AA22 X A6 Movie Update: పుష్ప మూవీ(Pushpa Movie) తో పాన్ ఇండియా స్టార్ గా మారిన అల్లు అర్జున్ (Allu Arjun) నెక్స్ట్ సినిమాలపై అభిమానుల్లో ఆసక్తి పెరిగిపోయింది. ముఖ్యంగా ‘పుష్ప’ సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్న అల్లు అర్జున్ కి దేశవ్యాప్తంగా ఇమేజ్ పెరిగిపోయింది.ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ చేసే ప్రతి ఒక్క సినిమాపై భారీ అంచనాలు ఉంటాయి. ఈ నేపథ్యంలోనే పుష్ప-2 (Pushpa-2)విడుదలయ్యాక అల్లు అర్జున్ తో నెక్స్ట్ వర్క్ చేసే దర్శకులు వీళ్లే అంటూ చాలామంది డైరెక్టర్ల పేర్లు తెరమీద వినిపించాయి. కానీ చివరికి కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ (Atlee) తో అల్లు అర్జున్ తన 22వ సినిమా చేస్తున్నట్టు అఫీషియల్ గా బయట పెట్టారు. ఇక ఇప్పటికే అల్లు అర్జున్ మూవీకి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరిగింది. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించి పూజా కార్యక్రమాలు గ్రాండ్ గా జరిగాయి. మరి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడో ఇప్పుడు తెలుసుకుందాం.
అల్లు అర్జున్ మూవీకి ఘనంగా పూజా కార్యక్రమాలు..
కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ (Atlee)ఇప్పటివరకు తీసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్సే. అలా బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ (Shahrukh Khan) తో ‘జవాన్’ సినిమా తీసి రూ.1000 కోట్ల డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ఈయన.. ప్రస్తుతం ఇండియన్ సినిమా బాక్సాఫీస్ ని కలెక్షన్స్ తో షేక్ చేసిన పుష్ప-2 హీరో అల్లు అర్జున్ తో వర్క్ చేస్తున్నారు. అయితే పుష్ప-2 తో అల్లు అర్జున్ (Allu Arjun) కి ఎంత ఇమేజ్ పెరిగిందో అంతే డ్యామేజ్ కూడా జరిగింది.
ఆయన అరెస్ట్ అవ్వడంతో ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కానీ అరెస్ట్ అయినా కూడా అల్లు అర్జున్ ఇమేజ్ మరింత పెరగడానికి సహాయ పడిందని చెప్పుకోవచ్చు. ఇదిలా ఉంటే తాజాగా అల్లు అర్జున్ అట్లీ మూవీకి సంబంధించి షూటింగ్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేశారు. ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు తాజాగా ఈరోజు గ్రాండ్ గా నిర్వహించారు. అయితే అల్లు అర్జున్ – అట్లీ కాంబోలో రాబోతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ రేపటి నుండే స్టార్ట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.
ఘనంగా రేపే సినిమా షూటింగ్ స్టార్ట్..
ఇక అల్లు అర్జున్ – అట్లీ కాంబోలో రాబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా దీపిక పదుకొనే(Deepika Padukone)ని ఫిక్స్ చేసి అధికారిక ప్రకటన చేశారు. అలాగే వీరి కాంబోలో రాబోతున్న ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫాంటసీ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతుందట. అంతేకాదు ఈ సినిమా కోసం ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నారని, ఇందుకోసం హాలీవుడ్ లోని దిగ్గజ వీఎఫ్ఎక్స్ సంస్థలు పనిచేస్తున్నాయని కూడా వార్తలు వినిపించాయి.
అల్లు అర్జున్ – అట్లీ మూవీ పాన్ వరల్డ్ లెవెల్ లో హాలీవుడ్ మూవీ తరహాలో ఉంటుందని ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాల పెంచేశారు. ఇక AA 22 సినిమాని సన్ పిక్చర్స్ బ్యానర్(Sun Pictures Banner) చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. అలాగే ఈ మూవీకి దాదాపు రూ.800 కోట్ల బడ్జెట్ పెట్టబోతున్నట్టు కూడా సమాచారం. ఇక ఇప్పటి వరకు ఇండియన్ సినీ హిస్టరీలో ఇలాంటి ఒక జానర్ కాంబినేషన్లో సినిమా రాలేదని AA 22 మూవీ పై భారీ హైప్ క్రియేట్ చేస్తున్నారు.
also read:Silk Smita: అక్కడే సిల్క్ స్మిత పతనం మొదలైందా.. తెరవెనుకే కాదు తెరముందు నిజాలు కూడా ఇవే!