BigTV English

IND vs Aus 2nd Test: 180 పరుగులకే కుప్పకూలిన టీమిండియా..ఆదుకున్న తెలుగోడు !

IND vs Aus 2nd Test: 180 పరుగులకే కుప్పకూలిన టీమిండియా..ఆదుకున్న తెలుగోడు !

IND vs Aus 2nd Test: టీమిండియా ( Team India) వర్సెస్ ఆస్ట్రేలియా ( Australia ) మధ్య జరుగుతున్న పింక్ బాల్ టెస్ట్.. మ్యాచ్లో రోహిత్ శర్మ ( Rohit sharma) సేన దారుణంగా విఫలమైంది. ఏ ఒక్క బాటర్ కూడా నిలబడి బ్యాటింగ్ చేయలేకపోయాడు. ఓపెన్ యశస్వి జైస్వాల్ నుంచి… 11వ వికెట్ మహమ్మద్ సిరాజు వరకు ఎవరు పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో పింకీ బాల్ టెస్ట్ మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ ఆడిన టీమ్ ఇండియా…. 180 పరుగులకు కుప్పకూలింది.


Also Read: IND vs Aus 2nd Test: బ్యాటింగ్‌ చేయనున్న టీమిండియా.. భారీ మార్పులతో బరిలోకి !

44.1 ఓవర్ లలో 180 పరుగులు చేసిన టీమ్ ఇండియా ఆల్ అవుట్ అయింది. ఈ మ్యాచ్ లో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ( Nitish Kumar Reddy ) ఒక్కడే 42 పరుగులు చేసి…ఆస్ట్రేలియాను కంగారుపెట్టాడు. నితీష్ కుమార్ రెడ్డి తో ( Nitish Kumar Reddy ) పాటు రవిచంద్రన్ అశ్విన్ ( Ravichandran Ashwin), కె ఎల్ రాహుల్ ( Kl Rahul), గిల్ అలాగే రిషబ్ పంత్ ( Rishabh Pant)పర్వాలేదనిపించారు. మరోసారి విరాట్ కోహ్లీ తో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ ( Rohit sharma) దారుణంగా విఫలమయ్యాడు.


ఇక యశస్వి జైస్వాల్ ( Yashasvi Jaiswal)… ఒక బంతి ఆడి డక్ అవుట్ అయ్యాడు. గత మ్యాచ్లు అద్భుతంగా ఆడిన ఇతను… ఈ మ్యాచ్ లో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ వేసిన బంతికి వికెట్ల ముందు దొరికిపోయాడు యశస్వి జైస్వాల్ ( Yashasvi Jaiswal). ఇక మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ మొదట బ్యాటింగ్ చాలా నెమ్మదిగా చేసినప్పటికీ… ఆ తర్వాత పుంజుకున్నట్లు కనిపించాడు. కానీ 64 బంతుల్లో 37 పరుగులు చేసి అవుట్ అయ్యాడు కేఎల్ రాహుల్.

ఇందులో ఆరు ఫోర్స్ ఉన్నాయి. ఇక రెండవ టెస్టులో ఇంటర్ ఇచ్చిన శుభ మన్ గిల్ 51 బంతుల్లో 31 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. బోలాండ్ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయాడు గిల్. అనంతరం బ్యాటింగ్కు వచ్చిన విరాట్ కోహ్లీ కూడా దారుణంగా విఫలమయ్యాడు. ఒకే ఒక్క ఫోర్ కొట్టి..పెవిలియన్ బాటపట్టాడు విరాట్ కోహ్లీ. ఇక మిడిల్ రైడర్ లో వచ్చిన రోహిత్ శర్మ 23 బంతులు ఆడే మూడు పరుగులు మాత్రమే చేశాడు.

Also Read: IND VS AUS 2nd Test: పింక్ బాల్ టెస్ట్ టైమింగ్స్ లో మార్పులు.. ఫ్రీగా ఎక్కడ చూడాలంటే..?

బోలాండ్ బౌలింగ్లో రోహిత్ శర్మ వికెట్ల ముందు దొరికిపోయాడు. కానీ చివరకు తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ( Nitish Kumar Reddy ) రాణించాడు. తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ( Nitish Kumar Reddy ) ఒక్కడే 42 పరుగులు చేసి… రాణించాడు. కానీ చివరకు మిచల్ స్టార్క్ బౌలింగ్ లో హెడ్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ( Nitish Kumar Reddy ). దీంతో టీమిండియా 180 పరుగులకే కుప్పకూలింది. ఇక ఈ మ్యాచ్ లో మిచెల్ స్టార్క్ కు ఏకంగా 6 వికెట్లు పడ్డాయి.

 

Related News

IND Vs PAK : గేమ్ ఓడిపోయాం కానీ యుద్ధం గెలిచాం : రవూఫ్ భార్య

IND Vs PAK : దుబాయ్ స్టేడియంలో పాకిస్థాన్ ఫ్యాన్ పై దాడి… రంగంలోకి పోలీసులు!

Fakhar Zaman catch : టీమిండియా తొండాట‌…ఐసీసీకి పాకిస్థాన్ ఫిర్యాదు

Abhishek Sharma: అభిషేక్ శ‌ర్మకు గ్రౌండ్ లోనే ప్ర‌పోజ్‌..ఫ్లయింగ్ కిస్సులు ఇచ్చి మ‌రీ !

IND VS PAK: మ‌రోసారి టీమిండియా వ‌ర్సెస్ పాక్ మ్యాచ్‌..చ‌చ్చిన పామును మ‌ళ్లీ చంప‌డ‌మే

AK-47 Celebration: ధోని చేస్తే క‌రెక్ట్‌.. మేం చేస్తే త‌ప్పా…!

Haris Rauf: రఫేల్ కూల్చేశామంటూ హ‌రీస్ ర‌ఫ్ సెలబ్రేషన్..ఆడుకున్న ఫ్యాన్స్‌

Ind Vs Pak: చ‌ల్ పోరా పో….షాహిన్ అఫ్రీదిని బండ బూతులు తిట్టిన అభిషేక్‌…సిక్స్ కొట్టి మ‌రీ

Big Stories

×