BigTV English

Aamir Khan: కొడుకు డెబ్యూ మూవీ ఫ్లాప్.. మంచి పనే జరిగిందంటూ అమీర్ షాకింగ్ కామెంట్స్

Aamir Khan: కొడుకు డెబ్యూ మూవీ ఫ్లాప్.. మంచి పనే జరిగిందంటూ అమీర్ షాకింగ్ కామెంట్స్

Aamir Khan: చాలావరకు స్టార్ హీరోలు తమ వారసులు కూడా తమలాగా సక్సెస్‌ఫుల్ అవ్వాలని కోరుకుంటూ ఉంటారు. దానికోసం వారు కూడా కష్టపడతారు. టాలీవుడ్ అనే కాదు.. ప్రతీ భాషా పరిశ్రమలో ఇదే పరిస్థితి. కొడుకు హీరోగా సక్సెస్ అయ్యేవరకు తండ్రి తపన పడుతూనే ఉంటారు. కానీ తండ్రి రేంజ్‌లో సక్సెస్ అయిన వారసులు చాలా తక్కువమంది ఉన్నారు. ఇప్పటికీ చాలామంది యంగ్ హీరోలు ఆ సక్సెస్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. అందులో జునైద్ ఖాన్ కూడా ఒకడు. అమీర్ ఖాన్ వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన జునైద్‌కు మొదటి సినిమాతో అంతగా లక్ కలిసి రాలేదు. దీనిపై అమీర్ ఖాన్ స్పందించాడు.


థియేటర్లలో ఆకట్టుకోలేదు

బాలీవుడ్ సీనియర్ హీరోల్లో మిస్టర్ పర్ఫెక్షనిస్ట్‌గా పేరు తెచ్చుకున్నాడు అమీర్ ఖాన్. తను ఏ సినిమా చేసినా, అందులో ఏ పాత్రలో కనిపించినా దానికి తనను తాను తగినట్టుగా మార్చుకుంటాడని ఫ్యాన్స్ గర్వంగా చెప్తుంటారు. అలా ఇన్నేళ్లు తన కెరీర్‌ను జాగ్రత్తగా బిల్డ్ చేసుకున్నాడు ఈ హీరో. ఇప్పుడు తన వారసుడిని ఇండస్ట్రీకి పరిచయం చేసే టైమ్ వచ్చేసింది. అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ హీరోగా పరిచయం అయ్యాడు. ముందుగా తను నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ మూవీ అయిన ‘మహారాజ్’తో ప్రేక్షకులను పలకరించాడు. కానీ థియేటర్లలో తన డెబ్యూ మూవీ మాత్రం ‘లవ్‌యాపా’. జునైద్ డెబ్యూ మూవీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోకపోవడంపై అమీర్ ఖాన్ (Aamir Khan) రియాక్ట్ అయ్యాడు.


ఇద్దరి వారసుల ఎంట్రీ

తమిళంలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా సూపర్ డూపర్ హిట్ అయిన ‘లవ్ టుడే’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిన చిత్రమే ‘లవ్‌యాపా’. ఈ మూవీతో అమీర్ ఖాన్ వారసుడు జునైద్ ఖాన్ (Junaid Khan) మాత్రమే కాదు.. శ్రీదేవి వారసురాలు ఖుషీ కపూర్ కూడా హీరోయిన్‌గా వెండితెరపై మొదటిసారి అడుగుపెట్టింది. దీంతో వీరిద్దరి సినిమా ఎలా ఉంటుందా అని ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలయ్యింది. యూత్‌ను ఎంటర్‌టైన్ చేసే కథతో తెరకెక్కినా కూడా ‘లవ్‌యాపా’కు పెద్దగా ఆదరణ లభించలేదు. జునైద్ ఖాన్ సక్సెస్ అవ్వాలని ఎంతో ఆశపడ్డ అమీర్‌కు నిరాశే మిగిలింది. కానీ ఆ మూవీ ఫ్లాప్ అవ్వడం మంచిదే అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు అమీర్ ఖాన్.

Also Read: పెళ్లి కాకుండానే తల్లిదండ్రులైన తమన్నా- విజయ్.!

నాలాగే నా కొడుకు

‘‘లవ్‌యాపా (Loveyapa) ఫ్లాప్ అయ్యి మంచే జరిగింది. జునైద్ బాగానే చేశాడని నాకు అనిపించింది. అలాగే మెల్లగా నేర్చుకుంటాడు. తను చాలా టాలెంటెడ్, తను తను చేసే పాత్రకు న్యాయం చేస్తాడు. నాలాగే జునైద్‌కు కూడా డ్యాన్స్ అయితే రాదు’’ అంటూ తనను తన కుమారుడితో పోల్చుకున్నాడు అమీర్ ఖాన్. చాలావరకు ఈరోజుల్లో బాలీవుడ్‌లో నెపో కిడ్స్ ఎంత గ్రాండ్‌గా లాంచ్ అయినా కూడా వారికి వెంటనే సక్సెస్ రావడం లేదు. పైగా వారిపై ట్రోల్స్ కూడా విపరీతంగా వస్తున్నాయి. తాజాగా సైఫ్ అలీ ఖాన్ వారసుడు ఇబ్రహీం అలీ ఖాన్ కూడా తన మొదటి సినిమాతో ప్రేక్షకులను పలకరించగా.. తనపై, తన యాక్టింగ్‌పై సోషల్ మీడియాలో విపరీతమైన నెగిటివిటీ ఏర్పడింది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×