BigTV English

Sardar 2 Shooting Spot: సర్ధార్ షూటింగ్‌లో ప్రమాదం, యాక్షన్ సీన్స్ చేస్తుండగా స్టంట్ మ్యాన్ మృతి

Sardar 2 Shooting Spot: సర్ధార్ షూటింగ్‌లో ప్రమాదం, యాక్షన్ సీన్స్ చేస్తుండగా స్టంట్ మ్యాన్ మృతి

Accident While Shooting Sardhar, Stunt Man Died While Doing Action Scenes: సినీ ఇండస్ట్రీ అంటే రంగుల ప్రపంచం అనుకుంటారు చాలామంది.కానీ వారికి తెలియని మ్యాటర్ ఏంటంటే..నిత్యం అదొక బ్రతుకుతో పోరాటం చేయాల్సిన పరిస్థితిలా మారుతుంది. మూవీస్ తగ్గట్టుగా సీన్స్ మంచిగా రావడం కోసం రకరకాల ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తుంటారు. ఇందులో కొన్ని ప్రమాదకరమైనవి అయితే మరికొన్నింటి కారణంగా గాయాలపాలైన ఘటనలు కోకొల్లలు అనే చెప్పాలి. ఎందుకంటే మూవీ అంటేనే పరుగుల పోరాటం, ప్రతి టెక్నిషియన్ ఇందులో పని చేయాల్సిందే. డ్యాన్స్ నుండి సీన్ వరకు..యాక్షన్ సీన్స్‌ నుండి మూవీ కంప్లీట్ అయ్యేంతవరకు నానా ఇబ్బందులు పడితేనే ఈ మూవీ కంప్లీట్ అవుతుంది.


తమిళ హీరో కార్తీ నటించిన లేటెస్ట్ మూవీ సర్ధార్ 2.ఈ మూవీ షూటింగ్‌లో ప్రమాదవశాత్తు స్టంట్ మ్యాన్ ఇరవై అడుగుల ఎత్తు నుండి జారిపడి మృతిచెందాడు.దీంతో ఈ మూవీ షూటింగ్‌లో ప్రమాదఛాయలు అలుముకున్నాయి. అంతేకాకుండా ఈ ఘటనపై మూవీ యూనిట్ తీవ్రదిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు తనతో పాటుగా మరో ఇద్దరు అసిస్టెంట్ స్టంట్ మ్యాన్‌లకు గాయాలు అయినట్టు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన టైమ్‌లో కార్తీ షూటింగ్ స్పాట్‌లో ఉన్నట్లు సమాచారం. గాయాలైన క్షతగాత్రులను దగ్గరలోని ఆస్పత్రికి ఆంబులెన్స్‌లో తరలించారు.

Also Read: ప్రభాస్ రాజాసాబ్‌ మూవీలో బిగ్‌బి సాంగ్‌..?


ఇక గతంలో లోకనాయకుడు యాక్ట్ చేసిన భారతీయుడు 2 మూవీ షూటింగ్‌ ప్రమాదంలో ఫైట్ మాస్టర్ మృతి చెందిన ఘటన మరవకముందే తాజాగా సర్ధార్ 2 షూటింగ్‌లో ప్రమాదవశాత్తు స్టంట్ మ్యాన్ ఇరవై అడుగుల ఎత్తు నుండి జారిపడి మృతిచెందడంతో తమిళ మూవీ ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్టంట్ చేసే సమయంలో స్టంట్ మ్యాన్ ఎజుమలై మృతి చెందడంతో షూటింగ్‌ని ఆపేశారు. తన మృతిపట్ల సంతాపం వ్యక్తం చేసింది. ఇటీవల టాలీవుడ్‌లో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ దేవర మూవీ షూటింగ్ స్పాట్‌లోనూ తేనెటీగలు దాడి చేయగా చాలామంది దవాఖానలో చికిత్స పొందారు.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×