BigTV English

Milk: వేసవిలో పాలు విరిగిపోతున్నాయా.. ఈ చిట్కాలు ఫాలో అవ్వండి చాలు !

Milk: వేసవిలో పాలు విరిగిపోతున్నాయా.. ఈ చిట్కాలు ఫాలో అవ్వండి చాలు !

Milk: ఆహార పదార్థాలు సమ్మర్ లో త్వరగా పాడవుతుంటాయి. ముఖ్యంగా పాలు సమ్మర్ లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా విరిగిపోతుంటాయి. పాలను బాగా మరిగించడం, ఫ్రిడ్జ్ లో నిల్వ చేయడం వల్ల పాడవకుండా ఉంటాయి. కొన్ని చిట్కాలు పాటించడం వల్ల పాలు త్వరగా విరిగిపోకుండా ఉంటాయి.


పెరుగుతున్న వేడి కారణంగా ఆహార పదార్థాలు త్వరగా పాడవుతుంటాయి. అందుకే వాటిపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పాలను బాగా మరిగించి ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచాలి. లేదంటే త్వరగా విరిగిపోతాయి. కొన్ని సార్లు కరెంట్ కట్ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టినా కూడా పాలు పాడవుతాయి. ఇలాంటి సమయాల్లో పాలు పాడవకుండా ఉండడానికి కొన్ని చిట్కాలు ఫాలో అవ్వాలి. పాలను ఫ్రిడ్జ్ లో పెట్టకుండా ఒక్క రోజు నిల్వ ఉంచే చిట్కాలను పాటించాలి.

పాలను 24 గంటల్లో 3 నుంచి 4 సార్లు మరిగించాలి. పాలు రెండు లేదా మూడు సార్లు మరిగే వరకూ గ్యాస్ మంట ఒకే లెవల్ లో పెట్టుకోవాలి. పాలు మరిగించిన తరువాత పూర్తిగా చల్లారనివ్వాలి. వెంటనే పాలను తీసుకెళ్ళి ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు. పాలు కాచేటప్పుడు పాత్ర శుభ్రంగా ఉందో లేదో చూసుకోవాలి. తర్వాత అందులో ఒక చెంచా నీటిని వేయాలి. దీంతో పాలు పాత్రకు అంటుకోకుండా ఉంటాయి.


Also Read: జామ పండు జ్యూస్‌తో అద్భుతమైన ప్రయోజనాలు..

పాలలో బేకింగ్ సోడా వేసి మరిగించడం వల్ల కూడా పాలు విరిగిపోకుండా ఉంటాయి. పాలల్లో చిటికెడు బేకింగ్ సోడా వేసి మరిగిస్తే.. త్వరగా పాడవకుండా ఉంటాయి. ఎక్కువ బేకింగ్ సోడా వేయడం వల్ల కూడా పాల రుచి మారిపోతుంది. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో ప్యాకెట్ పాలు అందుబాటులో ఉంటున్నాయి. ఈ పాలను ఎక్కువగా మరిగించాల్సిన అవసరం లేదు అందుకంటే.. కంపెనీలు పాలను ప్యాకింగ్ చేయడానికి ముందు పూర్తిగా శుభ్రపరుస్తాయి. పాలను తరుచూ వేడి చేయడం వల్ల అందులోని పోషకాలు నశిస్తాయి. అలాంటి పాలు వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి ప్రయత్నించాలి.

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×