Abhishek bachchan:బాలీవుడ్ స్టార్ హీరోలలో అభిషేక్ బచ్చన్ (Abhishek Bacchan) కూడా ఒకరు. ఒకప్పుడు స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగి తన సినీ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న అమితాబ్ బచ్చన్ వారసుడిగా ఇండస్ట్రీలోకి రెఫ్యూజీ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చారు అభిషేక్ బచ్చన్. అయితే ఈ సినిమా హిట్ కాకపోయినప్పటికీ విమర్శకుల ప్రశంసలు అందుకొని, ఆ తర్వాత ఇండస్ట్రీలో ఎన్నో హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు. అయితే అలాంటి అభిషేక్ బచ్చన్ ప్రపంచ సుందరిగా కిరీటం అందుకున్న హీరోయిన్ ఐశ్వర్యరాయ్ (Aishwarya rai) ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఐశ్వర్యరాయ్ కంటే ముందే కరిష్మా కపూర్ (Karishma kapoor ) తో పెళ్లి వరకు వెళ్లినప్పటికీ అది జరగలేదు. ప్రస్తుతం ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ లకు ఆరాధ్య బచ్చన్ అనే కూతురు కూడా ఉంది. వీరి జీవితం ఇలా సాఫీగా సాగిపోతున్న సమయంలో.. విడాకుల వార్తలు వినిపించి ఇండస్ట్రీ మొత్తం రూమర్లు వ్యాపించాయి. కానీ ఈ విడాకుల వార్తలలో ఎలాంటి నిజం లేదు అని, ఈ జంట ప్రతిసారి కొట్టి పారేస్తూనే ఉంది. అంతేకాదు విడాకుల రూమర్లు వినిపించినప్పటి నుండి ఈ జంట ఎక్కువగా మీడియా ముందుకు కలిసి రావడానికి ఇష్టపడుతుంది. ఎందుకంటే అలా కలిసి వస్తేనైనా ఈ విడాకుల వార్తలు ఆగిపోతాయని వీరి ఉద్దేశం కావచ్చు.
ఫ్యామిలీపై అభిషేక్ బచ్చన్ కామెంట్స్..
ఈ విషయం పక్కన పెడితే. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో అభిషేక్ బచ్చన్.. అది అంత ఈజీ కాదు అంటూ తన ఫ్యామిలీ పై షాకింగ్ కామెంట్లు చేశారు. అసలు విషయం ఏమిటంటే.. అభిషేక్ బచ్చన్ ఏ ఇంటర్వ్యూలో పాల్గొన్నా కూడా.. ఆ ఇంటర్వ్యూలో కచ్చితంగా తన తండ్రితో పోలుస్తూ తన నటనని పొగుడుతూ ఉంటారట. మరికొంతమందేమో అభిషేక్ బచ్చన్ అమితాబ్ బచ్చన్ (Amitabh bachchan) అంత గొప్పవాడు ఏమీ కాదు అంటారట. అయితే తను నిజంగానే తన తండ్రి అంత గొప్పవాడిని కాదని, తన తండ్రితో తనకు పోలిక ఉండదని చెబుతాను. అలాగే ఎదుటివాళ్లు నన్ను నా తండ్రితో పోలుస్తారు.నా తండ్రిలాగే నటిస్తానని అంటూ ఉంటారు.కానీ మరి కొంతమందేమో అమితాబ్ బచ్చన్ తో అభిషేక్ బచ్చన్ కి పోలిక ఏంటి..ఆయన అనర్హుడు అని అంటూ ఉంటారు. కానీ ఎవరైతే తాను అనర్హుడు అంటారో వారితో నేను ఏకీభవిస్తాను.ఎందుకంటే తండ్రి నటనతో నాకు ఎప్పటికీ పోలిక ఉండదు. నా దృష్టిలో మా నాన్న ది బెస్ట్.. అది అంత ఈజీ కాదు. నేను ఇప్పటికి కూడా నా ఫ్యామిలీ విషయంలో నా భార్య విషయంలో చాలా గర్వంగా ఉంటాను.
వాళ్లంటే నాకు ఎంతో గౌరవం..వాళ్ళు సాధించిన ఘనతలు భవిష్యత్తులో వాళ్ళు చేయబోయే పనుల గురించి నేను ఎప్పటికీ సంతోషంగానే ఉంటాను. ఇక చాలామంది నటనలో నా తండ్రితో పోలుస్తూ ఉంటారు. అయితే మొదట్లో నాకు అది చాలా కష్టంగా ఉండేది.కానీ రాను రాను అలవాటై పోయింది.అలాగే నా ఆలోచన విధానాన్ని కూడా మార్చుకున్నాను. ఇక నా తండ్రి అమితాబ్ బచ్చన్ లా 80స్ లో కూడా సినిమా ఇండస్ట్రీలో వర్క్ చేయాలన్నదే నా కల. ఆయన ఇప్పటికి కూడా 80 ఏళ్ల వయసు దాటినా కూడా ఎంతో యాక్టివ్ గా ఉండి సినిమాల్లో వర్క్ చేస్తున్నారు. నేను కూడా ఆయనలాగే 80 ఏళ్ళు వచ్చినా కూడా సినిమా ఇండస్ట్రీలో రాణించి నా కూతురు ఆరాధ్య బచ్చన్ కి ఆదర్శంగా నిలవాలని నేను కోరుకుంటున్నాను. అలాగే నా కుటుంబం కారణంగానే నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను.అందుకే ఎప్పటికి నేను నా కుటుంబాన్ని గౌరవిస్తూనే ఉంటా..మా తాతయ్య అందించిన ప్రేమని కొనసాగించేందుకు ఎప్పటికీ వర్క్ చేస్తూనే ఉంటాను అంటూ అభిషేక్ బచ్చన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.