Tamannaah: హీరోలకు మాత్రమే కాదు.. హీరోయిన్స్‌కు కూడా ప్రేమతో స్పెషల్ ట్యాగ్స్ ఇస్తుంటారు అభిమానులు. ముఖ్యంగా టాలీవుడ్‌లో చాలామంది సీనియర్ హీరోయిన్లకు ఇలాంటి ట్యాగ్స్ ఉన్నాయి. అలాంటి వారిలో తమన్నా ఒకరు. తెలుగులో తన కెరీర్‌ను స్లోగా స్టార్ట్ చేసిన తమన్నా.. ఆ తర్వాత మెల్లగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ తన యాక్టింగ్‌కు, గ్లామర్‌కు, డ్యాన్స్‌కు అందరూ ఫిదా అయ్యేలా చేసింది. అలా భారీ ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకుంది. ఇతర భాషలతో పోలిస్తే తమన్నాకు తెలుగులోనే ఎక్కువమంది ఫ్యాన్స్ ఉన్నారు. తనను ప్రేమగా మిల్కీ బ్యూటీ అని పిలుచుకుంటారు తన అభిమానులు. ఆ మిల్కీ బ్యూటీ ట్యాగ్‌పై తమన్నా తాజాగా స్పందించింది.
ప్రమోషన్స్ కష్టాలు
ఎక్కువగా కమర్షియల్ సినిమాల్లో స్టార్ హీరోలతో కలిసి నటించిన తమన్నా.. ఇప్పుడిప్పుడే తన కంఫర్ట్ జోన్ నుండి బయటికి వస్తోంది. అలా ముందుగా ‘ఓదెల 2’లో శివశక్తి పాత్రతో తన ప్రయోగాన్ని మొదలుపెట్టింది. అసలు తమన్నా లాంటి ఒక స్టార్ హీరోయిన్ అఘోరీ పాత్రలో నటించగలదా అని అందరూ సందేహపడినా తన యాక్టింగ్‌తోనే అందరికీ సమాధానం చెప్పింది. ‘ఓదెల 2’ (Odela 2)ను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడం కోసం ప్రమోషన్స్ విషయంలో తమన్నా చాలా కష్టపడింది. అందులో భాగంగానే తను పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో అభిమానులు చూపించే ప్రేమ గురించి, వారంతా కలిసి తనకు అందించిన మిల్కీ బ్యూటీ ట్యాగ్ గురించి మాట్లాడింది.
నేను నమ్మను
తమన్నా ప్రస్తావన వస్తే ఎక్కువగా తన లుక్స్ గురించే మాట్లాడతారు. దానిపై తను ఎలా ఫీలవుతుందో మొదటిసారి చెప్పుకొచ్చింది. ‘‘నేనెప్పుడూ ఒక విషయానికి బాధితురాలిగా ఉండిపోవాలని అనుకోను. నేను అందంగా ఉండడం వల్లే అవకాశాలు రావట్లేదని కూడా చాలామంది అంటుంటారు. కానీ అదంతా నాకు నమ్మాలని అనిపించదు. నేను విజువల్ మీడియాలో పనిచేస్తున్నాను. దానికి తగ్గట్టుగానే కనిపించాలి. స్టార్లు అనేవాళ్లు ఎప్పుడూ అలాంటి స్థాయిని అందుకోవాలని ప్రయత్నిస్తుంటారు. కానీ వాటన్నింటితో పాటు ఒక కథను ఎలా చెప్తున్నామో కూడా ముఖ్యమనేది నేను బలంగా నమ్ముతాను’’ అని తెలిపింది తమన్నా.
Also Read: సిద్ధుకు ఘోరమైన దెబ్బ.. ఆ ఒక్క ఏరియాలోనే ఏడు కోట్ల లాస్.?
మీడియా వల్లే
ఇక అభిమానులంతా తనకు అందించిన మిల్కీ బ్యూటీ ట్యాగ్‌పై స్పందించింది తమన్నా (Tamannaah). ‘‘వాళ్లు నన్ను పిలవడం కోసం మిల్కీ బ్యూటీ అనే ట్యాగ్ క్రియేట్ చేయడం చాలా స్వీట్‌గా అనిపిస్తుంది. ఆ తర్వాత మీడియా కూడా దీనికి అలవాటు పడడంతో ఇది బాగా ఫేమస్ అయిపోయింది. అలా అని ఆ ట్యాగ్‌ను దృష్టిలో పెట్టుకొని నా ఛాయిస్‌ల విషయంలో నేనేం మారలేదు’’ అని తెలిపింది. తాజాగా విడుదలయిన ‘ఓదెల 2’ పాజిటివ్ టాక్‌ను సంపాదించుకుంది. అసలు తమన్నా లాంటి స్టార్ హీరోయిన్ శివశక్తి పాత్రలో నటిస్తుంది అనగానే ఈ మూవీపై పాజిటివ్ బజ్ ఏర్పడింది. మౌత్ టాక్ కూడా పాజిటివ్‌గా వస్తే సినిమా సూపర్ హిట్ అవ్వడం ఖాయమంటున్నారు ఇండస్ట్రీ నిపుణులు.