బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. చాలా గ్యాప్ తరువాత నరేష్ కామెడీ సినిమాతో వస్తుండడంతో బుకింగ్స్ మంచిగానే జరుగుతున్నట్లు తెలుస్తోంది.


Also Read: Krish Jagarlamudi: హరిహర వీరమల్లు.. క్రిష్ తప్పుకున్నాడా.. ? తప్పించారా.. ?

నరేష్ తో పాటు ఫరియా కూడా ఈ సినిమాపై బాగా ఆశలుపెట్టుకుంది. చిట్టి లాంటి పాత్ర తరువాత అమ్మడుకు మరో హిట్ పడిందే లేదు. దీంతో ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటుంది. ఒకవేళ ఇది హిట్ అయితే కనుక ఫరియా..ట్రాక్ ఎక్కినట్లే అని చెప్పొచ్చు. నరేష్ కూడా ఈ సినిమాకోసమే ఎదురుచూస్తున్నాడు. నాంది, ఉగ్రం, మారేడుమిల్లి అంటూ వరుసగా సీరియస్ పాత్రలు చేసుకుంటూ వచ్చినా .. ఆ పాత్రల్లో చాలామంది నరేష్ ను చూడలేకపోయారు. నవ్వించే నరేష్ కోసం ఎదురు చూస్తున్నామని చెప్పడంతో అతను కూడా మళ్లీ కామెడీ ట్రాక్ లోకి వచ్చాడు.  మరి ఈ సినిమాతో ఈ జంట హిట్ అందుకుంటారో లేదో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×