BigTV English

Sabdham Movie Review : ‘శబ్దం’ మూవీ రివ్యూ

Sabdham Movie Review : ‘శబ్దం’ మూవీ రివ్యూ

Sabdham Movie Review : 2011 ఆ టైంలో తెలుగులో వచ్చిన ‘వైశాలి’ తెలుగు ప్రేక్షకులకి కొత్త ఫీలింగ్ ఇచ్చింది. ఆ సినిమా దర్శకుడు, హీరో, మ్యూజిక్ డైరెక్టర్ కలిసి మళ్ళీ 15 ఏళ్ళ తర్వాత చేసిన ‘శబ్దం’ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ‘వైశాలి’ లా మెప్పించిందో లేదో? ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి..


కథ :
మున్నార్ లో హోలీ ఏంజెల్ కాలేజీ ఉంటుంది. అక్కడ అనుమానాస్పద రీతిలో ముఖేష్, శ్వేత అనే ఇద్దరు స్టూడెంట్లు మరణిస్తారు. వాళ్ళు ఎలా మరణించారో తెలియక.. చాలా మంది ఆ కాలేజీలో దెయ్యాలు ఉన్నాయి. అవే వీళ్ళని బలితీసుకున్నాయి అని ప్రచారం చేస్తుంటారు. దీంతో కాలేజీ యాజమాన్యం ఇందులో ఎంత నిజం ఉందో తెలుసుకునేందుకు ఘోస్ట్ ఇన్వెస్టిగేటర్ అయినటువంటి వ్యోమ వైద్యలింగం (ఆది పినిశెట్టి) సాయం కోరుతుంది. అతను కాలేజీలో అడుగుపెట్టి.. అసలు నిజాన్ని గనిపెట్టే ప్రయత్నం చేస్తాడు. మరోపక్క అవంతిక (లక్ష్మీ మీనన్) అనే అమ్మాయి అక్కడ దెయ్యాలు వంటివి లేవు అని థీసిస్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో వాళ్లకి వింత సమస్యలు వచ్చి పడతాయి. అవంతిక ప్రవర్తనలో కూడా మార్పులు వస్తాయి? అసలు ఆమెకి ఏమైంది? వ్యోమ ఆమె సమస్యని గుర్తించాడా? మధ్యలో డయానా (సిమ్రాన్), న్యాన్సీ డేనియల్ (లైలా) లు ఎవరు? వాళ్ళతో ఈ కథకి లింక్ ఏంటి? అనే ప్రశ్నలకి సమాధానమే ‘శబ్దం’ మిగిలిన సినిమా

విశ్లేషణ :
ఈరోజుల్లో హారర్ సినిమాలు తీయడం కూడా ఒక ఛాలెంజ్. ఎందుకంటే హారర్ సినిమాలు ఎప్పుడూ ఒకే పద్దతిలో ఉంటాయి అనే ఫిక్స్ అయ్యే ఆడియన్స్ ఎక్కువ. ఒక ఇంట్లోనో లేక ఒక బంగ్లాలో ఒక దెయ్యం ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా అది భయపెడుతుంది. ఇంటర్వెల్ కి ఆ దెయ్యానికి ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉన్నట్టు ఒక ట్విస్ట్ ఉంటుంది. సెకండాఫ్ లో ఆ ట్విస్ట్ వెనుక ఉన్న కథని రివీల్ చేసి క్లైమాక్స్ లో దాన్ని మంచి దెయ్యంలా చూపించి సినిమాకి శుభం కార్డు వేసేస్తారు అని నమ్మే ఆడియన్స్ ఎక్కువే. మరి ఇలాంటి వాళ్ళని థియేటర్ వరకు రప్పించడానికి పగడ్బందీ స్క్రీన్ ప్లే రాసుకోవాలి అంటే ఎంత కష్టపడాలో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నిజానికి ‘శబ్దం’ కూడా అదే టెంప్లేట్ తో తీసిన సినిమానే. కాకపోతే ‘శబ్దం’ తొలి సగం కొంచెం కొత్త స్క్రీన్ ప్లేతో నడుస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఇంటర్వెల్ వరకు దర్శకుడు ప్రేక్షకులను భయపెట్టడానికి చేసిన ప్రయత్నాలు వర్కౌట్ అవుతాయి. కానీ సెకండాఫ్ మొదలైన కాసేపటికే మిగిలిన కథపై ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఆ తర్వాత ఊహించిన సీన్లే తెరపైకి వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. దీంతో హారర్ ఫీల్ పోయి.. రొటీన్ అనే పదానికి మన మైండ్ ట్యూన్ అయిపోతుంది. ‘వైశాలి’ కాంబో కాబట్టి.. ఆడియన్స్ కచ్చితంగా ‘శబ్దం’ కొత్తగా ఉంటుంది అనుకుంటారు. కచ్చితంగా భయపెట్టేలా ఉంటుంది అని భావిస్తారు. కానీ అలాంటివి ఎక్కువగా లేకపోగా ఫ్లాట్ గా ఉంటుంది ‘శబ్దం’. ఈ సినిమా విషయంలో దర్శకుడు చేసిన డ్యూటీ ఎక్కువగా లేదు. మొత్తం టెక్నికల్ టీంపైనే ఆ భారం వదిలేశాడు. తమన్ తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పర్వాలేదు అనిపించాడు. సినిమాటోగ్రాఫర్ కూడా తన డ్యూటీ తాను బాగానే చేశాడు.


నటీనటుల విషయానికి వస్తే…ఆది పినిశెట్టి ‘వైశాలి’ తరహాలోనే సెటిల్డ్ గా చేశాడు. ఇంతకు మించి హీరో చేయడానికి ఏమీ లేదు. లక్ష్మీ మీనన్ కి కొంచెం మంచి పాత్రే దొరికింది. ఆడియన్స్ ని కొంత సర్ప్రైజ్ చేసే పాత్రే ఇది. లైలా, సిమ్రాన్ కి కూడా మంచి పాత్రలు దొరికాయి. మిగతా నటీనటుల పాత్రలు కూడా ఓకే

ప్లస్ పాయింట్స్ :

ఫస్ట్ హాఫ్
క్యాస్టింగ్ బాగా కుదరడం
టెక్నికల్ వాల్యూస్

మైనస్ పాయింట్స్ :

రొటీన్ గా సాగడం
సెకండాఫ్

మొత్తంగా.. ఈ ‘శబ్దం’ ఒక యావరేజ్ హారర్ మూవీ. థ్రిల్లింగ్ ఫాక్టర్స్ లేదా హారర్ ఎపిసోడ్స్ గ్రిప్పింగ్ గా లేకపోవడం వల్ల.. ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో అనిపించదు.

Sabdham Telugu Movie Rating : 2.25 / 5

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×