Satyabhama Today Episode February 28th: నిన్నటి ఎపిసోడ్లో.. క్రిష్ చక్రవర్తిని తన తండ్రి అని ఇంకా నమ్మలేకపోతున్నాడు. అందుకే ఆయనతో మాట్లాడటం కూడా సరిగ్గా మాట్లాడలేకపోతున్నాడు క్రిష్. ఇక సత్తి కూడా క్రిష్ బాధను అర్థం చేసుకొని ఎక్కువగా ఈ విషయం గురించి మాట్లాడకుండా దూరంగా ఉంటుంది. సత్తి దగ్గరికి చక్రవర్తి వచ్చి క్రిష్ పరిస్థితి చూస్తే నాకు బాధగా ఉంది అని బాధపడతాడు. బాధేముంది మామయ్య ఎప్పుడో ఒక రోజు ఈ విషయం తెలియాల్సిందే కదా అది ఇప్పుడు తెలిసింది ఆయన బాధంతా దేవుడు లాగా చూసుకున్నా బాపు ఇలాంటి దారుణమైన నిజాన్ని ఎందుకు దాచి పెట్టాడని బాధపడుతున్నాడని సత్య అంటుంది.. దాంతో క్రిష్ బాబాయ్ కాసేపు నీ గుండెల మీద తల వాల్చుకోవచ్చా అని అని అంటాడు. దాంతో క్రిష్ చక్రవర్తి గుండెల మీద తలవాల్చుకొని ఏడుస్తాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే… రుద్ర బయటికి వస్తుంటాడు. అక్కడున్న ట్రాఫిక్ ఎస్ఐ కానిస్టేబుల్ ఇద్దరు అతని ఆపుతారు. ఏమైంది నన్నెందుకు ఆపారని రుద్ర అడుగుతాడు. ఎవరో తెలిసే నన్ను ఆపారా మహదేవ కొడుకుని మహదేవ గురించి తెలుసా మీకు అని రుద్రా అంటాడు. ముందు లైసెన్స్ తియ్యు ఆ తర్వాత ఏం చేయాలి మేము చెప్తామని ఎస్సై అంటాడు. కానీ రుద్ర ఎస్ఐ అన్న మాటలకు కోపంతో రగిలిపోతూ ఎస్ఐ కాలర్ పట్టుకుంటాడు. అది వీడియో షూట్ చేస్తారు. డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ ఎస్ఐ చొక్కా పట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుసా అని అతని అరెస్ట్ చేస్తారు. అర్థమైందిరా నువ్వు ఎవరి దగ్గర ఎంత తీసుకున్నావు అంతకుమించి నేను ఇస్తాను అని రుద్రా అంటాడు మాకు ఏదైనా మొదటిసారి కమిట్మెంట్ ఉంటుంది ఆ తర్వాత మాకు అవసరం లేదని ఎస్ఐ అంటాడు.
ఆ తర్వాత సంజయ్ కి ఎస్ఐ కాల్ చేస్తాడు. మీ అన్నయ్యను అనుకున్న విధంగానే అరెస్ట్ చేసాము అని చెప్పగానే వెరీ గుడ్ మీకు రావాల్సింది నేను ఇస్తాను అని అంటాడు. ఆస్తి అంతా రుద్ర పేరు మీద ఉంటే నేనేం చేయాలి? ఈ ఆస్తి నాదే ఈ ఆస్తి మొత్తాన్ని నేనే అనుభవించాలి అని రుద్ర ఇంకా బయటికి రాకుండా చేయాల్సిందని సంజయ్ ప్లాన్ వేస్తాడు. ఆ తర్వాత మహదేవయ్య దగ్గరికి వెళ్తాడు. అప్పుడే భైరవి అక్కడికి వస్తుంది. పెనిమిటి రుద్రనే పోలీస్ అరెస్ట్ చేశారంట అనగానే వీడు బెయిల్మీద బయటకు వచ్చాడు మరి ఇలాంటి చేయడం అవసరమా ఆ చిన్నగాన్ని పిలువు అని భైరవితో అంటాడు..
మీరు నన్ను ఇంకా కొడుకుగా యాక్సెప్ట్ చేయట్లేదు అందుకే కృష్ణ రమ్మని చెప్తున్నారని సంజయ్ ఫీల్ అయినట్లు యాక్ట్ చేస్తాడు. ఆ పోయిన క్రిష్ గాన్ని మీరు మళ్ళీ తీసుకొస్తారేమో అలా చేస్తే మళ్లీ వాన్ని నెత్తిన పెట్టుకున్నట్లు అవుతుంది అని భైరవి అంటుంది.. సంజయ్ కూడా కృషి చేసే పని నేను చేయలేకపోతున్నా నేను వెళ్లి అన్నయ్యను బయటకు తీసుకొస్తాను అని వెళ్తూ ఉంటే మహదేవ ఆపుతాడు ఇదంతా ఈ లొల్లి పంచాయతీలన్నీ నేను చూసుకుంటాను నేను అమెరికాలో చదివించింది నీతో జాబ్ చేయించడానికి మంచి బిజినెస్ లు పెట్టడానికని మహదేవయ్య అంటాడు..
ఇక సత్య సంధ్యా అన్న మాటలు గురించి ఆలోచిస్తూ క్రిష్ ఎలా ఉన్నాడో ఎక్కడున్నాడో అని బాధపడుతూ ఉంటుంది.. అప్పుడే నందిని విశాలక్షి అక్కడికి వస్తారు. మాకు ఒక్క విషయం కూడా చెప్పాలని నీకు అనిపించలేదా అని సత్యతో అంటారు. సత్య మీకు చెప్పకూడదని కాదు కానీ మీరు ఏమైపోతారో ఫీలవుతారు అని నేను చెప్పలేదు నాకైతే ఆ ఇంటి నుంచి బయటికి రాగానే చాలా మనశ్శాంతిగా ఉంది అని అంటుంది ఇక క్రిష్ ఎక్కడ అని నందిని అడగ్గాని ఏమో ఏ టైం కి వస్తాడు ఎక్కడ వస్తాడు ఎప్పుడొస్తాడో కూడా తెలియదు నిద్ర వచ్చే టైం కి వచ్చి నిద్రపోతాడు అని అంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో సత్య క్రిష్ ను మార్చుకొనే ప్రయత్నం చేస్తుంది.. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి…