Allu Arjun Case : ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన వ్యక్తి అల్లు అర్జున్(Allu Arjun).. అంశం సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన దుర్ఘటన. ఈ రెండు అంశాలు అటు ప్రజలలో ఇటు ఆడియన్స్ లో వ్యతిరేకత కలిగిస్తున్నాయని నెటిజన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు. సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన సన్నివేశం ఎంతలా అందరి మనసులను ద్రవింపజేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అభిమానంతో అభిమాన హీరో కోసం సినిమా చూడడానికి వెళ్తే.. ఏకంగా కానరాని లోకాలకు వెళ్ళిపోయింది ఒక తల్లి. ఆమె కొడుకు ప్రాణాలతో పోరాడుతున్నారు. ఇక తల్లి వస్తుందని ఆమె కూతురు ఎంతలా పరితపిస్తుందో ఆ బాధ వర్ణనాతీతం. ఈ ఘటన అల్లు అర్జున్ ని కలచివేసిందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ నిజంగా ఆయనను ఈ సంఘటన బాధపెట్టి ఉంటే ఎందుకు బాధితురాలు కుటుంబాన్ని పరామర్శించలేదు? అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.
బన్నీ గురించి అసలు విషయం బయటపెట్టిన ఏసీపీ..
ఇదిలా ఉండగా తెలంగాణ సమావేశాల అనంతరం నిన్న రాత్రి అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మరీ.. తన తప్పు లేకుండానే తనపై ఆరోపణలు చేస్తున్నారని కామెంట్లు చేయగా.. దీనిపై మండిపడ్డ ఏసీపీ రిమాండ్ ఖైదీ అసలు ప్రెస్ మీట్ ఎలా పెడతారు? అంటూ ప్రశ్నించారు. దీనికి తోడు ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలు మరొకసారి సంచలనంగా మారాయి. తాజాగా ఏసీపీ రమేష్ మాట్లాడుతూ..” అల్లు అర్జున్ మేనేజర్ తో.. సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందింది. అబ్బాయి సీరియస్ గా ఉన్నాడని తెలిపాము. అయినా సరే అతడు మమ్మల్ని అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళనివ్వలేదు. బౌన్సర్స్ ను నెట్టేసి వెళ్లి అల్లు అర్జున్ చెవిలో చెప్పాను. ఒకరు చనిపోయారు, మరొకరు సీరియస్ గా ఉన్నారని, అయినా సరే ఆయన ఏ మాత్రం పట్టించుకోకుండా సినిమా చూసి వెళ్తాము అని అన్నారు. కానీ పరిస్థితి ఉద్రిక్తతగా మారుతున్న నేపథ్యంలో డీజీపీ గారికి చెప్పి అల్లు అర్జున్ ని బయటకు తీసుకొచ్చాము” అంటూ అసలు విషయాన్ని వెల్లడించారు.
మానవత్వం లేకుండా ప్రవర్తించారా?
ఇక దీంతో బన్నీపై పూర్తి వ్యతిరేకత నెలకొంటోంది. నిన్న ప్రెస్ మీట్ లో ఏమో సినిమా మొదలవగానే దుర్ఘటన వార్త విని వెంటనే వెళ్లిపోయానని చెప్పిన ఆయన, ఆ తర్వాత సినిమాలోని జాతర సీక్వెన్స్ వచ్చినప్పుడు సంతోషంగా ఊగిపోయిన వీడియో క్లిప్ కూడా బయటకు వచ్చింది. దీనికి తోడు ఏసీపీ రమేష్ కూడా అసలు నిజాన్ని బయట పెట్టడంతో అల్లు అర్జున్ ఎందుకు మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారు? అంటూ నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.ఒక కొడుకు ప్రాణాలతో పోరాడుతున్నాడు.. తల్లి మరణించింది.. కనీసం మానవత్వం లేకుండా అలా ఎలా సినిమా చూసి వెళ్తానని చెబుతారు.. కనీసం మనిషిగా అయినా ఆలోచించలేకపోయారు అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై అల్లు అర్జున్ ఎలా స్పందిస్తారో చూడాలి అంటూ కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. నిజానికి ఎవరు ఎన్ని కామెంట్లు చేసినా.. పోయిన ప్రాణం మళ్ళీ రాదు. జరిగిన నష్టాన్ని ఎవరు పూడ్చలేరు.. ఇకనైనా బాధిత కుటుంబానికి అండగా నిలవాలి అంటూ అటు అభిమానులు కూడా కోరుతున్నట్లు తెలుస్తోంది.