BigTV English
Advertisement

DK Aruna Vs Etela: క్లైమాక్స్‌లో ఈటెల-అరుణ.. బీజేపీ షాకిచ్చేదెవరికి?

DK Aruna Vs Etela: క్లైమాక్స్‌లో ఈటెల-అరుణ.. బీజేపీ షాకిచ్చేదెవరికి?

DK Aruna Vs Etela: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎంపిక క్లయిమాక్స్‌కు చేరిందా? రేసులో ఇద్దరు నేతలు మిగిలారా? ఎవరి వైపు అధిష్టానం మొగ్గు చూపుతుంది? తొలుత ఈటెల వైపు మొగ్గు చూపినా, అరుణ అయితే బెటరని ఓ అంచనాకు వచ్చిందా? ఈటెలకు మరో పదవి ఇవ్వాలనే ఆలోచన చేస్తోందా? దీనిపై ఆ పార్టీలో ఎలాంటి చర్చ జరుగుతోంది?


చివరి దశలో అధ్యక్ష పదవి

తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎంపిక ఆలస్యమవుతోంది. తొలుత జనవరి సెకండ్ వీక్‌లో ప్రకటన వస్తుందని జోరుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఫిబ్రవరి చివరలో అని అంటున్నారు. ప్రస్తుతం అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే కొత్త అధ్యక్షుడు రాబోతున్నారని వరంగల్ పర్యటనలో వెల్లడించారు. దీంతో పార్టీలో  ఏం జరుగుతోందన్న చర్చ నేతలు, కార్యకర్తల్లో మొదలైంది.


తెలంగాణలో రాజకీయాలు ప్రస్తుతం బీసీల చుట్టూనే తిరుగుతోంది. రాష్ట్ర జనాభాలో 56 శాతం బీసీలు ఉన్నట్లు కులగణన నివేదిక తేల్చింది. ఈవిషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా వెల్లడించారు. సంస్థల ఎన్నికల్లో మా పార్టీ 42 సీట్లను బీసీలకు ఇస్తామన్నారు. రిజర్వేషన్ల విషయంలో కేంద్రం వెనక్కి తగ్గినా, పార్టీ పరంగా తాము సీట్లు కేటాయిస్తామని స్వయంగా వెల్లడించారు. ఈ క్రమంలో బీజేపీ ఆలోచనలో పడింది.

తొలుత ఈటెలను నియమించాలనే దాదాపు ఓ అంచనాకు వచ్చారు. కాంగ్రెస్ పార్టీని అనుసరిస్తే ఆ ట్రాప్‌లో పడ్డామనే అపవాదు వస్తుందని కమలనాథులు భావిస్తున్నారట. ఎలాంటి సమస్య లేకుండా మహిళకు అప్పగిస్తే బాగుంటుందని మెజార్టీ నేతలు చెబుతున్నారు. అలాగైతే రేసులో ఉన్న ఏకైన మహిళ డీకె అరుణ. మహిళా కోటాలో ఆమెని ఎంపిక చేసే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే ఈటెలకు బిగ్ షాక్ తప్పదని అంటున్నారు.

ALSO READ: ఆరునెలల తర్వాత పార్టీ ఆఫీసుకు కేసీఆర్

అరుణకే ఎక్కువ ఛాన్స్?

బీజేపీ ఆలోచన వెనుక కారణాలు చాలానే ఉన్నాయట. స్థానిక సంస్థల ఎన్నికల ముందు అధ్యక్షురాలిగా డీకే అరుణను నియమిస్తే పార్టీ మంచి ఫలితాలు వస్తాయని లెక్కలు వేస్తోందట ఆ పార్టీ. దీనిద్వారా దక్షిణ తెలంగాణ లో పార్టీ పట్టు సాధించేందుకు అవకాశాలు ఉంటాయని అంటున్నారు. ప్రస్తుతం తెలంగాణలో ప్రధాన పార్టీలు మహిళలకు అధ్యక్ష పదవి ఇచ్చిన సందర్భం లేదు. ఇది పార్టీకి కలిసి వస్తుందని భావిస్తోంది.

డీకే అరుణ విషయానికొస్తే.. మూడుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేసిన అనుభవం ఆమె సొంతం. ప్రస్తుతం మహబూబ్‌నగర్ ఎంపీగా కొనసాగుతున్నారు. అరుణకు పగ్గాలు అప్పగిస్తే పార్టీ బలోపేతం అంచనా వేస్తున్నారు. గతంలో కర్ణాటక రాష్ట్ర ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా పని చేశారామె. కేంద్రం మైనార్టీ, వక్ఫ్ బోర్డు ఆస్తుల కమిటీలో సభ్యురాలిగా కొనసాగుతున్నారు.

సార్వత్రిక ఎన్నికల్లో  ఎంపీగా గెలిచిన తర్వాత తెలంగాణ నుంచి కేంద్రమంత్రిగా డీకే అరుణకు అవకాశం కల్పిస్తారని ఆమె వర్గీయులు భావించారు. అయితే ఆ పదవి బండి సంజయ్‌కు దక్కింది. మరో పదవి వస్తుందని ఆమె చాలా ఆశలు పెట్టారు. ఇటీవల జరిగిన రాష్ట్రాల్లో ఎన్నికల్లో వరుసగా బీజేపీ విజయం సాధించింది. ఈ క్రమంలో ఢిల్లీ స్థాయిలో పైరవీలు మొదలైనట్టు తెలుస్తోంది. మొత్తానికి తెలంగాణ బీజేపీ నేతల ఉత్కంఠకు ఎప్పుడు తెరపడుతుందో చూడాలి.

Related News

Jupally Krishna Rao: మంత్రి జూపల్లిని టార్గెట్ చేసింది ఎవరు?

Jubilee Hills: గెలిచినా.. ఒడినా.. ఆయనదే భారం.. కిషన్ రెడ్డికి ఇది పెద్ద పరీక్షే!

HYDRA: ఇదిరా హైడ్రా అంటే.. కబ్జాల చెర వీడిన 1.27 ఎకరాల పార్కు

Khammam: ఖమ్మం డిసీసీ, నగర అధ్యక్ష పదవులకు 66 మంది పోటీ

Women’s Commission serious: కురిక్యాల పాఠశాల ఘటనపై మహిళా కమిషన్ సీరియస్.. కఠిన చర్యలకు ఆదేశం!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Cotton Procurement: మొoథా తుపాను ఎఫెక్ట్.. పత్తి రైతులను అలర్ట్ చేసిన ప్రభుత్వం.. కొనుగోళ్లు ప్రారంభం

Hyderabad City Police: సోషల్ మీడియాలో ఫేక్ పోస్టర్ వైరల్.. నమ్మితే ఆస్తులు పోయినట్టే.. జాగ్రత్త భయ్యా

Big Stories

×