Brain Health: మన మెదడు శరీరంలోని అత్యంత సంక్లిష్టమైన, ముఖ్యమైన అవయవం. కానీ తెలియకుండానే మనం మన రోజువారీ అలవాట్ల ద్వారా దానికి హాని కలిగిస్తున్నాము. మనం ప్రతి రోజు చేసే కొన్ని రకాల అలవాట్లు చాలా సాధారణం. కానీ మెదడుకు హాని కలిగించే పనులను సకాలంలో గుర్తింయకపోతే.. అవి మన జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, మానసిక ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతాయి. అందుకే మెదడును నెమ్మదిగా బలహీనపరిచే 8 అలవాట్ల గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
నిద్ర లేకపోవడం:
తగినంత నిద్ర లేకపోవడం వల్ల అలసట మాత్రమే కాదు, మెదడు పనితీరు కూడా ప్రభావితమవుతుంది. నిద్రలో మెదడు తనను తాను రీసెట్ చేసుకుంటుంది. రోజులోని సమాచారాన్ని కూడా క్రమబద్ధీకరిస్తుంది. తక్కువ నిద్రపోవడం వల్ల జ్ఞాపకశక్తి తగ్గుతుంది. అంతే కాకుండా నిరాశ కూడా పెరుగుతుంది.
అధిక స్క్రీన్ సమయం:
మొబైల్, టీవీ, ల్యాప్‌టాప్‌లతో ఎక్కువ సమయం గడపడం వల్ల మెదడు అలసిపోతుంది. డిజిటల్ ఓవర్‌లోడ్ ఏకాగ్రత సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. అంతే కాకుండా ఇది నిద్రను కూడా ప్రభావితం చేస్తుంది. ఎక్కువసేపు స్క్రీన్‌కు చూడటం వల్ల కళ్ళు, మెదడు రెండింటిపై ఒత్తిడి పెరుగుతుంది.
టిఫిన్ తినకపోవడం:
చాలా మంది సమయం లేకపోవడం వల్ల లేదా బరువు తగ్గడం వల్ల టిఫిన్ తినడం మానేస్తారు. కానీ మెదడుకు టిఫిన్ చాలా ముఖ్యం. టిఫిన్ తినకపోవడం వల్ల మెదడుకు తగినంత గ్లూకోజ్ అందదు. ఇది అలసట , చిరాకుకు దారితీస్తుంది.
అధిక చక్కెర తీసుకోవడం:
ప్రతి ఒక్కరూ స్వీట్లు తినడానికి ఇష్టపడతారు. కానీ అధిక చక్కెర మెదడు కణాలను దెబ్బతీస్తుంది. ఇది మెదడు వాపుకు కారణమవుతుంది. అంతే కాకుండా ఇది మానసిక అనారోగ్యాలకు దారితీస్తుంది. ఆలోచించే ,అర్థం చేసుకునే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది.
చాలా తక్కువ నీరు త్రాగడం:
హైడ్రేషన్ లేకపోవడం శరీరాన్ని మాత్రమే కాకుండా మనస్సును కూడా ప్రభావితం చేస్తుంది. శరీరంలో నీటి పరిమాణం తక్కువగా ఉన్నప్పుడు, మెదడు సామర్థ్యం తగ్గడం ప్రారంభమవుతుంది. దీని వలన తలనొప్పి, అలసట, ఏకాగ్రత లేకపోవడం వంటివి పెరుగుతుంటాయి.
మానసిక ఒత్తిడిని తగ్గుదల:
నిరంతర ఒత్తిడి మెదడును ప్రభావితం చేస్తుంది. ఒత్తిడి మెదడులో కార్టిసాల్ హార్మోన్‌ను పెంచుతుంది. అంతే కాకుండా ఇది న్యూరాన్‌లను దెబ్బతీస్తుంది. ఒత్తిడిని సకాలంలో తగ్గించుకోకపోతే అది నిరాశ , ఆందోళన రూపంలోకి మారుతుంది.
Also Read: ఈ ఆయుర్వేద పదార్థాలు వాడితే.. 50 ఏళ్లయినా జుట్టు అస్సలు రాలదు
ఒంటరితనం అలవాటు:
ఎక్కువసేపు ఒంటరిగా ఉండటం, సామాజిక సంబంధాలకు దూరంగా ఉండటం మెదడు ఆరోగ్యానికి హానికరం. ఇది మానసిక అలసట, నిరాశకు దారితీస్తుంది. అంతే కాకుండా ఇది ఆలోచనా శక్తిని ప్రభావితం చేస్తుంది. మానవ మెదడు సామాజిక సంబంధాల నుండి శక్తిని పొందుతుంది.
శారీరక శ్రమ లేకపోవడం:
కూర్చొని పనిచేసే అలవాటు మెదడును మందకొడిగా మారుస్తుంది. అందుకే క్రమం తప్పకుండా వ్యాయామం చేయకపోవడం వల్ల మెదడుకు రక్త ప్రవాహం తగ్గుతుంది. ఇది కొత్త కణాల ఏర్పాటుకు ఆటంకం కలిగిస్తుంది. వ్యాయామం మెదడును చురుకుగా ఉంచడంలో సహాయపడుతుంది.