BigTV English
Advertisement

Premalu 2: ఆగిపోయిన ప్రేమలు 2.. అతనే కారణమా. ?

Premalu 2: ఆగిపోయిన ప్రేమలు 2.. అతనే కారణమా. ?

Premalu 2: కొన్ని సినిమాలు ప్రేక్షకులను నవ్విస్తాయి.. ఇంకొన్ని సినిమాలు .. ఏడిపిస్తాయి. మరికొన్ని జీవితాంతం గుర్తుండిపోయేలా చేస్తాయి. ఆ సినిమా పేరు తలుచుకున్నప్పుడల్లా అందులో నటించిన హీరోలు హీరోయిన్లు ముఖాలు కళ్ళ ముందు కదలాడుతూ ఉంటాయి. దానికి కారణం వాళ్ళు చేసే నటన, చూపించే భావోద్వేగాలు . కొన్నిసార్లు ఆ సినిమా వారి కోసమే పుట్టిందేమో అనిపిస్తుంది. ఇక ఆ సినిమాకు సీక్వెల్ వస్తుంది అంటే అందులో కూడా మొదటి పార్ట్ లో నటించిన వారు నటిస్తేనే ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు .అందుకే ఎక్కువ సీక్వెల్స్ లలో హీరోను చేంజ్ చేయకుండా మిగతా వారిని కథకు తగ్గట్టు తీసుకుంటారు.


 

ఇక తాజాగా ఒక సీక్వెల్ లో మొదటి పార్ట్ లో ఉన్న హీరో.. సీక్వెల్ కు నో చెప్పాడని టాక్ నడుస్తోంది. గతేడాది నుంచి మలయాళ సినిమాలు తెలుగులో సూపర్ హిట్  కొడుతున్నాయి. అలా లాస్ట్ ఇయర్  వచ్చిన సినిమాల్లో ప్రేమలు ఒకటి. నస్లేన్ కె. గఫూర్, మమితా బైజు, అల్తాఫ్ సలీమ్, మీనాక్షి రవీంద్రన్, అఖిల భార్గవన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు  గిరీష్ ఏడీ దర్శకత్వం వహించగా తెలుగులో ఎస్.ఎస్ కార్తికేయ విడుద‌ల చేశాడు. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ప్రేమలు తెలుగులో కూడా భారీ విజయాన్ని అందుకుంది.


 

ప్రేమలు పేరు వినగానే అందరికీ సచిన్ మాత్రమే గుర్తొస్తాడు. సచిన్(నస్లేన్ కె. గఫూర్) ఒక అమాయకమైన కుర్రాడు. ఇంట్లో సమస్యలు తట్టుకోలేక విదేశాలకు వెళ్లి డబ్బు సంపాదించాలనుకుంటాడు. వీసా రిజెక్ట్ అవ్వడంతో ఫ్రెండ్ తో పాటు హైదరాబాద్ వచ్చి చిన్న చిన్న పనులు చేసుకుంటూ గేట్ కోచింగ్  తీసుకుంటాడు. అప్పుడే అతనికి రీనూ(మమితా బైజు)  పరిచయం అవుతుంది.అప్పటికే రీనూ వాళ్ళ ఆఫీసులో ఆది (శ్యామ్ మోహన్) ఆమెను ఇష్టపడుతూ ఉంటాడు. రేణుకు బాగా సెటిల్ అయినవాడిని పెళ్లి చేసుకోవాలని డ్రీమ్. మరి ఈ ఇద్దరిలో రీనూ ఎవరిని ప్రేమిస్తుంది.. ? సచిన్ చివరకు విదేశాలకు వెళ్లాడా.. ? అనేది ప్రేమలు కథ.

 

ప్రేమలు సినిమాను తెలుగువారికి కనెక్ట్ అయ్యేలా చేసింది ఒరిజినాలిటీ. ఎక్కడో కేరళలో తీసి.. దాన్నే హైదరాబాద్ అని చూపించకుండా.. ఇక్కడే షూటింగ్ చేసి హైదరాబాద్ గొప్పతనం చెప్పుకొచ్చారు. అంతే కాకుండా తెలుగు మీమ్స్ లో వచ్చే  డైలాగ్స్ ను  సినిమాలో పెట్టడం వలన త్వరగా కనెక్ట్ అయ్యింది. ప్రేమలు సినిమాకు హైలైట్ అంటే నస్లేన్ అనే చెప్పాలి. సచిన్ పాత్రలో ఉండే అమాయకత్వం, ఏమి తెలియకుండా మాట్లాడే తొందర, ఆతని ఎక్స్ ప్రెషన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ఈ సినిమా నస్లేన్ ను ఓవర్ నైట్ స్టార్ హీరోగా మార్చేసింది.

 

ప్రేమలు హిట్ తరువాత మేకర్స్ ప్రేమలు 2 పేరుతో సీక్వెల్ చేయాలనీ ప్లాన్ చేశారు. అధికారికంగా రాకపోయినా ఈ సినిమా సెట్స్ మీదకు కూడా వెళ్లిందని టాక్ నడిచింది. ప్రేమలు 2 వస్తుంది అని తెలియడంతో అభిమానులు సైతం మళ్లీ సచిన్ వస్తున్నాడని .. మంచి రచ్చ చేస్తాడని అనుకున్నారు. కానీ, అందుతున్న సమాచారం ప్రకారం నస్లేన్.. ప్రేమలు 2 నుంచి తప్పుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. నస్లేన్ లేకపోతే ప్రేమలు 2 కు కథ కూడా ఉండదు. అతని ప్లేస్ ను రీప్లేస్ చేసినా కూడా ప్రేక్షకులు అంతగా కనెక్ట్ అవ్వరు. అందుకే మేకర్స్ ప్రేమలు 2 ను ఆపేసారని వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×