Silk Smita: ఒకప్పుడు స్పెషల్ సాంగ్స్ తో సౌత్ సినీ పరిశ్రమను శాసించిన నటీమణులలో సిల్క్ స్మిత పేరు ప్రథమంగా వినిపిస్తుంది. ఎన్నో సినిమాల కథలు ఈమె చుట్టూనే తిరిగాయి. అంతలా మెయిల్ లీడ్ గా నటించి ఎంతోమంది ఫేవరెట్ బ్యూటీగా పేరు సొంతం చేసుకుంది. ముఖ్యంగా చిరంజీవి(Chiranjeevi ), బాలకృష్ణ(Balakrishna ), కృష్ణంరాజు(Krishnam Raju).వంటి హీరోలకు దీటుగా స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది సిల్క్ స్మిత. ఇకపోతే ఆ కాలంలో ఈమె డిమాండ్ ఎలా ఉండేది అంటే మెగాస్టార్ చిరంజీవి అయినా.. సూపర్ స్టార్ రజినీకాంత్ అయినా ఈమె డేట్స్ కోసం ఎదురు చూడాల్సిందే. అంతేకాదు దర్శక నిర్మాతలు కూడా తమ సినిమాలలో సిల్క్ స్మితని తీసుకోవాలనుకుంటే ముందుగా ఆమె డేట్స్ కుదిరిన తర్వాతే హీరోలను ఫైనల్ చేసేవారట.అంత డిమాండ్ ఉండేది అప్పట్లో ఆమెకు . అంతే కాదు ఆమె ఉంటే జనం థియేటర్లకు క్యూ కట్టే వారు కూడా.
సిల్క్ స్మిత మరణంపై వీడని మిస్టరీ..
అలా అతి చిన్న వయసులోనే ఊహించని స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకొని బిజీగా మారిన సిల్క్ స్మితకు నా అనేవారు లేక నమ్మిన వాళ్లు మోసం చేయడంతో జీవితం మొత్తం తలకిందులు అయ్యింది. ఇక కుటుంబ సభ్యులు ఉన్నప్పటికీ వారు ఈమెను పట్టించుకోలేదని, అందుకే నమ్మిన వాళ్లు కూడా మోసం చేశారని ఆత్మహత్య చేసుకుంది సిల్క్ స్మిత. నిజానికి ఈమె మేడ పైన నుండి కింద పడిందని కొంతమంది చెబితే.. ఇంకొంతమంది తోసేసారు అని చెబుతున్నారు. అయితే ఇంకొంతమంది మద్యం మధ్యలో కాలుజారి కింద పడిపోయింది అని చెబుతారు. ఇలా ఎవరికీ నచ్చిన రీతిలో వారు కామెంట్లు చేస్తున్నారు కానీ సిల్క్ స్మిత మరణం వెనుక అసలు కారణం ఇప్పటికీ బయటపడలేదు.
ఆర్థికంగా చితికి పోవడానికి కారణం అదే..
ఇకపోతే సిల్క్ స్మిత ఆర్థికంగా ఇబ్బందులు పడడానికి కారణం ఆమె నిర్మాతగా మారడమే.. కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే ఒక్కో పాటకు హీరోయిన్ రేంజ్ లో పారితోషకం తీసుకునే ఈమె.. తన క్రేజ్ తగ్గుతున్న క్రమంలో నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టింది. అలా మొదట ‘వీర విహారం’ అనే చిత్రంతో నిర్మాతగా మారింది. ఇందులో శ్రీహరి భార్య డిస్కో శాంతి (Disco Shanti) హీరోయిన్ గా చేసింది. కానీఅనేక కారణాలతో ఆగిపోయిన ఈ సినిమా విడుదల కాలేదు. దీంతో మొదటి సినిమాతోనే నష్టం వాటిల్లింది. అయినా సరే నిర్మాణ రంగంపై ఆమెకున్న వ్యామోహం తగ్గలేదు. అలా ఎస్సార్ సినీ ఎంటర్ప్రైజెస్ పేరుతో ఏకంగా ప్రొడక్షన్ సంస్థని ప్రారంభించి, తొలి ప్రయత్నంగా ‘ప్రేమించి చూడు’ అనే సినిమాను నిర్మించింది. ప్రముఖ సీనియర్ హీరోలు చంద్రమోహన్ (Chandra Mohan), రాజేంద్రప్రసాద్(Rajendra Prasad)ఇందులో హీరోలుగా నటించగా.. సిల్క్ స్మిత హీరోయిన్గా నటించింది.
నమ్మిన వల్లే మోసం చేయడంతో ఆత్మహత్య..
ఇకపోతే అదే సమయంలో నటిగా అవకాశాలు రావడంతో మళ్లీ సినిమాలు చేయడం మొదలుపెట్టిన ఈమె.. తన ప్రొడక్షన్ సంస్థను ఏం చేయాలో తెలియక తన పర్సనల్ సెక్రటరీ కి ఆ బాధ్యతలు అప్పగించింది. కానీ అతడు మోసం చేశాడు. ఈ సినిమా కు బాగా ఖర్చు పెట్టించాడు. ఇక సినిమా కోసం చేసిన అప్పులు తీర్చడానికి నగలు కూడా తాకట్టు పెట్టింది సిల్క్ స్మిత. అలా ఆర్థికంగా దిగజారిపోయి ఇబ్బందులు ఎదుర్కొంది. ఆ తర్వాత ‘నా పేరు దుర్గ’ అనే పేరుతో సినిమా చేసింది. కానీ ఈ సినిమా కూడా విడుదల కాలేదు. అలా నిర్మాతగా మారడం వల్లే ఆర్థికంగా చితికిపోయి, డిప్రెషన్ లోకి వెళ్లిపోయి, ఆత్మహత్య చేసుకుందని చెబుతారు. కానీ అసలు నిజాలు మాత్రం ఇంకా మిస్టరీగానే ఉన్నాయని సమాచారం.
ALSO READ:Singer Mangli : సింగర్ మంగ్లీ బర్త్ డే పార్టీపై పోలీసులు దాడి… పలువురికి డ్రగ్స్ పాజిటివ్!